ఇదేందయ్యా ఇది? నేను ఎప్పుడూ చూడలే.. పకోడీ తయారీలో భారీ ట్విస్ట్‌? | Viral Video: Biscuit Pakoda Filled With Spiced Potatoes | Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ఇది? నేను ఎప్పుడూ చూడలే.. పకోడీ తయారీలో భారీ ట్విస్ట్‌?

Nov 6 2023 1:20 PM | Updated on Nov 6 2023 1:28 PM

Biscuit Pakoda Filled with Spiced Potatoes - Sakshi

ప్రపంచంలో అణువణువునా ఆహార ప్రియులు కనిపిస్తారు. ఈ ఫుడ్ లవర్స్ కారణంగానే కొత్త ప్రయోగాలతో వినూత్న ఆహారాలు పుట్టుకొస్తుంటాయి సోషల్‌ మీడియాలో వంటల ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. 

తాజాగా ఒక వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఒక మహిళ ఉడికించిన బంగాళ దుంపలు, బిస్కెట్లు కలిపి వినూత్న రీతిలో పకోడీలు తయారు చేసింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

వీడియో మొదట్లో ఆ మహిళ పకోడీల తయారీకి వినియోగించే శనగపిండిలో బిస్కెట్లను ముంచడాన్ని గమనించవచ్చు. ఆ తరువాత వాటిని ఆమె వేడి నూనెలో వేయిస్తుంది. అయితే వీడియోలో ఇక్కడే ట్విస్ట్‌ ఉంది. ఆమె ఈ బిస్కెట్‌ పకోడీలను వేయించడానికి ముందు.. మొదటగా బంగాళాదుంపలను ఉడకబెట్టి మెత్తగా చేస్తుంది. దానికి వేయించిన మసాలా దినుసులు కలుపుతుంది. 

తరువాత రెండు బిస్కెట్ల మధ్య ఆ బంగాళదుంప మసాలా ముద్దను ఉంచి, వాటిని పకోడీలు చేయడానికి ఉపయోగించే పిండిలో ముంచి, డీప్ ఫ్రై చేస్తుంది. చివరగా ఆమె వాటిని సాస్‌తో కూడిన ప్లేట్‌లో సర్వ్‌చేస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @Shayarcasm అనే ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 20 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ 58 సెకన్ల వీడియోపై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 
ఇది కూడా చూడండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్‌? ‘ఎయిమ్స్‌’ నిపుణులు ఏమంటున్నారు?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement