రావులపాలెం టు ఇందూరు | police arrested five marijuana smugglers in nizamabad | Sakshi
Sakshi News home page

రావులపాలెం టు ఇందూరు

Jan 29 2018 4:32 PM | Updated on Oct 17 2018 6:10 PM

police arrested five marijuana smugglers in nizamabad   - Sakshi

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ శ్రీధర్‌రెడ్డి

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌): గంజాయి స్మగ్లర్లను పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఆగడంలేదు. ఏపీలోని రావులపాలెం నుంచి ఇందూరుకు గం జాయి రవాణా అవుతోంది. ఈ క్రమం లో స్మగ్లర్లపై పోలీసులకు పక్కా సమా చారం రావడంతో వలపన్ని పట్టుకుంటున్నారు. ఈ వివరాలను ఆదివారం డీసీపీ శ్రీధర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌ ఆటోనగర్‌కు చెం దిన మునావర్‌ అలీ గతేడాది 2017 మే నెలలో గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు పట్టుబట్టాడు. ఇతడిపై ఆంధ్ర లో 6 కేసులు, మహారాష్ట్రలో ఒకటి, వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట్‌ పీఎస్‌లో ఒకటి, నిజామాబాద్‌ ఆరోటౌన్‌లో ఒక కేసు నమోదయ్యాయి.  
 

నగర శివారులో తనిఖీల్లో అరెస్టు
ఈనెల 27న పెద్దిరాజు, క్యాతం శ్రీనివాస్‌తో 70 కిలోల గంజాయిని ఏపీ10 ఏడీ 1454 నంబరుగల ఇండిగో కారులో 28న ఉదయం నిజామాబాద్‌ నగర శివారు మాధవనగర్‌కు చేరుకున్నారు. ఇంతలో నిజామాబాద్‌ రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీధర్, పోలీసుల తో కలిసి అర్సపల్లి మాధవనగర్‌ బైపాస్‌ పై వాహనాల తనిఖీలు చేశారు. స్మగ్లర్ల కారును పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి బాగోతం బయటపడింది. రవాణా చేస్తున్న పెద్దిరాజు, క్యాతం శ్రీనివాస్‌ను పోలీసులు విచారించారు. ము నావర్‌ అలీకి సప్లయ్‌ చేస్తున్నామన్నారు. దీంతో పోలీసులు మునావర్‌ అలీ ఇంటి పై దాడిచేశారు. ఇంట్లో 10 కిలోల గం జాయి లభ్యం కావటంతో వెంటనే అత డిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 80 కిలోల గంజాయిని(రూ.12 లక్షల విలువ) స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. వీరి నుంచి 5సెల్‌ఫోన్లు, రూ.వెయ్యి, కారును స్వాధీనం చేసుకు న్నామన్నారు. ప్రతిభ చూపిన పోలీసులను డీసీపీ అభినందించారు. వీరికి రివార్డులకు సీపీకి విన్నవిస్తామన్నారు.  

గుట్కా వ్యాపారి అరెస్టు..
నగరంలోని హైమదీబజార్‌లో గుట్కా వ్యాపారం చేస్తున్న షేక్‌ అహ్మద్‌ను అరెస్టు చేశామని డీసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం అబు బకార్‌ షాపు, గో దాంలపై పోలీసులు దాడిచేసి 75 కార్టన్ల గుట్కాను పట్టుకున్నారన్నారు. ఇది నిర్మ ల్‌ జిల్లా బాసర్‌కు చెందిన కరీం సప్లయ్‌ చేస్తున్నట్లు గుర్తించామని, అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగామన్నారు.

పథకం పన్నారిలా..
గంజాయి కేసులో విజయవాడ సబ్‌జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న మునావర్‌ అలీకి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న మరో గంజాయి స్మగ్లర్‌ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాడెర్‌ మండలం పాలకొల్లుకు చెందిన క్యాతం శ్రీనివాస్‌రావుతో పరిచయం ఏర్పడింది. వా రిద్దరు బెయిల్‌పై గతేడాది నవంబర్‌ లో జైల్‌ నుంచి విడుదలయ్యారు. అయినా మునావర్‌ ప్రవర్తనలో మా ర్పురాలేదు. ఇతడు మళ్లీ గంజాయి రవాణాపై దృష్టి సారించాడు. క్యాతం శ్రీనివాస్‌తో కలిసి ఈనెల 13న రావులపాలేం గ్రామానికి వెళ్లి పెద్దిరాజును పరిచయం చేసుకున్నారు. 80 కిలోల గంజాయి కావాలంటే, పెద్దిరాజు ప్రస్తుతం తన వద్ద 10 కిలోలు మాత్రమే ఉందని, మిగతా 70 కిలోల గంజాయి 15 రోజుల తర్వాత పంపిస్తానని చెప్పాడు. దాంతో మునావర్‌ రూ.80 వేలు పెద్దిరాజుకు చెల్లించి 10 కిలోల గంజాయినినిజామాబాద్‌కు తెచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement