యూనివర్సల్‌పై లక్కీ ఎలెవన్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో లక్కీ ఎలెవన్ 98 పరుగుల తేడాతో యూనివర్సల్ జట్టుపై గెలుపొందింది. లక్కీ ఆటగాళ్లు శ్రీకృష్ణ (90) బ్యాటింగ్‌లో, నాగశివ (4/25), విజయ్ (3/22) బౌలింగ్‌లో రాణించారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్కీ జట్టు 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌటైంది.
రాహుల్ 33 పరుగులు చేయగా, ప్రత్యర్థి బౌలర్లు కపిల్ 4, సోమ్‌నాథ్, యశ్వంత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూనివర్సల్ 149 పరుగులకే ఆలౌటైంది. ఈశ్వర్ 26, రాజ్ 20 పరుగులు చేశారు. నాగశివ 4, విజయ్ 3, రోహన్ 2 సమష్టిగా యూనివర్సల్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.