రాష్ట్ర విభజన తగదు | YSRCP leader M.P Rajamohan reddy said state should not be divided | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజన తగదు

Published Sat, Jan 4 2014 3:05 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

YSRCP leader M.P Rajamohan reddy said state should not be divided

మర్రిపాడు, న్యూస్‌లైన్: అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లా కలిసి ఉన్న తెలుగు వారిని రాష్ట్ర విభజన పేరుతో వేరు చేయడం తగదని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. విభజనకు నిరసనగా శుక్రవారం మర్రిపాడులో నిర్వహించిన బంద్‌ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆది నుంచే ఖండిస్తున్నారన్నారు. విభజన నిర్ణయం వచ్చిన వెంటనే సీమాంధ్రలోని 175 మంది ఎమ్మెల్యేలతో సమైక్య తీర్మానం చేయిం చాలని జగన్ ప్రయత్నించారని తెలి పారు. కొన్ని పార్టీలు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం ఈపరిస్థితి దాపురించిందన్నారు.

అసెంబ్లీకి వచ్చిన బి ల్లును అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పోరాటం చేస్తున్నారన్నా రు. శుక్రవారం కూడా అసెంబ్లీ సమావే శం ప్రారంభమైన వెంటనే తమ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం కోసం పట్టుబ ట్టారని గుర్తుచేశారు. బాబు విభజనకు అనుకూలంగా 2008 ఆగస్టులో లేఖ ఇచ్చారన్నారు. ఇప్పుడు రెండు కళ్ల సి ద్ధాంతం పాటిస్తూ ప్రజలను మోసగించడం తగదని హెచ్చరించారు. మ హానేత వైఎస్సార్ ఉండుంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజ లను మోసగిస్తూ నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు తగిన గు ణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
 
 సీ మాంధ్రలోని 175 స్థానాల్లో 150 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. తెలంగాణలోనూ 30 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. కొం దరు నేతలు తిన్నంటి వాసాలు లెక్కేసే విధంగా వైఎస్ కుటుంబంపై బురద జల్లడం పద్ధతి కాదన్నారు. ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేయడం కుదరదన్నా రు.  ఆత్మకూరు నియోజకవర్గంలో స మస్యలు అన్ని పరిష్కారం కావాలంటే గౌతమ్‌రెడ్డిని గెలిపించాలని పిలుపుని చ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర అభినందనీయమన్నారు. గ్రామగ్రామాన పర్యటి స్తూ ప్రజా సమస్యలు తెలుసుకొనేం దుకు ఆయన కృషి మరువలేనిదన్నా రు.
 
 ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ని ర్వహించిన బంద్‌కు సహకరించిన వా రందరికి కృతజ్ఞతలు తెలిపారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని అన్ని పార్టీలను కలిసి పో రాటం చేస్తున్నారన్నారు. ఆయనకు ప్ర జలందరూ అండగా నిలవాలన్నారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి గౌ తమ్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. సూళ్లూరుపేట నేత దబ్బల రాజారెడ్డి మాట్లాడుతూ ఆనం వారిపై జగన్ విసిరిన బాణం మేకపాటి గౌతమ్‌రెడ్డేనన్నారు.
 
 ఆయన ఆరు అడుగుల బుల్లెట్‌లా ప్రజల్లోకి దూసుకుపోతున్న తీరు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు పాపకన్ను రాజశేఖర రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పాండురంగారెడ్డి, సన్నపురెడ్డి సుబ్బారెడ్డి, బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, పందిళ్లపల్లి గోపిరెడ్డి, రాములు నాయుడు, సోమల మాధవరెడ్డి, సూరా భాస్కర్ రెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, సతీష్, ఏఎస్‌పేట జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ, పర్వీన్, చంద్రికారెడ్డి, పద్మజయాదవ్ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement