Former judge of the Supreme
-
టెక్ దిగ్గజాలకు పెరుగుతున్న బీపీ..!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి టెక్ దిగ్గజాలకు షాకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డేటా గోప్యతపై ఇటీవల వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో కొత్త నిబంధనలతో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టెక్ దిగ్గజాల నియంత్రణకోసం మాజీ జడ్జ్ బీఎన్ శ్రీకృష్ణ(77) కొత్త డేటాగోప్యతా చట్టాలను రూపొందించారు. సమాచార పరిరక్షణ కుద్దేశించిన నియయాలు, నిబంధనలను రూపొందించేందుకు నియమించిన కమిటీ త్వరలోనే తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇటీవల ఫేసబుక్‌లో లక్షల కొద్దీ యూజర్ల డేటా లీక్ అయిన నేపథ్యంలో ఆయన ప్రతిపాదనలకు ప్రాధాన్యత చేకూరనుంది. జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని 10మంది సభ్యులుగల ఈ కమిటీ ప్రైవసీ పరిరక్షణకు కొత్త నియమ నిబంధలను రూపొందించింది. వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగమేనా అనే అంశంపై విచారణ జరుపుతున్న 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి ఈ వివరాలను సమర్పించనుంది. శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా ప్రతిపాదనలు డేటా ఉల్లంఘనకు చెక్ పెట్టనున్నాయని భావిస్తున్నారు. ఈ నివేదికలో డేటా ఫెయిర్ యూజ్ తదితరాలను పరిశీలించినట్టు సమాచారం. వినియోగదారుల డేటాను ఆయా సంస్థలు బదిలీ చేయగలవా,గోప్యతా సమాచారం పై సంస్థల జవాబుదారీతనం, డేటా ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన కళిన చర్యలు తదితర అంశాలను నిర్వచించింది. అలాగే ఈయూలోని జీపీడీఆర్ మాదిరిగా వినియోగదారులు తమ సొంత సమాచారాన్ని యాక్సెస్ చేయగలరో లేదో కూడా శ్రీకృష్ణ కమిటీ నిర్ధారిస్తుంది. మరోవైపు మానవుల్లో బీపీ, సుగర్లను నిరంతరం మానిటర్ చేసుకుంటూ నియంత్రణలో ఉంచుకున్నట్టే డేటాపై కూడా నియంత్ర ఉండాలని శ్రీకృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర కంపెనీలకు ఇక దడ మొదలైనట్టే! -
లహోతీజీ.. వీటికి జవాబివ్వండి: కట్జూ
ఓ అవినీతి జడ్జి పదవీకాలం కొనసాగించే విషయంలో ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు(సీజేఐలు) అసమంజసంగా రాజీపడ్డారని వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ.. మంగళవారం కూడా తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఈ ఆరోపణల గురించి తాను నిర్దిష్టంగా వేస్తున్న 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ముగ్గురు సీజీఐలలో ఒకరైన జస్టిస్ ఆర్.సి.లహోతీకి కట్జూ తన బ్లాగులో ప్రశ్నించారు. ఆ ప్రశ్నలివీ.. మద్రాస్ హైకోర్టుకు చెందిన ఓ అదనపు జడ్జిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయని, దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)తోరహస్య దర్యాప్తు చేయించాలని నేను చెన్నై నుంచి ఆయనకు(లహోతీకి) లేఖ రాసిన మాట వాస్తవమా కాదా? తర్వాత ఇదే అంశంపై నేను ఆయన్ను ఢిల్లీలో కలిసింది నిజమా కాదా?నా అభ్యర్థన మేరకు జస్టిస్ లహోతీ ఆ అదనపు జడ్జిపై ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు చేయించింది నిజమా కాదా? నేను జస్టిస్ లహోతీని ఢిల్లీలో కలిసి చెన్నై వచ్చిన తర్వాత.. ఆయన నాకు ఫోన్ చేసి.. అదనపు జడ్జిపై దర్యాప్తు చేయించానని, అవినీతి ఆరోపణలు నిజమేనని తేలిందని చెప్పిన మాట వాస్తవమా కాదా?ఐబీ నివేదిక వచ్చాక సమావేశమైన త్రిసభ్య కొలీజియం.. ఆ అదనపు జడ్జి పదవీకాలాన్ని పొడిగించవద్దని ప్రభుత్వానికి సిఫార్సు చేయడం నిజమా కాదా?కొలీజియం సిఫార్సులను ప్రభుత్వానికి పంపిన తర్వాత.. ఆయన కొలీజియంలోని మిగతా ఇద్దరు సభ్యులనూ సంప్రదించకుండా తనంతట తానుగా ప్రభుత్వానికి లేఖ రాసి.. ఆ అదనపు జడ్జి పదవీకాలాన్ని పొడిగించాలని కోరడం నిజమా కాదా?ఐబీ దర్యాప్తులో అవినీతి ఆరోపణలు నిజమేనని తేలిన తర్వాత కూడా ఆయన ఆ అదనపు జడ్జి పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాశారు?