ఎంపీ మేకపాటికి రామిరెడ్డి అభినందన | mekapati rajamohan reddy Congratulation | Sakshi
Sakshi News home page

ఎంపీ మేకపాటికి రామిరెడ్డి అభినందన

Published Sun, May 18 2014 2:15 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

mekapati rajamohan reddy Congratulation

కావలి, న్యూస్‌లైన్: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కావలి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు. నెల్లూరులోని మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిసి అభినందలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ప్రతాప్‌కుమార్‌రెడ్డి కలిసి చర్చించారు. జిల్లాపరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని కూడా కలిశారు.
 
 ఈ సందర్భంగా వారందరు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి వెంట ముసునూరు పీఏసీఎస్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అల్లూరు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మేడా అశోక్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు డేగా రాము, ప్రళయకావేరి మల్లికార్జున ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement