
వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
సాక్షి, విజయనగరం: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ప్రజాపాలన అని, చంద్రబాబు పాలనలో దోచుకోవడం దాచుకోవడమే జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలతో జనాలు చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ నాయకులు జ్వరాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
జ్వరాలపై మంత్రులు, అధికారులు ఏం చర్యలు తీసుకుంటాన్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. టీడీపీ నాయకులు ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనకు, వైఎస్ పాలనకు చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment