
సాక్షి, రామగుండం: చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన కొందరు యువకులు నూతన యాప్‌ను రూపొందించారు. దీనికి బిస్కెట్ యాప్‌గా నామకరణం చేశారు. ఈ యాప్ లోగోను పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా యువకులు ఎంతో శ్రమించి టిక్‌టాక్‌లో ఉన్న ఫీచర్స్ కంటే ఎన్నో రెట్లు అదనంగా ఉన్న బిస్కెట్ యాప్ రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిస్కెట్ యాప్ ఆవిష్కర్తలు రంగు శ్రీనివాస్‌గౌడ్, దుర్గేష్, ప్రణయ్, సాయికుమార్, సత్యాన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: 97.58 శాతం మందికి అర్హత
Comments
Please login to add a commentAdd a comment