
'టీడీపీకి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు'
నెల్లూరు: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి, పాశం సునీల్ కుమార్ ఖండించారు. టీడీపీ నేతలు అధికారమదంతో విర్రవీగుతున్నారని విమర్శించారు.
టీడీపీకి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని ప్రతాప్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో పోలీసులు భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.