Biscuit
-
కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: మైలార్దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మాట్లార్పుతోంది. దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు పూర్తిగా మంటల్లో కాలి బుడిదైంది. కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా అంచనా. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. -
ఇదేందయ్యా ఇది? నేను ఎప్పుడూ చూడలే.. పకోడీ తయారీలో భారీ ట్విస్ట్?
ప్రపంచంలో అణువణువునా ఆహార ప్రియులు కనిపిస్తారు. ఈ ఫుడ్ లవర్స్ కారణంగానే కొత్త ప్రయోగాలతో వినూత్న ఆహారాలు పుట్టుకొస్తుంటాయి సోషల్ మీడియాలో వంటల ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. తాజాగా ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఒక మహిళ ఉడికించిన బంగాళ దుంపలు, బిస్కెట్లు కలిపి వినూత్న రీతిలో పకోడీలు తయారు చేసింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియో మొదట్లో ఆ మహిళ పకోడీల తయారీకి వినియోగించే శనగపిండిలో బిస్కెట్లను ముంచడాన్ని గమనించవచ్చు. ఆ తరువాత వాటిని ఆమె వేడి నూనెలో వేయిస్తుంది. అయితే వీడియోలో ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆమె ఈ బిస్కెట్ పకోడీలను వేయించడానికి ముందు.. మొదటగా బంగాళాదుంపలను ఉడకబెట్టి మెత్తగా చేస్తుంది. దానికి వేయించిన మసాలా దినుసులు కలుపుతుంది. తరువాత రెండు బిస్కెట్ల మధ్య ఆ బంగాళదుంప మసాలా ముద్దను ఉంచి, వాటిని పకోడీలు చేయడానికి ఉపయోగించే పిండిలో ముంచి, డీప్ ఫ్రై చేస్తుంది. చివరగా ఆమె వాటిని సాస్‌తో కూడిన ప్లేట్లో సర్వ్‌చేస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @Shayarcasm అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 20 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ 58 సెకన్ల వీడియోపై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చూడండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు? Gujjus have gone INSANE. pic.twitter.com/7VXRZzjOcP — 𝐌𝕒𝕟𝕥𝕠™ 𝚏𝚊𝚗 (@Shayarcasm) November 3, 2023 -
చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలకు పెరిగిన డిమాండ్
-
టీ, కాఫీ తాగిన తర్వాత కప్పును తినేయండి.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా?
సాక్షి,సిద్దిపేట: టీ, కాఫీ తాగిన తర్వాత కప్పును తినేయండి అంటున్నారు సిద్దిపేటలోని పలు టీస్టాల్స్ యజమానులు. అదేంటి ప్లాస్టిక్ గ్లాస్‌ను తినడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అది ప్లాస్టిక్ కప్పు కాదండోయ్ బిస్కెట్‌తో తయారు చేసిన కప్పు. వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజమండి.. దీని గురించి తెలుసుకోవాలంటే మనం జిల్లా కేంద్రమైన సిద్దిపేటకు వెళ్లాల్సిందే. చాయ్ తాగిన తర్వాత ప్లాస్టిక్, పేపర్ కప్పులు అయితే పడేస్తారు. పింగాణీ అయితే కడిగి మళ్లీ వినియోగిస్తారు. ఈ ప్లాస్టిక్, పేపర్ కప్పుల ద్వారా కుప్పలుగా ప్లాస్టిక్ పేరుకుపోవడంతో పర్యావరణాకి ముప్పు వాటిల్లుతుందని గుర్తించిన సిద్దిపేటకు చెందిన నలుగురు యువకులు వినూత్న ఆలోచనతో ఈ బిస్కెట్ టీ కప్పుల తయారీకి శ్రీకారం చుట్టారు. వినూత్న ఆలోచనతో.. సిద్దిపేట పట్టణానికి చెందిన దావత్ అఖిల్ కుమార్, అల్లె రమేశ్, బుక్క శివ కుమార్, కందుకూరి శివ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. పర్యావరణానికి çహానీ చేయని పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు టీ స్టాల్ దగ్గర టీ కప్పుల కుప్పలు చూశారు. వీటి ద్వారా పర్యావరణానికి హానీ కలుగుతుందని గుర్తించారు. టీ తాగిన తర్వాత వృథాగా పడేయకుండా ఉండేందుకు కప్పును తినేవిధంగా తయారు చేయాలని ఓ ఐడియాకు వచ్చారు. తొలుత బిస్కెట్‌తో తయారు చేసిన ఐస్‌క్రీం కప్పులో టీ తాగి చూశారు. బెంగళూరులోని కప్పులు తయారు చేసే పరిశ్రమకు వెళ్లి పరిశీలించారు. ఏ మెటీరియల్‌ను వినియోగిస్తున్నారో తెలుసుకున్నారు. చిన్న సైజు కప్పును తయారు చేసిన దానిలో టీ ని అందిస్తే తాగిన తర్వాత తినే విధంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. అనంతరం అక్కడి నుంచి తమకు కావాల్సిన విధమైన మిషన్‌ను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. చదవండి: వరిచేలలో రామ్ చరణ్ చిత్రం.. షార్ట్ ఫిలిం డైరెక్టర్ అభిమానం 6 నిమిషాల్లో 40 తయారీ రాగి, మైదా, మొక్కజొన్న పిండి, చక్కెర, తెనేలను బాగా మిక్స్ చేసి ఒక డై లో మొదట ఆ మిశ్రమంను పొస్తారు. తర్వాత మిషనరీలో ఉన్న టీ కప్పు డై లో ఈ మిశ్రమంను వేస్తారు. సుమారుగా 6 నిముషాల పాటు అందులోనే ఉంచుతున్నారు. హీటర్ల ద్వారా వేడి అయి గట్టి పడుతుంది. డై ని ఓపెన్ చేసి కప్పులను తీస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలోని పలు టీస్టాల్‌లకు ఈ కప్పులను సరఫరా చేస్తున్నారు. ఒక్కో టీ కప్పు రూ.3.5 విక్రయిస్తున్నారు. ఈ కప్పుల్లో టీ తాగిన ప్రజలు తర్వాత వాటిని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. పర్యావరణానికి రక్షగా సిద్దిపేటలో మున్సిపాలిటీ, మంత్రి హరీశ్‌రావు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నారు. మా వంతు కృషిగా బిస్కెట్ టీ కప్పులను తయారు చేస్తున్నాం. ప్రస్తుతానికి సిద్దిపేటలోనే సరఫరా చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రొడక్షన్ పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తాం. మేము నలుగురమే తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాం. – అఖిల్, రమేశ్, శివ కుమార్ -
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..?
లక్నో: పారి, పిహు, విధి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. కలిసిమెలసి ఉండేవారు. ఆడుతూపాడుతూ.. అమ్మానాన్నతో కలిసి సంతోషంగా జీవించేవారు. జింకపిల్లలా చెంగుచెంగున పరుగులు తీసే చిన్నారులు.. ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. చిన్నారుల మృతి వారి తల్లిదండ్రులతో పాటు.. గ్రామస్తులను కూడా కలచి వేసింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలా మరణించారో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్, బరేలీకి చెందిన నవీన్ కుమార్ సింగ్‌కు పారి, పిహు, విధి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజులు క్రితం వరకు కూడా ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం ఈ అమ్మాయిలు బిస్కెట్లు, చిప్స్ కొనుక్కుని తిన్నారు. ఆ తర్వాత ఉన్నట్లుండి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. (చదవండి: వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!) ఇది గమనించిన చిన్నారుల తండ్రి నవీన్ కుమార్ వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే హాస్పిటల్‌కు వెళ్లేలోపే పారి, పిహు మరణించారు. చికిత్స పొందుతూ విధి మృతి చెందింది. చిన్నారులకు ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతి గురించి పోలీసులకు తెలియడంతో వారు.. సంఘటన స్థలానికి చేరుకుని.. అంత్యక్రియలు ఆపేశారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం ఇదే!) ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అటాప్సీ పరిక్షలో వెల్లడయ్యింది. ప్రస్తుతం పోలీసులు చిన్నారుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు బాలికలు తిన్న బిస్కెట్లు, చిప్స్ శాంపిల్స్‌ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. చదవండి: వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు -
హైదరాబాద్‌లో ‘ఫ్రీ చాయ్ బిస్కెట్’: ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినూత్నంగా ‘లూ కేఫ్’ పేరుతో మొట్టమొదటి ఫ్రీ చాయ్, బిస్కెట్ కౌంటర్ ప్రారంభమైనది. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కుకి ఎదురుగా ప్రారంభించిన ఈ స్టాల్‌ను రవీంద్రనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇగ్జోరా కార్పొరేట్ సేవల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా లూ కేఫ్ హెడ్ అభిషేక్ బంది వాడేకర్ మాట్లాడుతూ.. కేబీఅర్ పార్కు, దానికి సమీపంలో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలకు ప్రతి నిత్యం చాలా మంది నగరవాసులు వస్తుంటారు. వారందరికి ఉచితంగా చాయ్ బిస్కెట్, మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కౌంటర్ ను ప్రారంభించామని తెలిపారు. అంతే కాకుండా ఇక్కడ మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా పరిశుభ్రమైన వాష్ రూమ్ అందుబాటులో ఉన్నాయన్నారు. చదవండి: మంచి గవర్నర్... భోజనం పెట్టి; ల్యాప్‌టాప్ ఇచ్చి -
టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం ఇదే!
సాక్షి, రామగుండం: చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన కొందరు యువకులు నూతన యాప్‌ను రూపొందించారు. దీనికి బిస్కెట్ యాప్‌గా నామకరణం చేశారు. ఈ యాప్ లోగోను పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా యువకులు ఎంతో శ్రమించి టిక్‌టాక్‌లో ఉన్న ఫీచర్స్ కంటే ఎన్నో రెట్లు అదనంగా ఉన్న బిస్కెట్ యాప్ రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిస్కెట్ యాప్ ఆవిష్కర్తలు రంగు శ్రీనివాస్‌గౌడ్, దుర్గేష్, ప్రణయ్, సాయికుమార్, సత్యాన్వేష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: 97.58 శాతం మందికి అర్హత -
బిస్క్ ఫామ్’ విస్తరణ
కోలకతాకు చెందిన బేకరీ సంస్థ ‘బిస్క్ ఫామ్’.. వచ్చే మూడేళ్లలో 3వ స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రకటించింది. దేశ బిస్కెట్ల మార్కెట్లో ఈ సంస్థ ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆగస్టుతో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా సంస్థ ఫౌండర్ చైర్మన్ కే డీ పాల్ ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరింపచేయనున్నాం. తాజా లోగోను సంస్థ జర్నీని తెలియజేసే విధంగా రూపొందించాం’ అని అన్నారు. -
బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్లో అగ్రి ప్రమాదం
-
నకిలీ బిస్కెట్ తయారీ కంపెనీపై దాడి
రాంపూర్ (ధర్మసాగర్) : బ్రాండెడ్ పేరుతో నకిలీ బిస్కెట్లు తయారు చేస్తున్న కంపెనీపై దాడి చేసి యంత్రాలు, బ్రాండెడ్ లేబుళ్లు సీజ్ చేసినట్లు ధర్మసాగర్ ఎస్సై కుమారస్వామి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్ కరాచీ బేకరీ బ్రాండెడ్ బిస్కెట్లను రాంపూర్‌లో నకిలీగా తయారు చేస్తున్నారన్నారు. ఆ కంపెనీకి చెందిన వాటాదారుడి ఫిర్యాదుతో రాంపూర్ ఇండసీ్ట్రయల్లోని ఓ కంపెనీపై దాడి చేసి కరాచీ బేకరీ బ్రాండెడ్ పేరుతో నకిలీ రేపర్లు, అట్టపెట్టలు, యంత్రసామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
‘టైటానిక్’ బిస్కెట్ రూ.15 లక్షలు
లండన్: ‘టైటానిక్’ బిస్కెట్ వేలంలో 15 వేల పౌండ్లు(రూ.15 లక్షలు) పలికింది. టైటానిక్ ఓడ మంచుకొండను ఢీకొంటున్నప్పుడు తీసిన ఆ కొండ ఫొటో 21వేల పౌండ్లు( రూ.20 లక్షలు)కు అమ్ముడుబోయింది. హెన్రీ అల్డ్రిడ్జ్ అండ్ సన్స్ సంస్థ వీటిని వేలం వేసింది. టైటానిక్ మునిగిన సమయంలో సేకరించిన బాణసంచా, బిస్కెట్లు, లైఫ్బోట్లు లాంటి వన్నీ ఎంతో విలువైనవని పేర్కొంది. వీటిని వేలంలో గ్రీస్‌కు చెందిన సేకర్త దక్కించుకున్నట్లు తెలిపింది. మంచుకొండను తాకినప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో 10 వేల నుంచి 15 వేల పౌండ్లు పలుకుతుందని అంచనా వేయగా 21 వేల పౌండ్లకు కొనుగోలు చేశారన్నారు. ప్రమాద సమయంలో కెప్టెన్ అర్థర్ రోస్ట్రన్.. ధనికులకు బహుమతిగా ఇచ్చిన కప్పును 1.29 లక్షల పౌండ్లకు(రూ. 1.28 కోట్లు ) యూకే సేకర్త దక్కించుకున్నారు. ‘టైటానిక్’కు సంబంధించి ఇప్పటివరకూ నిర్వహించిన వేలాల్లో ఈ కప్పు మూడవ అత్యధిక ధర పలికింది. -
స్టాక్స్ వ్యూ
బ్రిటానియా ఇండస్ట్రీస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ.2,974 టార్గెట్ ధర: రూ.3,650 ఎందుకంటే: భారత బిస్కట్ మార్కెట్లో 30 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. గుడ్ డే, మారీ, టైగర్, క్రీమ్ ట్రీట్, 50-50, మిల్క్ బికీస్, న్యూట్రి చాయిస్ బ్రాండ్లతో విక్రయాలు సాగిస్తోంది. అమ్మకాలు, నిర్వహణ పనితీరు బాగా ఉండడం వంటి కారణాల వల్ల వేగంగా వృద్ధి చెందుతున్న ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. రకరకాలైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేయడం వంటి కారణాల వల్ల అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధిస్తున్నాయి. రస్క్‌లు, కేక్‌ల కేటగిరిలోకి ప్రవేశించిన ఈ కంపెనీ డైరీ, ఇతర స్నాక్స్ కేటగిరిల్లోకి కూడా ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది. బ్రేక్ ఫాస్ట్ సంబంధిత ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. 2012-15 కాలానికి రాబడులు 50 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 2013-15 కాలానికి ఆదాయం 13 శాతం చొప్పున, నికర లాభం 45 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. కీలక ముడి పదార్ధాల ధరలు గోధుమ పిండి 8 శాతం, పంచదార 10 శాతం, రిఫైన్డ్ పామ్ఆయిల్ 9 శాతం చొప్పున తగ్గాయి. అధిక మార్జిన్లు ఇచ్చే ఉత్పత్తులపై దృష్టిపెట్టడం, సొంత తయారీ కారణంగా నిర్వహణ పనితీరు మెరుగుపడడం, నెట్వర్క్ పటిష్టం చేసుకోవడం వల్ల డిస్ట్రిబ్యూషన్ వ్యయాలు తగ్గడం, కొత్త కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేనుండడం, వ్యయ నియంత్రణ పద్ధతులను పాటించడం, పటిష్టమైన బ్రాండ్ నేమ్.. ఇవన్నీ కంపెనీకి సానుకూలాంశాలు. ఇండియన్ ఆయిల్ కార్ప్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.405 టార్గెట్ ధర: రూ.570 ఎందుకంటే: ఇంధన రంగంలో గత రెండేళ్లుగా వస్తున్న సంస్కరణల(పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ తొలగించడం, ఎల్పీజీ సిలిండర్ రాయితీలను నేరుగా వినియోగదారులకు అందించడం వంటి) కారణంగా కంపెనీ నష్టాలు 80 శాతం వరకూ తగ్గాయి. రుణ భారం కూడా బాగా తగ్గింది. దీంతో బ్యాలెన్స్డ్ షీట్ పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల బాగా తగ్గుతుండటంతో రుణ భారం, వడ్డీ భారం మరింత తగ్గనున్నాయి. పెట్రో ఇంధనాలపై ధరల నియంత్రణ తొలగడంతో మార్కెటింగ్ మార్జిన్లు పెరుగుతాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలతో పోల్చితే ఈ కంపెనీకే ఆదాయ మార్గాలు అధికంగా ఉన్నాయి. కంపెనీ మొత్తం ఆదాయంలో రిఫైనింగ్ వాటా 40%, మార్కెటింగ్ వాటా 30%, పైప్‌లైన్ వాటా 24%, పెట్రోకెమికల్స్ విభాగం 6%గా ఉన్నాయి. భారత్‌లో మొత్తం 22 రిఫైనరీలు ఉండగా, ఈ కంపెనీవే 11 ఉన్నాయి. త్వరలో పారదీప్ రిఫైనరీ ప్రారంభం కానుంది. దీని పూర్తి ప్రయోజనాలు 2016-17 ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి అందుతాయి. 11,000 కిమీతో అతిపెద్ద పైప్‌లైన్ నెట్వర్క్ కంపెనీ సొంతం. కొత్త పైప్లైన్లపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. విభిన్నమైన రంగాల నుంచి వస్తున్న రాబడుల కారణంగా కంపెనీ ఆదాయానికి స్థిరత్వం లభిస్తుందని భావిస్తున్నాం. మార్కెటింగ్ మార్జిన్లు బాగా పెరుగుతాయనే అంచనాలతో ఈ కంపెనీ షేర్ రీ రేటింగ్ అయ్యే అవకాశాలున్నాయి. జైడస్ వెల్నెస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.888 టార్గెట్ ధర: రూ.990ఎందుకంటే: 1988 నుంచి ఫిట్నెస్, ఆరోగ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు అందజేస్తోంది. అంతకంతకూ వృద్ధి చెందుతున్న ఈ సెగ్మెంట్లలో షుగర్ ఫ్రీ, ఎవర్‌యూత్, నూట్రాలైట్, యాక్టిలైఫ్ వంటి హెల్త్‌కేర్ బ్రాండ్లతో చెప్పుకోదగ్గ మార్కెట్ వాటా సాధించింది. షుగర్ ఫ్రీ, ఎవర్‌యూత్ స్క్రబ్, ఎవర్‌యూత్ పీల్ ఆఫ్, నూట్రాలైట్... ఈ కంపెనీ బ్రాండ్లన్నీ ఆయా సెగ్మెంట్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. పంచదార ప్రత్యామ్నాయ మార్కెట్లో షుగర్ ఫ్రీ బ్రాండ్‌దే 93 శాతం మార్కెట్ వాటా. 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం యాక్టిలైఫ్ పేరుతో పోషకాలతో కూడిన పాల ఉత్పత్తిని 2011లో మార్కెట్లోకి తెచ్చింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బావున్నాయి. గత క్యూ1లో రూ.17 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో 14 శాతం వృద్ధితో రూ.19.5 కోట్లకు పెరిగింది. నికర అమ్మకాలు రూ.42 కోట్ల నుంచి 1 శాతం వృద్ధితో రూ.43 కోట్లకు పెరిగాయి. ఇబిటా రూ.18 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.21 కోట్లకు ఎగసింది. స్థూల లాభం 17 శాతం, ఇతర ఆదాయం 81 శాతం చొప్పున పెరిగాయి. ఇదే జోరు మరికొన్ని క్వార్టర్ల పాటు కొనసాగవచ్చు. రెండేళ్లలో నిర్వహణ లాభం 7 శాతం చొప్పున, నికర లాభం కూడా 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
బంగారం ‘బిస్కెట్’ వేశాడు..
⇒ రూ. 2 లక్షలకే కిలో బంగారం! ⇒ ఢిల్లీ నుంచి ఆగంతుకుడి ఫోన్ ⇒ ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లిన 30 మంది ⇒ నకిలీ బంగారం ఇచ్చి ⇒ మోసం చేసిన వైనం ⇒ ఆలస్యంగా సంఘటన వెలుగులోకి ⇒ పోలీసులకు అందని ఫిర్యాదు ఉప్లూర్ (కమ్మర్పల్లి): మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు రూ. రెండు లక్షలకు కిలో చొప్పున బంగారం కొనుగోలు చేసి మోసపోయిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఒక ఆగంతకుడు గ్రామంలోని చాలామందికి ఫోన్ చేసి తమ వద్ద బంగారం ఉందని, కావాలంటే రూ. రెండు లక్షలకు కిలో ఇస్తామని నమ్మించాడు. దీంతో కొందరు గ్రూపులు గ్రూపులుగా కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ లాడ్జి తీసుకొని అందులో ఉండి, ఫోన్ చేసిన వ్యక్తిని కలిశారు. దేవాలయాల్లోని బంగారమని, దీన్ని తక్కువ ధరకు విక్రయించి తొందరగా నగదు చేసుకోవాలనుకుంటున్నామని ఆగంతకుడు వారిని నమ్మించాడు. తన వద్ద ఉన్న బంగారం బిస్కెట్ నుంచి ఓ ముక్క కత్తిరించి ఇచ్చి అసలుదా, నకిలీదా చెక్ చేసుకోవాలని సూచించాడు. దీంతో వారు జ్యూయలరీ షాపులకు వెళ్లి చెక్ చేసుకొని అసలుదని నిర్ధారణ చేసుకున్నారు. అనంతరం బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని రూ. రెండు లక్షలకు కిలో కొనుగోలు చేసుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చారు. కొంతమంది కిలో, రెండు కిలోలు చొప్పున 30 మందికి పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం. స్వగ్రామానికి వచ్చాక స్థానిక కంసాలి వద్దకు వెళ్లి చూపగా, బిస్కెట్లు రాగివని తేలింది. దీంతో మోసపోయామని గ్రహించి గొల్లుమన్నారు. వారం రోజుల పాటు గోప్యత పాటించినప్పటికీ బయటకు పొక్కింది. ఆనోట, ఈనోట పడి ఊరంతా దావానలంలా వ్యాపించింది. బాధితులు బయటకు చెప్పుకోలేక, మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ పేరిట ఎటు పోతుందో తెలియక భయపడి ఊరుకుంటున్నారు. ఫోన్‌నంబర్లు ఎలా తెలుసంటే.. గ్రామంలోని కొంతమందికి బంగారం కొనుగోలు గురించి ఫోన్ చేసినవారికి బాధితుల ఫోన్ నంబర్లు ఎలా తెలుసనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని హార్వెస్టర్, ట్రాక్టర్ డ్రైవర్ల ద్వారా ఢిల్లీలోని మోసగాళ్లకు తెలిసినట్లు గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వారే తమ యజమానుల ఫోన్ నంబర్లు సదరు వ్యక్తులకు అందించినట్లు తెలుస్తోంది. -
టిఫినీలు చేశారా.. స్పూన్లు తిన్నారా..
ఒక ఆలోచన మన జీవితాన్నే మార్చేయొచ్చు.. ఇతరులకు ప్రేరణగా నిలవొచ్చు.. సమాజానికి మేలూ చేయొచ్చు! పీసపాటి నారాయణరావుకి వచ్చిన ఆలోచన ఆయన జీవితాన్ని ఎంతవరకు మార్చిందో తెలియదు కానీ ఇతరులకు ప్రేరణ.. సమాజానికి మేలు చేస్తోంది! ఆ ఐడియా.. జొన్నపిండి బిస్కట్ స్పూన్స్ తయారు చేయడం. దీనికి.. సమాజహితానికి సంబంధం ఏంటో తెలుసుకునే ముందు ఆయన గురించి చిన్న పరిచయం.. - సరస్వతి రమ నారాయణరావు పూర్వాశ్రమంలో సైంటిస్ట్. కోల్‌కతాలో పుట్టిపెరిగిన తెలుగు వ్యక్తి. బరోడాలో పన్నెండేళ్లు పనిచేశాక హైదరాబాద్ ఇక్రిశాట్‌కు బదిలీ అయ్యాడు. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో కొలువు. అక్కడ తన ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం దొరుకుతుందని ఆశపడ్డాడు. అదే ఉత్సాహంతో గ్రౌండ్ వాటర్ డిప్లెషన్ మీద పరిశోధన చేశాడు. నేలలో నీటి నిల్వలు తగ్గుతున్నాయనగానే వర్షాభావం అనే సమాధానమే దొరుకుతుంది. కానీ, నారాయణరావు పరిశోధనల్లో మూడేళ్ల సగటు వర్షపాతం ఏమాత్రం తగ్గలేదు. సాగుభూమి పెరిగింది. ఈ లెక్కన జీడీపీలో వ్యవసాయం భాగస్వామ్యం కూడా పెరిగుండాలి, కానీ పెరగలేదు. అదే టైంలో రైతుల సంఖ్య తగ్గింది. ఈ రీసెర్చ్, రిజల్ట్స్ ఆధారంగా గ్రౌండ్ వాటర్ ఎస్టిమేషన్ మోడల్ని తయారు చేశాడు. నీటి నిల్వలు అడుగంటడానికి కారణమూ కనుక్కున్నాడు.. ‘8’ ఆకారంలో ఉన్న రెండు విషస్ సర్కిల్స్ అని. ఒకటి.. రైతులు మితిమీరిన కరెంటును వాడుకోవడం.. రెండు మితిమీరిన నీటిని ఉపయోగించడం. వీటిని సరిచేయాలంటే ఇనెఫిషియెంట్ ఇరిగేషన్ సిస్టమ్‌ను, ఇనెఫీషియెంట్ క్రాపింగ్ చాయిసెస్ను కరెక్ట్ చేసుకోవాలి. ఈ దిశగా పనిచేయడానికి ఉద్యోగ పరిమితులు అడ్డొచ్చాయి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని వేచి చూడకుండా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇదీ ఆయన పరిచయం.. జొన్నపిండి బిస్కట్ స్పూన్స్ ఆలోచనకు ముందు విషయం! ఆలోచనకు కారణమైన సంఘటన.. రాజీనామా చేశాక ఇనెఫీషియెంట్ క్రాపింగ్ చాయిసెస్ను కరెక్ట్ చేసే ప్రయత్నంలో ఉండగా జొన్నపంట.. దానితో ఉన్న ఆరోగ్య లాభాలు ఆయన్ని బాగా ఆకర్షించాయి. ఎకరా వరికి సరిపోయే నీటితో 60 ఎకరాల జొన్నపంటను పండించొచ్చు. అంటే ఆరుతడి పంటలతో నీటి నిల్వలనూ పెంచొచ్చు. పూర్మెన్ క్రాప్‌గా జొన్నకున్న అపవాదునూ పడగొట్టి దాని డిమాండ్ పెంచాలనుకున్నాడు నారాయణ. ఆ టైమ్‌లోనే అతను దేశంలోని చాలా ప్రాంతాల్లో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్లేవాడు. ఇదంతా 2004 నాటి సంగతి. ప్లాస్టిక్ వాడకం మీద అహ్మదాబాద్‌లో జరిగిన ఓ సెమినార్ ముగించుకుని ఫ్లయిట్లో హైదరాబాద్ వస్తున్నాడు. అంతకుముందు సెమినార్లో మాట్లాడిన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ప్లాస్టిక్ వాడకం ఇంతలా పెరిగిపోయింది కదా.. ఎన్ని టన్నుల ప్లాస్టిక్ గార్బేజ్ తయారై ఉంటుందో! రైల్వేట్రాక్స్కి రెండు వైపులా పేరుకున్న ప్లాస్టిక్ గార్బేజ్ గుర్తొచ్చింది. హైదరాబాద్ వచ్చాక విద్యానగర్‌లోని తనింటి దగ్గరున్న చాట్ భండార్కెళ్లాడు. చాట్ తినడానికి అన్నీ ప్లాస్టిక్ స్పూన్సే. పక్కనే చెత్తకుండీ ఉంది. ఈ భండార్‌లో వాడిన ప్లాస్టిక్ స్పూన్స్ అన్నీ ఈ చెత్తకుండీలో ఉండాలి కదా అని పక్కనే ఉన్న చెత్త ఏరుకునే మనిషిని అందులో స్పూన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడమన్నాడు. విరిగినవి తప్ప దొరకలేదు. అంటే అవన్నీ రీయూజ్ అవుతున్నాయన్నమాట. దిగ్భ్రాంతి కలిగింది నారాయణకు. అప్పుడు ఎప్పుడో అనుకున్న జొన్న పంటకు.. ప్లాస్టిక్‌కు ఒక లింక్ కుదిరినట్టనిపించింది. బేకీస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అలా సింక్రనైజ్ అయిన ఆలోచనే ‘బేకీస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్’గా రూపొందింది. ఆరోగ్యకరమైన జొన్నపంట డిమాండ్ పెంచాలి. విషతుల్యమైన ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. అందుకే జొన్నలను ప్లాస్టిక్‌కు అల్టర్నేటివ్గా మార్చుకున్నాడాయన. ఆ ధాన్యం పిండితో తయారైన బిస్కట్స్‌ను చెంచాల రూపంలో తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టి ఏడేళ్లు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా కూడా. ఉన్న ఇంటినీ అందులోనే పెట్టాడు. ఈ తపనంతా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. మొదట్లో ఈ చెంచాలు ఎవరినీ ఆకట్టుకోలేదు. కస్టమర్ల రుచి, అభిరుచి, ఉపయోగానికి అనుగుణంగా వీటిని మారుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు.. జొన్న, రాగులు వంటి వాటి మీద జనాలకు అవగాహన పెరిగింది. ఇదివరకన్నా కాస్త డిమాండ్ ఉంది. ఈ బిస్కట్ చెంచాల ఉపయోగమూ ఊపందుకుంది. అందుకే ఇప్పుడు ఫోర్క్స్, డెజర్ట్ స్పూన్స్, లంచ్ స్పూన్స్, చాప్‌స్టిక్స్ తయారు చేస్తున్నాడు నారాయణ. ‘వీటిని ఉపయోగించి ఐస్‌క్రీమ్ కోన్స్‌లా తినేయొచ్చు. ప్లెయిన్, మసాలా, స్వీట్.. అనే మూడు ఫ్లేవర్స్‌లో ఈ జొన్నపిండి బిస్కట్ స్పూన్స్‌ని తయారు చేస్తున్నాం. ఉట్టి నుంచి కాటిదాకా అనే సామెతుంటుంది మన దగ్గర. నేను జొన్నలను వూంబ్ నుంచి గ్రేవ్ దాకా అని అభివర్ణిస్తాను. ఇందులోని పోషక విలువలు ప్రెగ్నెంట్ విమెన్‌కి చాలా మంచివి. ఈ జొన్నపిండి బిస్కట్ స్పూన్స్ పళ్లొచ్చే పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జొన్నల్లోని ఫోలిక్ యాసిడ్స్ టీనేజర్స్‌లో కలిగే హార్మోనల్ ఇన్బాలెన్స్ను కరెక్ట్ చేస్తాయి. చిన్నప్పటినుంచి జొన్నలు తినడం వల్ల మధుమేహం రాదు. కొలెస్ట్రాల్‌కు విరుగుడు. మరెన్నో లాభాలున్న ఈ జొన్నప్రొడక్ట్స్కు ఇంకా డిమాండ్ పెరగాలి. మార్కెటింగ్ జరగాలి. రైల్వేస్ వాళ్ల కేటరింగ్‌లో వీటిని వాడేలా చేయాలి. ఇప్పుడు నా లక్ష్యం అదే. ఈ పరిశ్రమ అభివృద్ధికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడిప్పుడు మార్కెట్ కాస్త స్పందిస్తోంది. నేను చేస్తున్న పని రైతుకు ఆదాయం పెంచేది. ప్రపంచానికి చాలా అవసరం’అంటాడు నారాయణ. ఇన్ని ఉపయోగాలున్న ఈ బిస్కట్ స్పూన్ విలువ ఎంతో తెలుసా.. కేవలం మూడు రూపాయలే! -
ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది
‘‘చేసే ప్రతి పాత్రలోనూ నాదైన ముద్ర కనిపించాలి. అదే నా ధ్యేయం’’ అంటున్నారు అరవింద్‌కృష్ణ. ఇట్స్ మై లవ్‌స్టోరి, రుషి చిత్రాలతో గురింపు తెచ్చుకున్న ఈ యువహీరో... తన కెరీర్ గురించి హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘‘శారీరకంగా, మానసికంగా పాత్రలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అరవింద్. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలున్నాయని, వాటిల్లో ‘బిస్కెట్’ కామెడీ తరహా చిత్రమైతే, ‘అడవి కాచిన వెన్నెల’ థ్రిల్లర్ మూవీ అని, ‘సారథి’ అనే చిత్రంలో భిన్నమైన పాత్ర చేస్తున్నానని, ఇవిగాక ఓ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తున్నానని అరవింద్‌కృష్ణ తెలిపారు. కథలు, పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని, అరవింద్ ఏ పాత్రనైనా రక్తి కట్టించగలడని అనిపించుకోవాలన్నదే నా లక్ష్యమని అరవింద్ చెప్పారు. -
బిస్కెట్ ఎవరు వేశారు?
‘‘ఒక దర్శకుడికి దర్శకత్వంతో పాటు సంగీతం మీద కూడా అవగాహన ఉండటం విశేషం. పాటలన్నీ బాగున్నాయి’’ అన్నారు రాష్ట్ర మంత్రి డీకే అరుణ అన్నారు. అరవింద్ కృష్ణ, డింపుల్‌చోపడే జంటగా గోదావరి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ దీపక్‌రాజ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బిస్కెట్’. రాజ్, స్రవంతి నిర్మాతలు. అనిల్ గోపీరెడ్డి దర్శకత్వం వహించి, పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని డీకే అరుణ విడుదల చేసి, దర్శకుడు వీరభద్రంకు ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. ఈ వేడుకలో బసిరెడ్డి కూడా పాల్గొన్నారు. అరవింద్‌కృష్ణ మాట్లాడుతూ -‘‘ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో బిస్కెట్ వేస్తుంటారు. లేకపోతే ఇతరులు వేసే బిస్కెట్‌కి పడిపోతుంటారు. ఈ చిత్రంలో ఎవరు ఎవరికి బిస్కెట్ వేశారన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు.