‘వెయ్యి అబద్ధాలు ఆడినా రాహుల్‌ పెళ్లి చేయలేరు’ | BJP Leader Sridhar Reddy Slams Rahul Gandhi | Sakshi
Sakshi News home page

‘వెయ్యి అబద్ధాలు ఆడినా రాహుల్‌ పెళ్లి చేయలేరు’

Published Thu, Feb 14 2019 1:03 PM | Last Updated on Thu, Feb 14 2019 2:23 PM

BJP Leader Sridhar Reddy Slams Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు అంశానికి సంబంధించి కాగ్‌ ఇచ్చిన నివేదికను చూసి కాంగ్రెస్‌ పార్టీకి మైండ్‌ బ్లాక్‌ అయ్యిందని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌ రెడ్డి విమర్శించారు. నిన్న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆ నివేదికతో కాంగ్రెస్‌ పార్టీకి దిమ్మ తిరిగి పోయిందన్నారు. గురువారం మీడియా మాట్లాడిన శ్రీధర్‌ రెడ్డి.. ‘ ఇన్ని రోజులుగా రఫేల్‌ డీల్‌పై కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీలకు వత్తాసు పలుకుతున్న ప్రతిపక్ష నేతల మాటలన్నీ విష ప్రచారం అని తేలిపోయింది. రఫేల్‌పై ఎలాంటి తప్పులు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా కాంగ్రెస్‌ వ్యవహారశైలి ఉంది. తాజా కాగ్‌ నివేదిక కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టులాంటింది. ఈ నివేదికలో 16 అంశాలు ప్రస్తావించారు. రాడార్‌, చీకట్లో శత్రువులను ఛేదించే పనితీరు విమానాలు ఇందులో ఉన్నాయి.

అబద్ధాలు మాట్లాడమే పనిగా పెట్టుకున్న రాహుల్‌కు నిజాలు మింగుడు పడటం లేదు. రఫేల్‌పై మోదీకి మరకపూయాలని రాహుల్‌ చూశారు. అబద్ధాన్ని గట్టిగా ప్రచారం చేసి అధికారంలోకి రావాలని అనుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వెయ్యి అబద్ధాలు ఆడినా రాహుల్‌ గాంధీ పెళ్లి చేయలేరు. విష ప్రచారం చేసి అధికారంలోకి రాలేరు. కమీషన్‌లు రావని అప్పట్లు రఫేల్‌ విమానాలను కొనుగోలు చేయలేదు కాంగ్రెస్‌ పార్టీ. అవసమరి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ చెప్తే వాటిని మేము కొనుగోలు చేశాం. రాహుల్‌, సోనియా, రాబర్ట్‌ వాద్రాలు ట్యాక్స్‌ ఎగ్గొట్టి దేశాన్ని దోచుకున్నారు. రాష్ట్రాలను దేశాన్ని దోచుకున్నది కాంగ్రెస్‌ పార్టీ’ అని తీవ్రంగా మండిపడ్డారు.

ఇక్కడ చదవండి: ధర 2.86 శాతం తక్కువే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement