సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: రేవంత్‌రెడ్డీ...నోరు అదుపులో పెట్టుకో, మరోసారి వైఎస్సార్ సీపీ అధినేతపై అవాకులు, చవాకులు పేలితే తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్ సీపీ యువత విభాగం జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం పోతిరెడ్డిపల్లిలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌కు బెయిల్‌పై బయటకు రావడంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. అందువల్లే టీడీపీ అధినేత చంద్రబాబు సహా రేవంత్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్‌పై అక్రమ కేసులు బనాయించినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా చేసేందుకు చంద్రబాబు పనిగట్టుకుని మరీ ఢిల్లీకి కుట్రలు పన్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు చేసినా అవి పనిచేయలేదన్నారు.
జగన్ జన నేత కాబట్టే ఆయన బెయిల్‌పై విడుదల కాగానే జనం బ్రహ్మరథం పట్టారన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందనీ, త్వరలోనే ఆయన కేసులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయట పడతారన్నారు. జగన్ నాయకత్వంలో పార్టీ తిరిగి పుంజుకోవటం ఖాయమన్నారు. జైలులో ఉన్న సమయంలో సైతం తమ అధినేత ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించారన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌ను, దానికి అంటకాగుతున్న టీడీపీ రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పి తీరుతారన్నారు. తెలంగాణలోనూ మహానేత వైఎస్సార్ అభిమానులున్నారనీ, పార్టీ ఈప్రాంతంలోనూ బలపడుతుందని శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో తమ పార్టీని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఖాదర్‌హుస్సేన్, సుధాకర్, బస్వరాజ్, తుకారాం, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో : గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి
Published Thu, Sep 26 2013 3:10 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement