శ్రీకృష్ణాలంకారంలో ఊరేగిన నరసింహస్వామి | yadagirigutta narasimha swamy as srikrishna | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణాలంకారంలో ఊరేగిన నరసింహస్వామి

Published Mon, Feb 23 2015 7:28 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

శ్రీకృష్ణాలంకారంలో ఊరేగిన నరసింహస్వామి

శ్రీకృష్ణాలంకారంలో ఊరేగిన నరసింహస్వామి

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారు ఉదయం శ్రీకృష్ణాలంకారం..రాత్రి హంసవాహన సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి,అమ్మవార్లను అర్చకులు పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపజేశారు. వివిధరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం మురళీ కృష్ణుడిగా అలంకారంలో, రాత్రి హంసవాహన సేవలలో అధిష్టింపజేసి ఆలయ తిరువీధులలో బాజాభజంత్రీలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగించారు. కొండపై ఉన్న సంగీతభవనంలో పలువురు కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణ అధికారి గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement