
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. గంగూభాయ్, ఆర్‌ఆర్‌ఆర్ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఆలియా చేసే తర్వాతి ప్రాజెక్ట్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఆలియా భట్ త్వరలోనే హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’అనే చిత్రం ద్వారా హాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది.
ఈ విషయాన్ని స్వయంగా ఆలియా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'హాలీవుడ్ మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు బయలుదేరాను. ఇండస్ట్రీలోకి మళ్లీ కొత్తగా ఎంట్రీ ఇచ్చినట్లుంది. నెర్వస్‌గా ఫీలవుతున్నా' అంటూ తనలోని టెన్షన్‌ని బయటపెట్టింది. ఇక ఆలియా పోస్ట్‌ని చూసిన నెటిజన్లు డోంట్ వర్రీ ఆలియా. ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment