
‘సోగ్గాడి కాపురం, ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రాల నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి ఇకలేరు. అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి ఆయన మరణించారు. శ్రీధర్ రెడ్డి స్వస్థలం నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో చెన్నై వెళ్లారు. శోభన్‌బాబు, జయసుధ జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడి కాపురం’ సినిమా నిర్మించారాయన. ఆ తర్వాత సుమన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా వై. నాగేశ్వరావు దర్శకత్వంలో ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రం నిర్మించారు. శ్రీధర్ రెడ్డి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment