
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ అధ్వానంగా మారిందని శుక్రవారం బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి భవనం పెచ్చులూడుతూ రోగులు గాయపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరో పించారు. కాలుకు ఆపరేషన్ కోసం రెండ్రోజుల క్రితం ఉస్మానియాకు వచ్చిన రోగి ఇలాగే గాయపడి ఐసీయూలో చేరాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటన ఆస్పత్రుల నిర్వహణ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఓ నిదర్శనమన్నారు.
నేడు కృష్ణా–తుంగభద్ర సంగమంలో..
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ అస్తికలను ఈ నెల 25న అలంపూర్ కృష్ణా–తుంగభద్ర సంగమంలో నిమజ్జనం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఉదయం 7 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నిమజ్జన యాత్ర ప్రారంభమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment