శ్రీధర్ రెడ్డిని సత్కరించిన ఎంపీ కేశినేని నాని
విజయవాడ(భవానీపురం) :
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డిని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) సత్కరించారు. మంగళవారం న్యూ ఢిల్లీలో జరిగిన రెడ్‌క్రాస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అత్యున్నత సేవా పురస్కారం కింద రాష్ట్రపతి ఆయనకు బంగారు పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కేశినేని భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీధర్‌రెడ్డిని కేశినేని నానీ అభినందించి సత్కరించారు.