సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని బట్టబయలు చేశారని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ తెలంగాణ గోబెల్స్‌గా మారిపోయి వానాకాలం వడ్లను కొనకుండా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరో పించారు. శనివారం జరిగిన కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు.
ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకున్న బియ్యాన్నే ఇంతదాకా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేక పోయిందనే విషయాన్ని పీయూష్ తేటతెల్లం చేశారన్నారు. రైతులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కేసీఆర్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పా లన్నారు. వడ్లను కొనుగోలు చేయకపోతే ఆం దోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలన్నార
Comments
Please login to add a commentAdd a comment