Where Is Vidyabalan
-
విద్యాబాలన్ మిస్సింగ్..!
విద్యాబాలన్ తప్పిపోయారు....? మీరనుకుంటున్నట్లు బాలీవుడ్ నటి విద్యాబాలన్ కాదు....ఈ సినిమాలో ఓ పాత్ర పేరు. అసలు ఈ విద్యాబాలన్ ఎవరు...? ఎందుకు కనిపించట్లేదు...? వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాలంటే ‘వేరీజ్ విద్యాబాలన్’ చూడాల్సిందే. ప్రిన్స్, జ్యోతీ సేథ్ జంటగా శ్రీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మి నర్శింహరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘కథ’, ‘ఒక్కడినే’ ఫేం శ్రీనివాస్ దర్శకుడు. వచ్చే నెల 1న ఈ చిత్రం విడుదల కానుంది. టైటిల్ తరహాలోనే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. యూత్‌కి, మాస్‌కి నచ్చే కథ ఇదని, సంపూర్ణేష్ బాబు కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అక్కినేని శ్రీను, బాలాజీ శ్రీను ,సహనిర్మాతలు: హేమ వెంకట్, చిరంజీవి. -
బ్రేక్ ఖాయం - ప్రిన్స్
‘‘ఈ టైటిల్ చాలా బాగుంది. ప్రిన్స్ నా తమ్ముడితో సమానం. క్రికెట్లో ఓపెనర్‌గా తను బాగా ఆడినట్టుగానే, ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలి’’ అని హీరో శ్రీకాంత్ చెప్పారు. ప్రిన్స్, జ్యోతీ సేథీ, సంపూర్ణేశ్‌బాబు, రావు రమేశ్ ముఖ్య తారలుగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. శ్రీభ్రమరాంబా క్రియేషన్స్ పతాకంపై కృష్ణ బద్రి, శ్రీధర్‌రెడ్డి సమర్పణలో ఎల్. వేణుగోపాలరెడ్డి, పి. లక్ష్మీనరసింహారెడ్డి, ఎ. చిరంజీవి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ప్రిన్స్ మాట్లాడుతూ - ‘‘కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్‌తో పాటు అన్ని అంశాలూ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాతో నాకు బ్రేక్ ఖాయం’’ అన్నారు. థ్రిల్ ఫీలయ్యే క్రైమ్ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.