Fry
-
మాదాపూర్: చికెన్ ఫ్రైలో పురుగులు.. షాకైన కస్టమర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తినే ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలు, బల్లులు, జెర్రులు రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్లో చికెన్ ఫ్రైలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. సైబర్ టవర్ ఎదురుగా ఉన్న హోటల్ నుంచి ఓ కస్టమర్ ఆర్డర్ తెప్పించుకున్నారు. పార్శిల్ ఓపెన్ చేయగానే పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో షాక్ తిన్న కస్టమర్ అనిరుధ్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ఇదేందయ్యా ఇది? నేను ఎప్పుడూ చూడలే.. పకోడీ తయారీలో భారీ ట్విస్ట్?
ప్రపంచంలో అణువణువునా ఆహార ప్రియులు కనిపిస్తారు. ఈ ఫుడ్ లవర్స్ కారణంగానే కొత్త ప్రయోగాలతో వినూత్న ఆహారాలు పుట్టుకొస్తుంటాయి సోషల్ మీడియాలో వంటల ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. తాజాగా ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఒక మహిళ ఉడికించిన బంగాళ దుంపలు, బిస్కెట్లు కలిపి వినూత్న రీతిలో పకోడీలు తయారు చేసింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియో మొదట్లో ఆ మహిళ పకోడీల తయారీకి వినియోగించే శనగపిండిలో బిస్కెట్లను ముంచడాన్ని గమనించవచ్చు. ఆ తరువాత వాటిని ఆమె వేడి నూనెలో వేయిస్తుంది. అయితే వీడియోలో ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఆమె ఈ బిస్కెట్ పకోడీలను వేయించడానికి ముందు.. మొదటగా బంగాళాదుంపలను ఉడకబెట్టి మెత్తగా చేస్తుంది. దానికి వేయించిన మసాలా దినుసులు కలుపుతుంది. తరువాత రెండు బిస్కెట్ల మధ్య ఆ బంగాళదుంప మసాలా ముద్దను ఉంచి, వాటిని పకోడీలు చేయడానికి ఉపయోగించే పిండిలో ముంచి, డీప్ ఫ్రై చేస్తుంది. చివరగా ఆమె వాటిని సాస్‌తో కూడిన ప్లేట్లో సర్వ్‌చేస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @Shayarcasm అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 20 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ 58 సెకన్ల వీడియోపై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చూడండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు? Gujjus have gone INSANE. pic.twitter.com/7VXRZzjOcP — 𝐌𝕒𝕟𝕥𝕠™ 𝚏𝚊𝚗 (@Shayarcasm) November 3, 2023 -
నోరూరించే మునగ పువ్వుల ఫ్లవర్ ఫ్రై చేసుకోండి ఇలా..!
మునగ పువ్వులుతో చేసే ఫ్లవర్ ఫ్రైకి కావలసినవి : మునగ పువ్వులు – రెండు కప్పులు నూనె – రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అరటీస్పూను ఉల్లిపాయ తరుగు – అరకప్పు పచ్చిమిర్చి – రెండు గుడ్లు – మూడు కరివేపాకు – రెండు రెమ్మలు కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా నిమ్మరసం – టీస్పూను. తయారీ విధానం: ∙మునగ పువ్వులను నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టాలి. తరువాత శుభ్రంగా కడిగి, నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి. ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో జీలకర్ర, ఉల్లి తరుగు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని వేసి వేయించాలి. ∙ఇవన్నీ వేగాక మునగపువ్వులు, కరివేపాకు వేసి కలపాలి ∙ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ∙పువ్వులు మగ్గాక గుడ్లసొన వేసి కలపాలి. ∙చక్కగా వేగాక, రుచికి సరిపడా ఉప్పు వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. ∙చివరగా కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. నిమ్మరసం చల్లుకుని అన్నం, చపాతీల్లోకి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: మురిపముగా.. మొరింగ్ దోశ చేసుకోండి ఇలా..!) -
చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే?
రెస్టారెంట్ కిచెన్లలో సిబ్బంది మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధిస్తారు యజమానులు. వేడి వాతావరణం, గ్యాస్ లీకైతే పేలుడు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ముందుజాగ్రత్తగా ఫోన్లు తీసుకురావొద్దని చెబుతారు. అయితే ఓ మహిళ మాత్రం ఈ రూల్‌ను పక్కనపెట్టింది. మొబైల్ ఫోన్‌ను రెస్టారెంట్ కిచెన్‌లోకి తీసుకెళ్లింది. ఫ్రై చేస్తున్న సమయంలో ఫోన్లో ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆమె దృష్టిమళ్లింది. వెంటనే జేబులోనుంచి ఫోన్ తీసి చూసింది. అయితే అనుకోకుండా ఆ ఫోన్ ఆమె చేతిలోనుంచి జారి సలసల మరిగే నూనెలో పడిపోయింది. దీంతో షాకైన ఆమె వెంటనే పట్టుకారుతో ఆ ఫోన్‌ను నూనెలోనుంచి బయటకు తీసింది. కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ ఫోన్ దేనికి పనికిరాకుండా పోయింది. ఆ మహిళ ఫేస్‌లో ఎక్స్ప్రెషన్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. Oops pic.twitter.com/acPOyFARHU — cctv ediots 📷 (@cctv_videos) March 2, 2023 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఆ ఫోన్‌ను వెంటనే బియ్యంలో పెట్టారా? అలా చేస్తే పనిచేస్తుంది కదా? అని ఓ నెటిజన్ చలోక్తులు విసిరాడు. మరో యూజర్ స్పందిస్తూ.. ఫోన్ సంగతి సరే.. ఆ నూనెను మార్చాల్సి వస్తుందని వారు బాధపడుతున్నారేమో? సలసల మరిగే నూనెలో సెల్‌ఫోన్ పడితే ఎలాంటి కెమికల్స్ విడుదలవుతాయో ఆ దేవుడికే తెలియాలి అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఫోన్ నూనెలో పడగానే నేనింకా ఆమె చేతితో దాన్ని బయటకు తీస్తుందేమో అనుకున్నా.. అని నవ్వులు పూయించాడు. చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్ -
‘ట్విటర్ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్ నాయకులు
సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ మీద ఉన్న కోపాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ పక్షిపై చూయించారు. ఆ పక్షిని బలి తీసి ఉప్పుకారం మసాలాలు దట్టించి సలసల మాగే నూనెలో వేయించారు. అనంతరం ఆ మాంసాన్ని ట్విటర్ ప్రధాన కార్యాలయానికి పోస్టు చేశారు. ఇదంతా చేసింది రాహుల్ ఖాతాను ట్విటర్ నిలిపివేయడానికి నిరసనగా చేసిన ఈ కార్యక్రమం వైరల్‌గా మారింది. ఈ ఘటనను పలువురు ఖండిస్తుంటే.. మరికొందరు హర్షిస్తున్నారు. ఇంతకీ ఆ పక్షిని కాల్చి వండుకుతిన్నది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ఎంపీ కుమారుడు, అతడి అనుచరులే. (చదవండి: ఎట్టకేలకు రాహుల్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ) రాహుల్‌గాంధీ ఖాతాను ట్విటర్ వారం నిషేధించిన అనంతరం పునరుద్ధరించింది. వరుసగా ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఏపీకి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ ట్విటర్ లోగోలో ఉండే పక్షి పిచ్చుక. ట్విటర్‌పై కోపంతో పిచ్చుకను కాల్చి మాంచిగా వండారు. ఫ్రై చేస్తూనే తాము ఎందుకు ఈ విధంగా చేస్తున్నామో తెలిపారు. ‘రాహుల్‌గాంధీ ట్విటర్ ఖాతా నిలుపుదల చేసి ట్విటర్ నిర్వాహకులు తప్పు చేశారు. కాంగ్రెస్ ట్వీట్లను ప్రమోట్ చేయడం లేదు. బీజేపీ చేసిన కుట్రతోనే ట్విటర్ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లను బ్లాక్ చేసింది’ అని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బీజేపీ డౌన్‌డౌన్ అని నినదించారు. ట్విటర్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు హితవు పలికారు. చివరకు వండిన ఆ మాంసాన్ని ఒక డబ్బాలో పెట్టి గురుగ్రామ్‌లోని ట్విటర్ కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పారు. తపాలా కార్యాలయానికి వెళ్తున్నవరకు వీడియో ఉంది. అనంతరం వారు ఆ బాక్స్ పోస్టు చేశారు. చదవండి: ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్.. జైల్లోనే -
క్రేజీ..వా!
కినోవా..? ఇదేంటబ్బా? ధాన్యమా? బంగారమా? కిలో ఖరీదు... వేలల్లోనా? ఆగండాగండి... అక్కడే ఉంది తిరకాసు అంతా. ప్రొటీన్లు, ఖనిజాలు- ఓయబ్బో బోలెడున్నాయ్ దీన్లో. అందుకే... గ్లామర్ తారలకిప్పుడిది ఫేవరెట్ ఫుడ్. రైతుకు రొక్కం... మనకు చేవ... కినోవా! కినోవా చికెన్ సలాడ్ కావలసినవి: కినోవా- ఒక కప్పు టొమాటో ముక్కలు- రెండు కప్పులు పాలకూర తరుగు- ఒక కప్పు చికెన్ - రెండు కప్పులు మీగడ- అర కప్పు వెల్లుల్లి రేకలు- మూడు (సన్నగా తరగాలి) నిమ్మకాయ- ఒకటి (పలుచగా తరగాలి) నిమ్మరసం- పావు కప్పు ఉప్పు- తగినంత మిరియాల పొడి- పావు టీ స్పూన్ ఆలివ్ ఆయిల్- రెండు టేబుల్ స్పూన్లు వేరుసెనగపప్పు- పావు కప్పు తయారీ: చికెన్ ముక్కలను ఉడికించాలి. రుచి పెరగడం కోసం కొద్దిగా అల్లం - వెల్లుల్లి, ఉప్పు వేసి ఉడికించుకోవచ్చు. లేదా ముక్కలను అలాగే ఉడికించవచ్చు. వేరుసెనగపప్పు, కినోవాను విడిగా మందపాటి పెనంలో సన్నమంట మీద దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత ఒక పాత్రలో కినోవా, టొమాటో, పాలకూర, చికెన్, మీగడ, వెల్లుల్లి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. చివరగా వేరుసెనగపప్పు, నిమ్మకాయ చెక్కలను అలంకరించి సర్వ్ చేయాలి. గమనిక: పిల్లల కోసం చేసేటప్పుడు కినోవాను వేయించి చేస్తే ఇష్టపడతారు. పెద్దవాళ్లకు ఉడికించిన కినోవాతో చేస్తే మంచిది. కినోవా చిక్ పీ స్టిర్ ఫ్రై కావలసినవి: కినోవా ధాన్యం - ఒక కప్పు, పచ్చి సెనగలు - ఒక కప్పు, టొమాటో ముక్కలు- ఒక కప్పు, మిరప్పొడి- రెండు టీ స్పూన్లు, ఉప్పు- తగినంత, పాలకూర తరుగు - నాలుగు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి (తరగాలి), వెల్లుల్లి రేకలు - నాలుగు (తరగాలి), అల్లం తరుగు - ఒక టీ స్పూన్, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూన్ పోపు దినుసులు: ఆలివ్ ఆయిల్- మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర- రెండు టీ స్పూన్లు, గరం మసాలా పొడి- రెండు టీ స్పూన్లు, కూర పొడి- రెండు టీ స్పూన్, మిరియాల పొడి- చిటికెడు, ఎండు మిర్చి- రెండు (నిలువుగా చీరాలి) తయారీ: పచ్చి సెనగల్ని కడిగి ఆరుగంటల సేపు నానబెట్టి ఉడికించాలి. కినోవాను ఉడికించి పక్కన పెట్టాలి.మందపాటి వెడల్పు బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేయాలి. సన్నమంట మీద రెండు నిమిషాలపాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి. గ్యాస్ స్టౌ మంటను మీడియంలో పెట్టి కలియబెడుతూ వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసి, వేగిన తర్వాత కినోవా వేసి బాగా కలుపుతూ ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉడికించిన పచ్చి సెనగలు వేసి, కలిపి రెండు నిమిషాల పాటు ఉంచాలి. టొమాటోలు, మిరప్పొడి, పాలకూర వేసి కలిపి మూతపెట్టాలి. అవి మగ్గిన తర్వాత ఉప్పు కలిపి మరో నిమిషం ఉడికించి, దించేయాలి. కినోవా ఉప్మా కావలసినవి: కినోవా - అర కప్పు, నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు- ముప్పావు కప్పు, అల్లం తరుగు- అర టీ స్పూన్, పచ్చి మిర్చి తరుగు- ఒక టీ స్పూన్, ఎండు మిర్చి- ఒకటి, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- ఒక రెమ్మ, ఆవాలు- అర టీ స్పూన్, జీలకర్ర- అర టీ స్పూన్, మినప్పప్పు- అర టీ స్పూన్, పచ్చి సెనగపప్పు- అర టీ స్పూన్, క్యారట్ ముక్కలు- ముప్పావు కప్పు, మొక్కజొన్న గింజలు- పావు కప్పు (పచ్చివి), పచ్చి బఠాణీలు- అర కప్పు, నీరు - రెండు కప్పులు, కొత్తిమీర తరుగు- రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు- తగినంత తయారీ: కినోవాను కడిగి పక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి అవి పేలిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, ఇంగువ వేసి అర నిమిషం తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి. ఒక నిమిషం వేగిన తర్వాత క్యారట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, బఠాణీలు వేసి బాగా కలిపి మూతపెట్టి, సన్నమంట మీద రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు కినోవా, ఉప్పు వేసి కలిపి ఒక నిమిషం తర్వాత నీరు పోసి కలిపి మూత పెట్టి, సన్న మంట మీద ఉడికించాలి. నీరు పోసిన తర్వాత ఐదు నిమిషాల్లోనే కినోవా ఉడికి, ఉప్మా రెడీ అవుతుంది. గమనిక: కినోవా వంటకం పొడి పొడిగా ఉండాలంటే ఒక కప్పు కినోవాకు రెండు కప్పుల నీరు పోయాలి. మృదువుగా ఉండాలంటే రెండున్నర కప్పుల నీటిని పోయాలి. కూరగాయల మోతాదును బట్టి అంచనాతో నీటి మోతాదు పెంచుకోవాలి. కినోవా ధాన్యం సన్నగా ఉంటుంది. మామూలుగా పాత్రలో నీరు పోసి కడిగితే, నీటితోపాటు జారిపోతుంది. కాబట్టి పాత్రలో వేసి కడిగి, నీరు కారిపోవడానికి రవ్వను జల్లించే జల్లెడలో వేయాలి.