వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి | To allocate a separate budget for agriculture | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి

Published Fri, Aug 14 2015 4:03 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

To allocate a separate budget for agriculture

ఆత్మహత్యలు చేసుకున్న  కుటుంబాలకు రూ 10 లక్షల పరిహారం ఇవ్వాలి
భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి
 
 కామారెడ్డి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కామారెడ్డిలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా శాఖ సమావేశం స్థానిక గంజ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంభాలకు రూ 10 లక్షల పరిహారం ఇవ్వాలని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మాణాలు చేశారు.

జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ 10 వేల నష్టపరిహారం ఇవ్వాలని, రైతులకు సంబంధించిన వంద శాతం రుణాలు ప్రభుత్వమే చెల్లించి తిరిగి రైతులకు రుణాలివ్వాలని, రెవెన్యూలో పహానీలో ఆన్‌లైన్, పట్టాదారు పాసుపుస్తకాలను తొందరగా ఇవ్వాలని, వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల కరెంటు సరఫరా చేయాలని, రైతుల పంటలను అడవి పందుల భారి నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మాణించారు.

 సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సాయిరెడ్డి, విఠల్‌రెడ్డి, అంజయ్య, విఠల్‌రెడ్డి, ఉప్పు రాజయ్య, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 నూతన కార్యవర్గం ఎన్నిక...
 భారతీయ కిసాన్‌సంఘ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షునిగా దేవిరెడ్డి విఠల్‌రెడ్డి, అద్యక్షునిగా కొమిరెడ్డి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా పైడి విఠల్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఉప్పు రాజయ్య, జగదీశ్వర్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా కూచన్‌పల్లి నారాయణరెడ్డి, విద్యుత్ విభాగానికి ఎం. లక్ష్మారెడ్డి, రెవెన్యూ విభాగానికి డీసీ సాయిలు, సేంద్రీయ విభాగానికి అకిటి జయకర్‌రెడ్డి, యువజన విభాగానికి అనంతరెడ్డి, కామారెడ్డి డివిజన్ అధ్యక్షునిగా లొంక వెంకట్‌రెడ్డి, ప్రధాన క్రాయదర్శిగా అంబీర్ వెంకట్‌రావ్, బోధన్ డివిజన్ అద్యక్షునిగా శంకర్‌రావ్, ప్రధాన క్రాయదర్శిగా సంజీవ్‌కుమార్, నిజామాబాద్ డివిజన్ అద్యక్షునిగా సాయిరెడ్డిలను ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement