కేసే లేకుండా అరెస్ట్ ఎలా?
నెల్లూరు(క్రైమ్): ఈ నెల 13న జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎలాగైనా గెలుపొంది అధికారం దక్కించుకోవాలనే కుట్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్ లంటూ అధికార పార్టీ నేతలు దుష్ర్పచారానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నకిలీ మద్యం కేసులో అరెస్ట్‌కు రంగం సిద్ధం అంటూ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు బుధవారం కథనాలు ప్రసారం చేసి గందరగోళానికి తెరలేపాయి. అయితే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై కేసే నమోదు చేయలేదని, ఇక అరెస్ట్ ఎలా చేస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ప్రశ్నిస్తుండటం విశేషం.
జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో అధికార పార్టీ నేతలు కావలి నియోజకవర్గంలోని పలువురు జెడ్పీటీసీలను ప్రలోభపెట్టేందుకు శ్రీకారం చుట్టారు. దీన్ని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఐక్యంగా తిప్పికొట్టారు. టీడీపీ నేతలు దిగజారి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను లరెస్ట్ చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
టీడీపీ నేతల కుట్ర:
జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగారు. మా పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించి లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారు.
బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ
జెడ్పీ చైర్మన్ అభ్యర్థి
సిగ్గుచేటు:
ఎమ్మెల్యేల అరెస్ట్‌కు రంగం సిద్ధమంటూ అధికార పార్టీ నేతలు, బాకా పత్రికలు ప్రచా రం చేయడం సిగ్గుచే టు. అధికార పార్టీ నేతల తీరు ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టుగా ఉంది. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. అలాంటప్పుడు అరెస్ట్‌కు ఆ స్కారమే లేదు. అరెస్ట్‌ల పేరుతో భయభ్రాంతులను సృష్టించి ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకుంటున్నారు. అలాంటి కలలు నెరవేరవు.
మేరిగ మురళీధర్,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు