Nervous
-
టెన్షన్‌గా ఉంది.. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినట్లుంది : ఆలియా భట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. గంగూభాయ్, ఆర్ఆర్ఆర్ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఆలియా చేసే తర్వాతి ప్రాజెక్ట్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఆలియా భట్ త్వరలోనే హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’అనే చిత్రం ద్వారా హాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆలియా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'హాలీవుడ్ మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు బయలుదేరాను. ఇండస్ట్రీలోకి మళ్లీ కొత్తగా ఎంట్రీ ఇచ్చినట్లుంది. నెర్వస్‌గా ఫీలవుతున్నా' అంటూ తనలోని టెన్షన్‌ని బయటపెట్టింది. ఇక ఆలియా పోస్ట్‌ని చూసిన నెటిజన్లు డోంట్ వర్రీ ఆలియా. ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
ఆమెకు ‘కొరియా’ వ్యాధి.. ప్రపంచం మొత్తంలో వెయ్యి మందికి మాత్రమే
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): ఆమె వయస్సు 32. కానీ చూడటానికి 50 ఏళ్లు పైబడిన మహిళగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడింది. కాళ్లు చేతులు తన ప్రమేయం లేకుండానే నిత్యం కదులుతూ ఉంటాయి. అన్నం తినేందుకు నోట్లో ముద్ద పెడితే.. తన ప్రమేయం లేకుండానే నాలుక ఆ ముద్దను బయటకు తోసేస్తుంది. ఇలాంటి వింతైన, అరుదైన పరిస్థితిని ఆస్పరికి చెందిన వీరేషమ్మ అనుభవిస్తోంది. వైద్యం చేయించాలని కుటుంబసభ్యులు కనిపించిన వైద్యులందరి వద్దకు తిరిగారు. మంత్రాలు చేయించారు.. తాయెత్తులు కట్టించారు.. దెయ్యం పట్టిందేమోనని భూతవైద్యులనూ ఆశ్రయించారు. ఇలా ఆ కుటుంబం దాదాపు మూడు లక్షల రూపాయలను ఖర్చు చేసింది. చివరకు కర్నూలుకు చెందిన న్యూరోఫిజీషియన్ డాక్టర్ హేమంత్‌కుమార్ ఆదోని క్యాంపునకు వెళ్లినప్పుడు కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన ఆమెకు గల పరిస్థితిని అర్థం చేసుకుని వైద్య పరీక్షల కోసం హోల్ ఎక్సీమ్ సీక్వెన్సింగ్ జెనటిక్ టెస్ట్‌ను అహ్మదాబాద్‌కు పంపించారు. నెలరోజుల స్టడీ అనంతరం వైద్యపరీక్షల నివేదిక రెండురోజుల క్రితం డాక్టర్‌కు అందింది. ఆమెకు కొరియా అకాంటో సైటోసిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. యూపీఎస్ 13ఎ అనే జీన్ మ్యూటేషన్ చెందడంతో ఈ వ్యాధి వస్తుందని డాక్టర్ చెప్పారు. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) నరాలపై ప్రభావం చూపడం వల్ల రోగికి తెలియకుండానే కాళ్లూ, చేతులు కదులుతూ ఉంటాయని తెలిపారు. ఆహారాన్ని నాలుక తోసేయడం వల్ల సరిగ్గా ఆహారం అందక పోషకాహార లోపం ఏర్పడిందన్నారు. వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాత లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స ఇవ్వడం వల్ల సాధారణ స్థితికి వచ్చిందన్నారు. ప్రపంచం మొత్తంగా ఇప్పటి వరకు ఇలాంటి సమస్యతో కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
టెక్ దిగ్గజాలకు పెరుగుతున్న బీపీ..!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి టెక్ దిగ్గజాలకు షాకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డేటా గోప్యతపై ఇటీవల వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో కొత్త నిబంధనలతో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టెక్ దిగ్గజాల నియంత్రణకోసం మాజీ జడ్జ్ బీఎన్ శ్రీకృష్ణ(77) కొత్త డేటాగోప్యతా చట్టాలను రూపొందించారు. సమాచార పరిరక్షణ కుద్దేశించిన నియయాలు, నిబంధనలను రూపొందించేందుకు నియమించిన కమిటీ త్వరలోనే తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇటీవల ఫేసబుక్‌లో లక్షల కొద్దీ యూజర్ల డేటా లీక్ అయిన నేపథ్యంలో ఆయన ప్రతిపాదనలకు ప్రాధాన్యత చేకూరనుంది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని 10మంది సభ్యులుగల ఈ కమిటీ ప్రైవసీ పరిరక్షణకు కొత్త నియమ నిబంధలను రూపొందించింది. వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగమేనా అనే అంశంపై విచారణ జరుపుతున్న 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ వివరాలను సమర్పించనుంది. శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా ప్రతిపాదనలు డేటా ఉల్లంఘనకు చెక్ పెట్టనున్నాయని భావిస్తున్నారు. ఈ నివేదికలో డేటా ఫెయిర్ యూజ్ తదితరాలను పరిశీలించినట్టు సమాచారం. వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు బదిలీ చేయగలవా,గోప్యతా సమాచారం పై సంస్థల జవాబుదారీతనం, డేటా ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన కళిన చర్యలు తదితర అంశాలను నిర్వచించింది. అలాగే ఈయూలోని జీపీడీఆర్ మాదిరిగా వినియోగదారులు తమ సొంత సమాచారాన్ని యాక్సెస్ చేయగలరో లేదో కూడా శ్రీకృష్ణ కమిటీ నిర్ధారిస్తుంది. మరోవైపు మానవుల్లో బీపీ, సుగర్లను నిరంతరం మానిటర్ చేసుకుంటూ నియంత్రణలో ఉంచుకున్నట్టే డేటాపై కూడా నియంత్ర ఉండాలని శ్రీకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలకు ఇక దడ మొదలైనట్టే! -
పల్స్ చూసుకోండి... పక్షవాతం నుంచి రక్షణ పొందండి...
క్రమం తప్పకుండా నాడీ స్పందించే తీరును పరీక్షించుకుంటూ ఉంటే అది పక్షవాతం ప్రమాదాన్ని గణనీయంగా నివారిస్తుందంటున్నారు జర్మనీకి చెందిన న్యూరాలజిస్టులు. వాళ్లే కాదు... అమెరికాకు చెందిన యూఎస్ నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కూడా అదే మాట చెబుతున్నారు. పైగా వారు నిర్వహించిన ఒక అధ్యయనంలోనూ ఇదే తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కనుగొన్న విషయాల ప్రకారం... మొదటిసారి పక్షవాతం (స్ట్రోక్)కు గురై కోలుకున్నవారిలో 24 శాతం మంది మహిళల్లో, 42 శాతం మంది పురుషుల్లో ఐదేళ్లలోపు మరోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. ఎడమచేతి మణికట్టు వద్ద ఉండే రేడియల్ ఆర్టరీ అనే రక్తనాళాన్ని పట్టుకుని పల్స్‌ను పరీక్షిస్తున్నప్పుడు అందులో ఏవైనా తేడాలు ఉంటే గుండె కొట్టుకోవడంలో తేడా ఉందని అర్థం. గుండె స్పందనల లయ సరిగ్గా లేని ఈ కండిషన్‌ను ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇది ఒక్కోసారి మరణానికి దారితీయవచ్చు. మొదటిసారి స్ట్రోక్ వచ్చిన 256 మందిపై నిర్వహించిన పల్స్ రీడింగ్ ద్వారా వాళ్లలో ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్‌ను గుర్తించి, ప్రమాదాలను నివారించడం సాధ్యమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ అనే జర్నల్‌లోనూ పొందుపరిచారు.