Srikrishna
-
ఫైనాన్స్ కంపెనీ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా జస్టిస్ శ్రీకృష్ణ
డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం ఈక్వల్, అలాగే ఆ సంస్థ పెట్టుబడులున్న అకౌంట్ అగ్రిగేటర్ వన్‌మనీ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ(Justice B.N. Srikrishna) నియమితులయ్యారు. న్యాయశాస్త్ర, ఆర్థిక(Finance), టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్బీఐ మాజీ గవర్నర్లు జగదీష్ కపూర్, రాకేష్ మోహన్ .. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జె సత్యనారాయణ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.డేటా షేరింగ్‌కి సంబంధించి భద్రత, నైతికతకు ప్రాధాన్యమిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ఇరు కంపెనీలకు ఈ బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. వ్యక్తుల హక్కులు, ఆకాంక్షలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాల్లో సమతౌల్యత పాటించేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ తెలిపారు. రుణాలు, ఉద్యోగాలు(Jobs), ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మందికి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నామని ఈక్వల్ వ్యవస్థాపకుడు కేశవ్ రెడ్డి తెలిపారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధన దిశగా కృషి చేస్తున్నట్లు వన్‌మనీ వ్యవస్థాపకుడు కృష్ణ ప్రసాద్ చెప్పారు.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతబ్రిగేడ్ గ్రూప్ కొత్త ప్రాజెక్ట్రియల్టీ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కోకాపేటలో బ్రిగేడ్ గేట్‌వే పేరుతో 10 ఎకరాల విస్తీర్ణంలో హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకు రూ.4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ ప్రాజెక్టులో లగ్జరీ గృహాలను 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, చెన్నై, కొచ్చిలో కంపెనీ పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. -
కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'..
శ్రీకృష్ణుడు పుత్రసంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని, ద్వారకా నగరం నుంచి బయలుదేరి, గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి, శరీరమంతా భస్మ లేపనాలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి, శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి, ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగు పెట్టాడు.శ్రీకృష్ణుడిని చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి, కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ప్రభూ! పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా?’ అని అడిగాడు.పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, ‘మహాత్మా! నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను?’ అని అడిగాడు. ‘భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి’ అని చెప్పాడు ఉపమన్యుడు.ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశమార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనం ఇచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులిచర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణురూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహా మునిపుంగవులందరూ పరమశివుడితో కలసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమానందభరితుడై పరమశివుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పఠించాడు.పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ‘కృష్ణా! నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణుడివని తెలుసుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘శంకరా! నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సమానుడైన వాడు, పరమ శివభక్తుడు అయిన కుమారుడు కావాలి. అనుగ్రహించు’ అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు. తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి, అతణ్ణి ఆకాశమార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు.కృష్ణుడు ద్వారకానగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని, కృష్ణుణ్ణి వెదకడానికి బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు. సరిగా అప్పుడే, కృష్ణుడు లేడని తెలుసుకుని, కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు.కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి, అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి, ‘మహర్షీ! మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగారు.‘ప్రజలారా! భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు.నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్లి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్యసింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు. గరుత్మంతుడు పరమేశ్వరుడికి, కృష్ణుడికి నమస్కరించాడు.కృష్ణుడి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకా వాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకుని, గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగుపెడుతూనే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు. సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. – సాంఖ్యాయన -
ప్రముఖ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలు..
మధుర, బృందావనం మొదలుకొని దేశవ్యాప్తంగా నేటి ఉదయం నుంచి పలు ఆలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. శ్రీహరి అవతారాల్లో ఇది సంపూర్ణమైనదని చెబుతారు. ఈ సారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రెండు రోజులు నిర్వహిస్తున్నారు. కొందరు సెప్టెంబరు 6న జన్మాష్టమి వేడుకలు చేసుకోగా, మరికొందరు నేడు (సెప్టెంబరు 7)న ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో ఆలయాలన్నీ ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. #WATCH | UP: Mangala aarti underway in Krishna Janmabhoomi temple in Mathura, on the occasion of #Janmashtami pic.twitter.com/DSV80e7mbD — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 7, 2023 శ్రీకృష్ణ జన్మభూమి మధురలో ఉదయం స్వామివారికి మంగళహారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో ఆలయంలో శంఖనాదాలు చేశారు. ఆలయంలో కొలువైన రాధాకృష్ణులకు పసుపురంగు దుస్తులు ధరింపజేశారు. అలాగే పూలతో అలంకరించారు. #WATCH | West Bengal: Devotees celebrate & offer prayers at the Iskcon temple in Kolkata on the occasion of #Janmashtami pic.twitter.com/wEDQWVEs0D — ANI (@ANI) September 7, 2023 పశ్చిమబెంగాల్లోని ఇస్కాన్ ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో పూజలు, అర్చనలు విశేషరీతిలో జరిగాయి. కొందరు భక్తుల భగవానుని సమక్షంలో నృత్యాలు చేశారు. కొందరు శంఖనాదాలు చేశారు. #WATCH | Uttarakhand: Devotees throng Badrinath temple during the #Janmashtami celebrations pic.twitter.com/8bf3lhclIz — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 7, 2023 ఉత్తరాఖండ్‌లోని బదరీనాథ్ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. ఆలయాన్ని ఎల్ఈడీ వెలుగులతో నింపేశారు. #WATCH | Delhi: Tulsi aarti underway in Iskcon temple on the occasion of #Janmashtami pic.twitter.com/TpCbF6tsJ7 — ANI (@ANI) September 6, 2023 ఢిల్లీలోని ఇస్కాన్ మందిరంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి తులసి హారతి సమర్పించారు. ఆలయ పూజారులు, భక్తులు సంయుక్తంగా హారతి అందించారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. #WATCH | UP: Mangala Aarti underway in Noida Iskcon temple, on the occasion of #Janmashtami pic.twitter.com/U0I5878Um9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 6, 2023 -
నాటి షబ్నం.. నేటి మీరా.. కృష్ణ ప్రేమలో మునిగితేలుతున్న లేడీ బౌన్సర్
శ్రీ కృష్ణుని జన్మస్థలి మధుర, లీలాస్థలి బృందావనం.. ఈ రెండూ భక్తులకు భక్తి భావాన్ని పెంపొందింపజేస్తాయని అంటారు. శ్రీకృష్ణుని అపార ప్రేమకు ఈ రెండు ప్రాంతాలు నిదర్శనంగా నిలిచాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ తన అపార భక్తిభావనతో బృందావనం చేరుకుని, శ్రీకృష్ణుని భక్తిలో మునిగితేలుతోంది. షబ్నం.. ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లోని జిగర్ కాలనీ నివాసి ఇక్రమ్ హుస్సేన్ కుమార్తె. ఇక్రమ్ వంటపాత్రలతో పాటు లోహ విగ్రహాలను తయారు చేస్తుంటాడు. షబ్నంనకు చిన్నప్పటి నుంచే హిందూ దేవీదేవతలపై ఆరాధనా భావం ఏర్పడింది. ఇదే ఆమెను కృష్ణునిపై ప్రేమకు, ఆపై బృందావనానికి పయనమయ్యేలా చేసింది. నాలుగు నెలల క్రితం ఆమె.. చేతిలో లడ్డూ పట్టుకున్న బాలగోపాలుని విగ్రహాన్ని తీసుకుని బృందావనం చేరుకుంది. ఇక్కడి గోవర్థన ప్రదక్షిణ మార్గంలోని గోపాల ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. దీంతో ఇక్కడే ఉంటూ శ్రీకృష్ణుని భక్తిలోనే తన జీవితం అంతా గడపాలని నిశ్చయించుకుంది. 2000లో షబ్నంకు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తితో నిఖా జరిగింది. ఐదేళ్ల తరువాత ఆమకు భర్త తలాక్ చెప్పాడు. దీంతో ఆమె తన తండ్రి ఇక్రమ్ ఇంటికి తిరిగివచ్చి కొన్నాళ్లు అక్కడే ఉంది. తరువాత షబ్నం ఢిల్లీ చేరుకుని మొదట ఒక ప్రేవేట్ కంపెనీలో, ఆ తరువాత లేడీ బౌన్సర్గానూ పనిచేసింది. శ్రీకృష్ణునిపై తనకు ఏర్పడిన ప్రేమ గురించి షబ్నం మాట్లాడుతూ ఇప్పుడు తాను తన కుటుంబ సభ్యులందరితో బంధాన్ని తెంచుకున్నానని, ఎవరితోనూ మాట్లాడటం లేదని తెలిపింది. శ్రీ కృష్ణుడే తనకు సర్వస్వం అని, అందుకే అందరికీ దూరంగా ఉన్నానని తెలిపింది. ఇది కూడా చదవండి: యువత పాడైపోతున్నదంటూ సంగీత పరికరాల దహనం! -
CM KCR : హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ (ఫొటోలు)
-
హృదయాలను కదిలిస్తున్న జ్యూట్ మిల్లు కార్మికుల ఆవేదన
-
ఖతర్నాక్ హ్యాకర్.. భారీగా నగదు చోరీ
బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుబడిన అంతర్జాతీయ హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీ జల్సా జీవితం కోసం బిట్‌కాయిన్ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం అతడు పరప్పన సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నాడు. ఇతని ఖాతాలో రూ.9 కోట్లు విలువ చేసే 31 బిట్కాయిన్లను సీజ్ చేశారు. సీసీబీ విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగుచూశాయి. అంతర్జాతీయ స్థాయి వెబ్సైట్లతో పాటు వేర్వేరు దేశాల పోకర్‌గేమ్స్ వెబ్సైట్లలోని ఖాతాల్లోకి చొరబడి క్రిప్టో కరెన్సీలైన బిట్ కాయిన్, వైఎఫ్ఏ తదితరాలను దొంగించినట్లు కనిపెట్టారు. పోలీసులకు పట్టుబడిన శ్రీకృష్ణ అనుచరులు సునీశ్ శెట్టి, ప్రసిద్ శెట్టి, సంజయ్, హేమంత్ ముద్దప్ప, రాబిన్ ఖండేల్వాల్ ఇతరులతో కలిసి పోకర్ గేమింగ్ వెబ్సైట్లను హ్యాక్ చేసి డేటాను చోరీచేసి ఆ డేటాను తమ గేమింగ్ వెబ్సైట్ కోసం వినియోగించేవారు. ఇప్పటి వరకు మూడు బిట్‌కాయిన్ ఎక్సే్ఛంజిలను, 10 పోకర్ వెబ్సైట్లు, 4 సాధారణ వెబ్సైట్లను హ్యాచ్ చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌కి కన్నం బెంగళూరు కేంద్రంగా హ్యాకర్ శ్రీకృష్ణ ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో బస చేసేవాడు. దోచుకున్న బిట్కాయిన్లను తమ ఖాతాల్లోకి మళ్లించి ముఠాతో కలిసి నగదుగా మార్చుకునేవాడు. డార్క్‌నెట్ వెబ్సైట్ల గుండా విదేశాల నుంచి డ్రగ్స్‌ను ఈ బిట్కాయిన్ల ద్వారానే కొనేవాడు. 2019లో అక్రమంగా ధన సంపాదనకు కర్ణాటక ప్రభుత్వ ఇ–ప్రొక్యూర్మెంట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి కోట్లాది ధనాన్ని తన అనుచరుల అకౌంట్లకు జమ చేశారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. కాగా, రూ.9 కోట్ల విలువైన 31 బిట్కాయిన్లను పోలీసులు సీజ్ చేశారు. అతని లావాదేవీలు, ఖాతాలపై విచారణ జరుపుతున్నారు. -
బుడతల్లారా.. ఉడతల్లారా!
స్కూలు వదలగానే నాలుగో తరగతి చదువుతున్న అభిరామ్, భాస్వంత్‌లు కొందరు స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న పార్కుకి వెళ్లి జారుడు బల్ల, ఉయ్యాల, దాగుడు మూతలు.. ఎంతో సంబరంగా అడుకున్నారు. తర్వాత ఇసుకలో దూదుం పుల్ల ఆడుతున్నారు. వారి ఆటలకు సంబరపడుతూ నింగినుంచి మహాకవి శ్రీశ్రీ కిందికి దిగారు. ఆ చిన్నారులను దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆయనకు తను రాసిన కవిత్వం స్ఫురించింది.‘‘మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మీకే అని ఆనందించే కూనల్లారా... ఈలలు వేస్తూ ఎగురుతు పోయే పిల్లల్లారా పిల్లల్లారాగరిక పచ్చ మైదానాల్లోనూ తామరపూవుల కోనేరులలోపంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి పందిటా తల్లి కౌగిటానోళుల వ్రేళులు, పాలబుగ్గలూ ఎక్కడ చూస్తే అక్కడ మీరైవిశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారాఉడుతల్లారా బుడతల్లారా ఇది నా గీతం... వింటారా...’’ అంటూ శైశవగీతి వినిపించాడు.పాట వింటున్న బుడతలు, ‘తాతా! మాకు హరివిల్లు ఎలా ఉంటుందో తెలియదు, గరికపచ్చ మైదానాలు, తామర కొలనులు ఏవీ తెలియవు. అవన్నీ ఎక్కడ ఉంటాయి’ అని అమాయకంగా ప్రశ్నించారు. శ్రీశ్రీ నోట మాట రాలేదు. ఆ పసికూనలకు ఎక్కడ ఎలా చూపించాలో తెలియలేదు.‘మీ స్కూల్ టీచర్లు ఇవేవీ చూపించలేదా, మీ అమ్మానాన్నలు వీటి గురించి చెప్పలేదా’ అని అడిగాడు. అందుకు ఆ చిన్నారులు, ‘లేదు తాతా!’’ అన్నారు. వారి స్థితికి చింతిస్తూ, బరువెక్కిన గుండెతో మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు శ్రీశ్రీ.అంతలోనే యశోదమ్మ వచ్చింది, ‘ఓయమ్మ మీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగ మననీడమ్మా, పోయెదమెచ్చటికైనను మాయన్నుల సురభులాన మంజులవాణీ’ అని చదివాడు కాస్త తెలుగు తెలిసిన పెద్ద బుడతడు. ఆ మాటలు చెవిన పడ్డాయో లేదో యశోదలోని మాతృత్వం బయటకు వచ్చింది, ‘ఏం నాయనా! ఇలా నా కుమారుడి మీద నేరాలు చెబుతున్నారు’ అని అడిగింది. ‘అవ్వా! మీ అబ్బాయి ఇంత అల్లరి చేస్తే నువ్వు ఎన్నడూ కొట్టలేదా’ అని అడిగారు. ‘కొట్టలేదురా పిల్లలూ! మీలాంటి చిట్టిచిట్టి పిల్లలు అల్లరి చేస్తేనే సరదాగా ఉంటుంది. ఇరుగుపొరుగమ్మలు నేరాలు చెప్పినా, చిన్నారి కృష్ణుడు ఏం చేశాడో తెలుసుకుని, అది పెద్ద తప్పయితే, నెమ్మదిగా మందలించేదాన్ని. చిన్నపిల్లలు దేవుడితో సమానం, అందుకే పిల్లలు అల్లరి చేసినా దేవుడి చేష్టగానే భావించేదాన్ని’’ అని చెప్పి వెళ్లిపోయింది యశోద. చిన్నారులకు ఆ యశోదమ్మ పిల్లవాడిని కొట్టలేదన్న విషయం అర్థమైంది. ‘శ్రీశ్రీ తాతయ్య, యశోద అమ్మమ్మ మాటలు వింటుంటే నాకు కూడా తాతయ్య ఇంటికి వెళ్లాలనుంది’ అన్నాడు ఒక చిన్నారి.‘నాకూ వెళ్లాలనే ఉంది. కాని స్కూల్‌కి సెలవులు ఉండవుగా. ఒకవేళ ఇచ్చినా, ఏవో ఒకటి నేర్చుకోమంటుంది అమ్మ’ అంటూ దిగాలుగా అన్నాడు మరో చిన్నారి. వీళ్ల మాటలు వింటున్న దశరథుడు వారి దగ్గరగా వచ్చి, ‘నాయనలారా! ఎందుకురా ఇలా డీలాపడుతున్నారు’ అని ప్రశ్నించాడు. ‘తాతా! రాముడు ఒకసారి చందమామ కావాలి అని ఏడుస్తుంటే, నువ్వు అద్దం తీసుకువచ్చి ఆ అద్దంలో చందమామను చూపించావు. చందమామ కోసం పేచీ పెట్టాడని కొట్టలేదు కదా! కాని మా అమ్మనాన్నలు నేను ఏది అడిగినా తెచ్చివ్వకపోగా గట్టిగా కోప్పడతారు. అంతేనా ఒకసారి నేను పార్కుకి తీసుకెళ్లమని అడిగినందుకు నన్ను హాస్టల్లో చేర్పించేశారు’’ అంటూ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దశరథుడి పితృహృదయం పరితపించింది. నా రామచంద్రుడు అరణ్యాలకు వెళ్లినందుకేగా నేను విలపించి విలపించి మరణించాను. మరి నేటి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు అనుకున్నాడు. చిన్నారులకు కొద్దిసేపు ఒడిలోకి తీసుకుని, సముదాయించి, బుజ్జగించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆటల సమయం మించిపోవడంతో ఆ చిన్నారులంతా ఇంటికి వెళ్లిపోయారు. ఆ రాత్రంతా వారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. వారి ఆనందానికి అవధులు లేవు. అందమైనది బాల్యంరాముడు, కృష్ణుడు, వివేకానందుడు.. ఎందరో మహానుభావులు బాల్యాన్ని అందంగా అనుభవించారు. విశాలమైన ఆటస్థలంలో ఆడుకున్నారు. అమ్మనాన్నల ప్రేమను సంపూర్ణంగా ఆస్వాదించారు. సెలవులకి తాతయ్యల ఇళ్లకు వెళ్లి వారి దగ్గర కథలు విన్నారు, వారు పెట్టే సున్నుండలు తిన్నారు, ఎండల్లో మామిడిచెట్లు ఎక్కారు, వానలో పడవలు వేశారు, చలిలో చలి మంటలు వేసుకున్నారు. గాలిలో గాలిపటాలు ఎగురవేశారు... పంచభూతాలతో చెట్టపట్టాలేసుకుని ఆడుకున్నారు. వారి జీవితం నిజమైన శైశవగీతి అయ్యింది. – డా. వైజయంతి పురాణపండ -
పరమాత్ముడు పరమ ఆప్తుడు
కిట్టనివాళ్లు మాయగాడు అన్నారు. ఓరిమితో సహించాడు. శృంగార పురుషుడన్నారు... కిమ్మనలేదు. కొంటెకృష్ణుడని ఆడిపోసుకున్నారు... ఆగ్రహించలేదు. నల్లనివాడనీ, వెన్నదొంగ అనీ అన్నారు. కిమ్మనలేదు. తాత్వికుడన్నారు. కాదనలేదు. పరమాత్ముడవంటూ పూజలు చేశారు, కాదు పొమ్మనలేదు, తామరాకు మీది నీటిబొట్టులా దేనికీ చలించకుండా ఎవరు ఏ దృష్టితోచూస్తే ఆ దృష్టితో దర్శనమిచ్చాడు. పుట్టింది మొదలు అవతార పరిసమాప్తి వరకు అడుగడుగునా అనేక లీలలను ప్రదర్శించాడు. అందుకే పురాణాలు శ్రీకృష్ణుని లీలామానుష విగ్రహునిగా పేర్కొన్నాయి. నదులన్నీ సముద్రంలో చేరినట్లు కృష్ణుడు అందరికీ ఆప్తుడయ్యాడు. పరమాత్ముడయ్యాడు. త్రేతాయుగంలో దుష్టశిక్షణ అంతా మానవ ధర్మానికి కట్టుబడి జరిగిందే. అయితే ద్వాపరయుగానికి వచ్చేసరికి పరిస్థితులలో పెనుమార్పులు వచ్చాయి. దాంతో శ్రీహరి ఆయా పరిస్థితులకు అనుగుణంగా జవాబు చెప్పవలసి వచ్చింది. లక్ష్యం లోకోత్తరమైనది కాబట్టి ఏ మార్గాన్ని అనుసరించినా, అందులో లక్ష్యసాధనే ప్రధాన ధ్యేయం. అంటే వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు అధర్మాన్ని అధర్మంతోనే జయించి, ధర్మాన్ని రక్షించడమే కృష్ణావతార ధ్యేయం. అందుకే కొన్ని సందర్భాలలో శ్రీకృష్ణుడు అవలంబించిన విధానాలు అధర్మంగా అగుపించవచ్చు. అయితే అవి యుగధర్మానుసారం జరిగినవే! పూర్ణ పురుషుడు... ఒక పురుషునిలో ఏమేమి లక్షణాలుంటే స్త్రీలందరికీ నచ్చుతాడో ఆయనకు బాగా తెలుసు. అందుకే తాను పరమాత్ముడయినప్పటికీ, ఒక సాధారణ బాలకునిలా ఎన్నోచిలిపి చేష్టలు చేశాడు. అమాయక బాలునిలా మన్ను తిన్నాడు. అదేమని అడిగిన అమ్మకు నోటిలో పదునాలుగు భువనభాండాలు చూపించాడు. అమ్మ ప్రేమపాశానికి లొంగిపోయి, గంధర్వులకి శాపవిముక్తి కావించాడు. మేనమామ కంసుడు పంపిన రాక్షసులను మర్ధించి, వారికి మోక్షం ప్రసాదించాడు. గోవులు కాచాడు. గోవర్థనగిరిని చిటికెన వేలిపై నిలిపి గోకులాన్ని రక్షించాడు. కాళియుడి పీచమణిచాడు. ఉట్టికొట్టాడు, వెన్న దొంగిలించాడు. గోపికల చీరలు ఎత్తుకెళ్లాడు. తోటిగోపాలకుల ఆనందం కోసం మురళి వాయించాడు. రాధను ప్రేమించాడు. తండ్రి బలవంతం మేరకు ఇష్టంలేని పెండ్లికి తలవంచిన రుక్మిణి కోసం యుద్ధం చేశాడు. ఇష్టసఖి సత్యభామ కోపంతో తన్నినా చిరునవ్వే సమాధానంగా చూపాడు. చివరకు ఆమెకోసం తులాభారం తూగాడు. ద్రౌపదికి మానసంరక్షణ చేశాడు. సుభద్రాతనయుడైన అభిమన్యుని ప్రేమను గెలిపించాడు. పాండవులకు అన్నింటా తానే అయి నిలిచాడు. వారికోసం దౌత్యం కూడా నడిపాడు. చివరికి అర్జునునికి రథసారథిగా మారాడు. ఆత్మస్థైర్యం కోల్పోయిన అర్జునుని కోసం గీతాచార్యునిగా మారి కొన్ని తరాల పాటు గ్రోలినా తరగనటువంటి వంటి గీతామృతాన్ని మానవాళికి ధారపోశాడు. గోపాలకృష్ణుడెలా అయ్యాడు? ‘గో’ అంటే ఆవు అని సామాన్యార్థం. గోపాలకుడు అంటే గోవులను కాసే వ్యక్తి. అయితే ‘గో’ అనే శబ్దానికి కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అన్నవి విశేషార్థాలు. కాబట్టి గోవులను పాలించేవాడు అంటే సంరక్షించేవాడు కాబట్టి ఆయన గోపాలకృష్ణుడయ్యాడు. కృష్ణుడు అంటే క్లేశాలను, కష్టాలను పోగొట్టేవాడని అర్థం. చూపరులను సమ్మోహనం చేసే చిరునవ్వు, అందరినీ ఆనంద పరవశులను చేసే మురళీగానం, మనోల్లాస కరమైన సంభాషణలతో అందరినీ అలరించాడు. పుట్టింది మొదలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, దేనికీ భయపడకుండా, ఎవరికీ లొంగకుండా పరిస్థితులను ఎదిరించి పోరాడాడు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయం సాధించాడు. నమ్మినవారికి అండగా నిలిచాడు. ఆ స్వామిని సేవించిన వారికి మాయ అంటదని శ్రీమద్భాగవతం చెబుతోంది. మోహన రూపం శ్రీకృష్ణునిది మేఖశ్యామల వర్ణం. అంటే చామన చాయ. నల్లని రంగు దేనికీ తక్కువ కాదని చాటటమే అందులోని అంతరార్థం. బంగారు పిందెల మొలతాడు, సరిమువ్వగజ్జెలు, శిఖలో పింఛం, పట్టు దట్టి, కస్తూరీ తిలకం, వక్షస్థలంలో కౌస్తుభమణి... ఇవన్నీ ఆయన విభవానికి చిహ్నాలు. నాయనమ్మ అలంకరించిన నెమలి పింఛాన్ని ఆమె ప్రీతికోసం ఎల్లప్పుడూ ధరించేవాడు. చేతిలోని మురళి గోవులను, గోపబాలకులను అలరించేందుకు ఉద్దేశించినదే. మానవునిగా జన్మించినందుకు యశోద వాత్సల్యాన్ని నిండుగా అనుభవించాడు. పసితనంలోని అమాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని మెండుగా గ్రోలాడు. బాల్యంలోని మాధుర్యాన్ని హాయిగా ఆస్వాదించాడు. లోకానికి కంటకంగా మారిన కంస, నరకాసురాది రక్కసులను సంహరించాడు. చివరకు తానే దూర్వాసుని శాపానికి కట్టుబడి సామాన్య మానవునిలా బోయవాని చేతిలో మరణించాడు. కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలి? కృష్టజన్మాష్టమీ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని పూజించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి.దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజిస్తే మంచిది. కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, వాటిని ప్రసాదంగా ఆరగించడం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా సకల పాపాలూ తొలగి, చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని భాగవతోక్తి. వెన్న ఎందుకు దొంగిలించాడు? వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. మృణ్మయ రూపమైన మనుష్యశరీరమే మృత్తికారూపమైన వెన్నకుండ. మన మనస్సే కుండలోని వెన్న. అజ్ఞానానికి సంకేతం నల్లని కుండ. వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు. -
టెక్ దిగ్గజాలకు పెరుగుతున్న బీపీ..!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి టెక్ దిగ్గజాలకు షాకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డేటా గోప్యతపై ఇటీవల వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో కొత్త నిబంధనలతో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టెక్ దిగ్గజాల నియంత్రణకోసం మాజీ జడ్జ్ బీఎన్ శ్రీకృష్ణ(77) కొత్త డేటాగోప్యతా చట్టాలను రూపొందించారు. సమాచార పరిరక్షణ కుద్దేశించిన నియయాలు, నిబంధనలను రూపొందించేందుకు నియమించిన కమిటీ త్వరలోనే తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇటీవల ఫేసబుక్‌లో లక్షల కొద్దీ యూజర్ల డేటా లీక్ అయిన నేపథ్యంలో ఆయన ప్రతిపాదనలకు ప్రాధాన్యత చేకూరనుంది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని 10మంది సభ్యులుగల ఈ కమిటీ ప్రైవసీ పరిరక్షణకు కొత్త నియమ నిబంధలను రూపొందించింది. వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగమేనా అనే అంశంపై విచారణ జరుపుతున్న 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ వివరాలను సమర్పించనుంది. శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా ప్రతిపాదనలు డేటా ఉల్లంఘనకు చెక్ పెట్టనున్నాయని భావిస్తున్నారు. ఈ నివేదికలో డేటా ఫెయిర్ యూజ్ తదితరాలను పరిశీలించినట్టు సమాచారం. వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు బదిలీ చేయగలవా,గోప్యతా సమాచారం పై సంస్థల జవాబుదారీతనం, డేటా ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన కళిన చర్యలు తదితర అంశాలను నిర్వచించింది. అలాగే ఈయూలోని జీపీడీఆర్ మాదిరిగా వినియోగదారులు తమ సొంత సమాచారాన్ని యాక్సెస్ చేయగలరో లేదో కూడా శ్రీకృష్ణ కమిటీ నిర్ధారిస్తుంది. మరోవైపు మానవుల్లో బీపీ, సుగర్లను నిరంతరం మానిటర్ చేసుకుంటూ నియంత్రణలో ఉంచుకున్నట్టే డేటాపై కూడా నియంత్ర ఉండాలని శ్రీకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలకు ఇక దడ మొదలైనట్టే! -
లోకాలకు భగవానుడైనా, తల్లికి కొడుకే!
పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది. శ్రీ కృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. యశోదను చూసి నందుడు కూడా ‘కన్నయ్య లేకుండా మేము బతకలేం’ అని కన్నీరు మున్నీరు కాసాగాడు. అలాగే శ్రీ కృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, ‘ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను‘ అని చెబుతూ విలపించసాగాడు. కంసుని చెర నుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి,‘మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం కాదు.’ బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుంటాం ఒక్కోసారి. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీ కృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి. -
అద్భుతాల ‘లేపాక్షి’
శిల్ప కళలకు కాణాచిగా మారిన జిల్లాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం లేపాక్షిలో అడుగడుగునా అద్భుతాలే కనిపిస్తుంటాయి. ఇందులో తైలవర్ణ చిత్రాలు ప్రముఖమైనవి. ఆలయంలోని నాట్య మంటపానికి తూర్పున పైకప్పులో ఒక రావి ఆకుపై చిన్నికృష్ణుడు పడుకున్నట్లున్న చిత్రపటం దేశవిదేశీ పర్యాకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో విశేషమేమంటే మనం ఎటు వైపు నుంచి చూసినా.. చిన్నికృష్ణుడు మనలే్న చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇంకా నాట్య మంటపంలో అంతరిక్ష స్తంభం, రంభ నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న శిల్పం, సంగీత కళాకారులు, పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి అలంకరణలు, విరుపణ్ణ అన్నదమ్ముల చిత్రాలు.. అబ్బుర పరుస్తుంటాయి. - లేపాక్షి (హిందూపురం) -
రాణించిన శ్రీకృష్ణ
యూనివర్సల్‌పై లక్కీ ఎలెవన్ గెలుపు సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో లక్కీ ఎలెవన్ 98 పరుగుల తేడాతో యూనివర్సల్ జట్టుపై గెలుపొందింది. లక్కీ ఆటగాళ్లు శ్రీకృష్ణ (90) బ్యాటింగ్‌లో, నాగశివ (4/25), విజయ్ (3/22) బౌలింగ్‌లో రాణించారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన లక్కీ జట్టు 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌటైంది. రాహుల్ 33 పరుగులు చేయగా, ప్రత్యర్థి బౌలర్లు కపిల్ 4, సోమ్‌నాథ్, యశ్వంత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూనివర్సల్ 149 పరుగులకే ఆలౌటైంది. ఈశ్వర్ 26, రాజ్ 20 పరుగులు చేశారు. నాగశివ 4, విజయ్ 3, రోహన్ 2 సమష్టిగా యూనివర్సల్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. -
మహాభారతంలో కృష్ణుడిగా యంగ్‌టైగర్
-
శ్రీకృష్ణాలంకారంలో ఊరేగిన నరసింహస్వామి
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారు ఉదయం శ్రీకృష్ణాలంకారం..రాత్రి హంసవాహన సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి,అమ్మవార్లను అర్చకులు పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపజేశారు. వివిధరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం మురళీ కృష్ణుడిగా అలంకారంలో, రాత్రి హంసవాహన సేవలలో అధిష్టింపజేసి ఆలయ తిరువీధులలో బాజాభజంత్రీలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగించారు. కొండపై ఉన్న సంగీతభవనంలో పలువురు కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణ అధికారి గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
ధర్మం, సత్యం శాశ్వతం
‘ధర్మం ఉన్నది. సత్యం ఉన్నది. అవి శాశ్వతాలు. అయితే, ఒక్కోకప్పుడు పాపం వల్ల ధర్మం కుంటుపడవచ్చు. అసత్యం చేత సత్యానికి చేటురావచ్చు. ఇట్లా పాపుల వల్ల, అసత్యవాదుల వల్ల ధర్మం, సత్యం మరుగునపడటం కొద్దిసేపే. అధర్మం, అసత్యాలది పైచేయి అయినప్పుడు, సమర్థులైన వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని రక్షించాలి. పాండవుల వనవాసం, అజ్ఞాతవాసం ముగిసింది. మాట ప్రకారం తమకు రావలసిన అర్ధరాజ్యం తమకు ఎలానూ వస్తుందనే ధైర్యంతో ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు. అది సంపాదించుకోవటానికిముందుగా తమకిష్టమైన కృష్ణుణ్ణి కౌరవుల వద్దకు రాయబారం పంపుతారు. ఆ పని నెరవేర్చటం కోసం కృష్ణుడు, ధృతరాష్ట్రుడు కొలువు తీరి ఉన్న సభకు వచ్చి, పాండవులు తనతో ఏమి చెప్పి పంపించారో, దాన్ని మంచి మాటల్తో చెబుతాడు. అలా చెబుతూ మధ్యలో అంటాడు. ‘ధర్మం ఉన్నది. సత్యం ఉన్నది. అవి శాశ్వతా లు. అయితే, ఒక్కొక్కప్పుడు పాపం వల్ల ధర్మం కుంటుపడవచ్చు. అసత్యం చేత సత్యానికి చేటురావచ్చు. ఇట్లా పాపుల వల్ల, అసత్యవాదుల వల్ల ధర్మం, సత్యం మరుగునపడటం కొద్దిసేపే. అధర్మం, అసత్యాలది పైచేయి అయినప్పుడు, సమర్థులైన వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని రక్షించాలి. సమర్థులైనవాళ్లు ఎవరైతే ఉన్నారో, వాళ్లు తమకేమీ పట్టనట్టు ఉంటే, ఆ కీడు వాళ్లకుగాని, ధర్మానికి, సత్యానికి ముప్పు వాటిల్లదు. అవి ఎప్పుడూ దృఢంగా నిలిచే ఉంటాయి. వాటిని ఎవ్వరూ కదల్చలేరు. ఎందుకంటే ఈ రెంటినీ రక్షిస్తూ భగవంతుడున్నాడు. ఎవరు అడ్డుపడినా, ఆ భగవంతుడే ధర్మాన్ని ఒడ్డుకు చేరుస్తాడు. సత్యానికి శుభం కలుగజేస్తాడు! అట్లా శ్రీకృష్ణుడు చెబుతుండగా, కౌరవ పెద్దలందరూ సభలో ఉన్నారు. ముఖ్యంగా భీష్ముడు, ద్రోణుడు వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని కాపాడటంలో సమర్థులు. ఆ కాపాడటమనే బాధ్యతను వాళ్లు తీసుకోవాలి. లేకపోయినట్లయితే, వాళ్లకు చేటు మూడుతుంది గాని, ధర్మానికి, సత్యానికి కాదు. ఇంతటి భావాన్ని ఇముడ్చుకున్న పద్యం, తిక్కన భారతం ఉద్యోగపర్వం మూడో ఆశ్వాసం లో ఉన్నది. ‘‘సారపు ధర్మమున్ విమల సత్యము...’’తో మొదలవుతుంది. ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం. ధర్మం, సత్యం గొప్పదనం గురించి భారతం లో చాలా చోట్ల వినవస్తుంది. ధర్మము, సత్యము అనే ఈ రెండే భారతమనే బండినడవటానికి రెం డుచక్రాలుగా ఉపయోగపడ్డాయని పెద్దలంటారు. - దీవి సుబ్బారావు -
హే... శ్రీకృష్ణ..!
-
శ్రీకృష్ణ కమిటీ సూచనలను పట్టించుకోని కాంగ్రెస్