నకిలీ బిస్కెట్ తయారీ కంపెనీపై దాడి
Published Sat, Sep 24 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
రాంపూర్ (ధర్మసాగర్) : బ్రాండెడ్ పేరుతో నకిలీ బిస్కెట్లు తయారు చేస్తున్న కంపెనీపై దాడి చేసి యంత్రాలు, బ్రాండెడ్ లేబుళ్లు సీజ్ చేసినట్లు ధర్మసాగర్ ఎస్సై కుమారస్వామి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్ కరాచీ బేకరీ బ్రాండెడ్ బిస్కెట్లను రాంపూర్‌లో నకిలీగా తయారు చేస్తున్నారన్నారు. ఆ కంపెనీకి చెందిన వాటాదారుడి ఫిర్యాదుతో రాంపూర్ ఇండసీ్ట్రయల్‌లోని ఓ కంపెనీపై దాడి చేసి కరాచీ బేకరీ బ్రాండెడ్ పేరుతో నకిలీ రేపర్లు, అట్టపెట్టలు, యంత్రసామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Advertisement
Advertisement