నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో రెండో షిఫ్ట్‌ను నిర్వహించాలని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రతిపాదనలు పంపినట్లు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు.
-ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో రెండో షిఫ్ట్‌ను నిర్వహించాలని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రతిపాదనలు పంపినట్లు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనలు పంపామన్నారు.
రెండో షిఫ్ట్ ప్రారంభమైతే ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుంచి రెండో షిఫ్ట్ ప్రారంభించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రిని కోరామని ఎంపీ తెలిపారు.