
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీని విమర్శించడం, దూషించడం ద్వారా కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పెద్ద నాయకుడు కావాలని ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు.
నైతికత గురించి రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్.. కులం, మతం గురించి ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూసిందని ఆరోపించారు. కాన్వెంట్‌లో చదువుకున్న రాహుల్‌గాంధీకి ప్రజలతో ఉండే మోదీతో పోలికే లేదని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ అధికారులతో భేటీ అయినందుకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment