its my love story
-
గుప్పెడంత ప్రేమ కోసం..
‘‘ఇంజనీరింగ్ పూర్తి చేసిన నేను యూరోపియన్ యూనియన్ ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్‌తో లండన్‌లో ఎంఎస్ పూర్తి చేశా. సినిమాలపై ఇష్టంతో అక్కడే కొన్ని కోర్సులు నేర్చుకున్నా. ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశా. దర్శకుడిగా మారి ‘గుప్పెడంత ప్రేమ’ చిత్రం తెరకెక్కించా’’ అని దర్శకుడు వినోద్ లింగాల అన్నారు. సాయి రోనక్, అదితీ సింగ్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఓ జంట మధ్య కలిగే ఫస్ట్ లవ్ ఫీలింగ్స్‌ను ఇందులో చూపించాం. గుప్పెడంత ప్రేమ కోసం మనిషి ఏదైనా చేస్తాడనేది కథాంశం. నార్త్ ఈస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. అందరికీ నచ్చే చిత్రమవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పావని లింగాల. -
స్వచ్ఛమైన ప్రేమకథ!
‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’కి వినోద్ అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. ట్రైలర్ బాగుంది. డైలాగులు కొత్తగా ఉన్నాయి. పూర్తి స్థాయి లవ్‌స్టోరీగా చేసిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శక-నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి అన్నారు. సాయి రోనక్, అదితీ సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. గుప్పెడంత ప్రేమ కోసం మనిషి ఏదైనా చేస్తాడు. తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈశాన్య భారతదేశ నేపథ్యం ఉంటుంది’’ అని తెలిపారు. ఈ వేడుకలో హీరో హీరోయిన్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పావని లింగాల తదితరులు పాల్గొన్నారు. -
ఆ క్రికెటర్ కథతో సినిమా తీస్తా!
‘‘మూస ధోరణిలో ఉన్న కథలు నాకిష్టం ఉండదు. అందుకే కొత్త కథలతో సినిమాలు తీస్తుంటాను. నన్ను ఉద్వేగానికి గురి చేసే కథ దొరికేంతవరకూ అన్వేషిస్తాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. దర్శకునిగా స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వంటి వినూత్న కథలు తెరకెక్కించిన శ్రీధర్ త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. క్రికెటర్ శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని శ్రీధర్ చెబుతూ - ‘‘ఓ క్రికెటర్, ఓ నటి మధ్య సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది. బెట్టింగ్ నేపథ్యంలో సాగే సినిమా’’ అన్నారు. పీబీ మంజునాథ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ‘‘ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఇంటర్నెట్ ఎలా మార్చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఈ ఐదేళ్లల్లో ప్రేక్షకులు ఇలాంటి బోల్డ్ చిత్రాన్ని చూసి ఉండరు’’ అని శ్రీధర్ చెప్పారు. -
ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది
‘‘చేసే ప్రతి పాత్రలోనూ నాదైన ముద్ర కనిపించాలి. అదే నా ధ్యేయం’’ అంటున్నారు అరవింద్‌కృష్ణ. ఇట్స్ మై లవ్‌స్టోరి, రుషి చిత్రాలతో గురింపు తెచ్చుకున్న ఈ యువహీరో... తన కెరీర్ గురించి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘‘శారీరకంగా, మానసికంగా పాత్రలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అరవింద్. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలున్నాయని, వాటిల్లో ‘బిస్కెట్’ కామెడీ తరహా చిత్రమైతే, ‘అడవి కాచిన వెన్నెల’ థ్రిల్లర్ మూవీ అని, ‘సారథి’ అనే చిత్రంలో భిన్నమైన పాత్ర చేస్తున్నానని, ఇవిగాక ఓ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తున్నానని అరవింద్‌కృష్ణ తెలిపారు. కథలు, పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని, అరవింద్ ఏ పాత్రనైనా రక్తి కట్టించగలడని అనిపించుకోవాలన్నదే నా లక్ష్యమని అరవింద్ చెప్పారు.