
ఘనంగా వైఎస్ జయంతి
ఓడీ చెరువు : పార్టీ నేతలు, కార్యకర్తలు ఎప్పుడూ అధైర్య పడొద్దని, ఎల్లవేళలా అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ నేత దుద్దెకుంట శ్రీధరరెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం ఆయన మండల కేంద్రంలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి స్టోరు డీలర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను తొలగించాలని, వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ అధైర్యపడకుండా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి ముందుండాలని సూచించారు. త్వరలో మండలంలోని నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీ సీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.