రెస్టారెంట్ కిచెన్లలో సిబ్బంది మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధిస్తారు యజమానులు. వేడి వాతావరణం, గ్యాస్ లీకైతే పేలుడు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ముందుజాగ్రత్తగా ఫోన్లు తీసుకురావొద్దని చెబుతారు. అయితే ఓ మహిళ మాత్రం ఈ రూల్‌ను పక్కనపెట్టింది. మొబైల్ ఫోన్‌ను రెస్టారెంట్ కిచెన్‌లోకి తీసుకెళ్లింది. ఫ్రై చేస్తున్న సమయంలో ఫోన్‌లో ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆమె దృష్టిమళ్లింది. వెంటనే జేబులోనుంచి ఫోన్ తీసి చూసింది.
అయితే అనుకోకుండా ఆ ఫోన్ ఆమె చేతిలోనుంచి జారి సలసల మరిగే నూనెలో పడిపోయింది. దీంతో షాకైన ఆమె వెంటనే పట్టుకారుతో ఆ ఫోన్‌ను నూనెలోనుంచి బయటకు తీసింది. కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ ఫోన్ దేనికి పనికిరాకుండా పోయింది. ఆ మహిళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది.
Oops pic.twitter.com/acPOyFARHU
— cctv ediots 📷 (@cctv_videos) March 2, 2023
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఆ ఫోన్‌ను వెంటనే బియ్యంలో పెట్టారా? అలా చేస్తే పనిచేస్తుంది కదా? అని ఓ నెటిజన్ చలోక్తులు విసిరాడు.
మరో యూజర్ స్పందిస్తూ.. ఫోన్ సంగతి సరే.. ఆ నూనెను మార్చాల్సి వస్తుందని వారు బాధపడుతున్నారేమో? సలసల మరిగే నూనెలో సెల్‌ఫోన్ పడితే ఎలాంటి కెమికల్స్ విడుదలవుతాయో ఆ దేవుడికే తెలియాలి అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఫోన్ నూనెలో పడగానే నేనింకా ఆమె చేతితో దాన్ని బయటకు తీస్తుందేమో అనుకున్నా.. అని నవ్వులు పూయించాడు.
చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment