స్వచ్ఛమైన ప్రేమకథ! | Its My Love Story new moive | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమకథ!

Published Wed, Mar 9 2016 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

స్వచ్ఛమైన ప్రేమకథ!

స్వచ్ఛమైన ప్రేమకథ!

  ‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’కి వినోద్ అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. ట్రైలర్ బాగుంది. డైలాగులు కొత్తగా ఉన్నాయి. పూర్తి స్థాయి లవ్‌స్టోరీగా చేసిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శక-నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి అన్నారు. సాయి రోనక్, అదితీ సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’.

 ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. గుప్పెడంత ప్రేమ కోసం మనిషి ఏదైనా చేస్తాడు. తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈశాన్య భారతదేశ నేపథ్యం ఉంటుంది’’ అని తెలిపారు. ఈ వేడుకలో హీరో హీరోయిన్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పావని లింగాల తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement