ఉప్పల్‌ కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌రెడ్డి ఆత్మహత్య | | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 29 2013 10:06 AM | Last Updated on Fri, Mar 22 2024 10:39 AM

ఉప్పల్ కాంగ్రెస్ నేత యంజాల శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. రామాంతపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన శ్రీధర్రెడ్డి ఇటీవలే బెయిల్పై విడుదలయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న శ్రీధర్రెడ్డిని గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని రామాంతపూర్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీధర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement