విద్యాబాలన్ మిస్సింగ్..! | 'Where is Vidyabalan' movie release on May 1st | Sakshi
Sakshi News home page

విద్యాబాలన్ మిస్సింగ్..!

Published Tue, Apr 21 2015 10:18 PM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

'Where is Vidyabalan' movie release on May 1st

 విద్యాబాలన్ తప్పిపోయారు....? మీరనుకుంటున్నట్లు బాలీవుడ్ నటి విద్యాబాలన్ కాదు....ఈ సినిమాలో ఓ పాత్ర పేరు. అసలు ఈ విద్యాబాలన్ ఎవరు...? ఎందుకు కనిపించట్లేదు...? వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాలంటే ‘వేరీజ్ విద్యాబాలన్’ చూడాల్సిందే. ప్రిన్స్, జ్యోతీ సేథ్ జంటగా శ్రీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మి నర్శింహరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి  ‘కథ’, ‘ఒక్కడినే’ ఫేం శ్రీనివాస్ దర్శకుడు. వచ్చే నెల 1న ఈ చిత్రం విడుదల కానుంది. టైటిల్ తరహాలోనే ఈ  సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని  దర్శకుడు చెప్పారు. యూత్‌కి, మాస్‌కి నచ్చే కథ ఇదని,  సంపూర్ణేష్ బాబు కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందనీ నిర్మాతలు తెలిపారు.  ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అక్కినేని శ్రీను, బాలాజీ శ్రీను ,సహనిర్మాతలు: హేమ వెంకట్, చిరంజీవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement