
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చంద్రబాబు కోవర్ట్ అని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని విమర్శిస్తే పెద్దనాయకుడు అవుతానని రేవంత్‌రెడ్డి భ్రమపడుతున్నారని, మోదీని విమర్శించే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. మరోవైపు అమిత్‌షా ఒక్కసారి రాష్ట్రానికి వస్తేనే కాంగ్రెస్ వణికిపోతోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.