
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై ఆరోపణలు చేసి లీడర్ కావాలని రేవంత్‌రెడ్డి ఆశపడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నైతికత గురించి రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రేవంత్‌కు ధైర్యముంటే కొడంగల్‌లో గెలిచి చూపించాలని సవాలు విసిరారు. గుజరాత్, హిమాచల్ ఫలితాలతో కాంగ్రెస్‌కు మరోసారి దిమ్మతిరిగిందని ఎద్దేవా చేశారు.
కాగా, ఫిరాయింపులు, అబద్ధాలతో దిగజారుడు పద్ధతుల ద్వారా గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment