మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ (పాత చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి టెక్ దిగ్గజాలకు షాకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డేటా గోప్యతపై ఇటీవల వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో కొత్త నిబంధనలతో గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టెక్ దిగ్గజాల నియంత్రణకోసం మాజీ జడ్జ్ బీఎన్ శ్రీకృష్ణ(77) కొత్త డేటాగోప్యతా చట్టాలను రూపొందించారు. సమాచార పరిరక్షణ కుద్దేశించిన నియయాలు, నిబంధనలను రూపొందించేందుకు నియమించిన కమిటీ త్వరలోనే తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇటీవల ఫేసబుక్‌లో లక్షల కొద్దీ యూజర్ల డేటా లీక్ అయిన నేపథ్యంలో ఆయన ప్రతిపాదనలకు ప్రాధాన‍్యత చేకూరనుంది.
జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని 10మంది సభ్యులుగల ఈ కమిటీ ప్రైవసీ పరిరక్షణకు కొత్త నియమ నిబంధలను రూపొందించింది. వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగమేనా అనే అంశంపై విచారణ జరుపుతున్న 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ వివరాలను సమర్పించనుంది. శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా ప్రతిపాదనలు డేటా ఉల్లంఘనకు చెక్ పెట్టనున్నాయని భావిస్తున్నారు. ఈ నివేదికలో డేటా ఫెయిర్ యూజ్ తదితరాలను పరిశీలించినట్టు సమాచారం. వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు బదిలీ చేయగలవా,గోప్యతా సమాచారం పై సంస్థల జవాబుదారీతనం, డేటా ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన కళిన చర్యలు తదితర అంశాలను నిర్వచించింది. అలాగే ఈయూలోని జీపీడీఆర్ మాదిరిగా వినియోగదారులు తమ సొంత సమాచారాన్ని యాక్సెస్ చేయగలరో లేదో కూడా శ్రీకృష్ణ కమిటీ నిర్ధారిస్తుంది. మరోవైపు మానవుల్లో బీపీ, సుగర్‌లను నిరంతరం మానిటర్ చేసుకుంటూ నియంత్రణలో ఉంచుకున్నట్టే డేటాపై కూడా నియంత్ర ఉండాలని శ్రీకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలకు ఇక దడ మొదలైనట్టే!
Comments
Please login to add a commentAdd a comment