How To Prepare Moringa Flowers Sabzi Recipe In Telugu, Check Process Inside - Sakshi
Sakshi News home page

Moringa Flowers Recipe: నోరూరించే మునగ పువ్వుల ఫ్లవర్‌ ఫ్రై చేసుకోండి ఇలా..!

Published Fri, Jun 30 2023 10:26 AM | Last Updated on Fri, Jul 14 2023 4:00 PM

Moringa Flowers Recipe Try This Way - Sakshi

మునగ పువ్వులుతో చేసే ఫ్లవర్‌ ఫ్రైకి కావలసినవి :
మునగ పువ్వులు – రెండు కప్పులు
నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు 
జీలకర్ర – అరటీస్పూను
ఉల్లిపాయ తరుగు – అరకప్పు 
పచ్చిమిర్చి – రెండు 
గుడ్లు – మూడు 
కరివేపాకు – రెండు రెమ్మలు 
కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
 ఉప్పు – రుచికి సరిపడా
 నిమ్మరసం – టీస్పూను. 

తయారీ విధానం: ∙మునగ పువ్వులను నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టాలి. తరువాత శుభ్రంగా కడిగి, నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి. ∙బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో జీలకర్ర, ఉల్లి తరుగు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని వేసి వేయించాలి. ∙ఇవన్నీ వేగాక మునగపువ్వులు, కరివేపాకు వేసి కలపాలి ∙ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. ∙పువ్వులు మగ్గాక గుడ్లసొన వేసి కలపాలి. ∙చక్కగా వేగాక, రుచికి సరిపడా ఉప్పు వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. ∙చివరగా కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. నిమ్మరసం చల్లుకుని అన్నం, చపాతీల్లోకి సర్వ్‌ చేసుకోవాలి.  

(చదవండి: మురిపముగా.. మొరింగ్‌ దోశ చేసుకోండి ఇలా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement