ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది | chit chat with hero aravind krishna | Sakshi
Sakshi News home page

ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది

Published Fri, Dec 20 2013 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది

ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది

 ‘‘చేసే ప్రతి పాత్రలోనూ నాదైన ముద్ర కనిపించాలి. అదే నా ధ్యేయం’’ అంటున్నారు అరవింద్‌కృష్ణ. ఇట్స్ మై లవ్‌స్టోరి, రుషి చిత్రాలతో గురింపు తెచ్చుకున్న ఈ యువహీరో... తన కెరీర్ గురించి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘‘శారీరకంగా, మానసికంగా పాత్రలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అరవింద్.
 
  ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలున్నాయని, వాటిల్లో ‘బిస్కెట్’ కామెడీ తరహా చిత్రమైతే, ‘అడవి కాచిన వెన్నెల’ థ్రిల్లర్ మూవీ అని, ‘సారథి’ అనే చిత్రంలో భిన్నమైన పాత్ర చేస్తున్నానని, ఇవిగాక ఓ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తున్నానని అరవింద్‌కృష్ణ తెలిపారు. కథలు, పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని, అరవింద్ ఏ పాత్రనైనా రక్తి కట్టించగలడని అనిపించుకోవాలన్నదే నా లక్ష్యమని అరవింద్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement