డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం ఈక్వల్, అలాగే ఆ సంస్థ పెట్టుబడులున్న అకౌంట్ అగ్రిగేటర్ వన్‌మనీ ఏర్పాటు చేసిన అడ్వైజరీ బోర్డు ఛైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ(Justice B.N. Srikrishna) నియమితులయ్యారు. న్యాయశాస్త్ర, ఆర్థిక(Finance), టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు జగదీష్ కపూర్, రాకేష్ మోహన్ .. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జె సత్యనారాయణ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.
డేటా షేరింగ్‌కి సంబంధించి భద్రత, నైతికతకు ప్రాధాన్యమిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంలో ఇరు కంపెనీలకు ఈ బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. వ్యక్తుల హక్కులు, ఆకాంక్షలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాల్లో సమతౌల్యత పాటించేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ తెలిపారు. రుణాలు, ఉద్యోగాలు(Jobs), ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మందికి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నామని ఈక్వల్ వ్యవస్థాపకుడు కేశవ్ రెడ్డి తెలిపారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధన దిశగా కృషి చేస్తున్నట్లు వన్‌మనీ వ్యవస్థాపకుడు కృష్ణ ప్రసాద్ చెప్పారు.
ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేత
బ్రిగేడ్ గ్రూప్ కొత్త ప్రాజెక్ట్
రియల్టీ సంస్థ బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కోకాపేటలో బ్రిగేడ్ గేట్‌వే పేరుతో 10 ఎకరాల విస్తీర్ణంలో హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకు రూ.4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ ప్రాజెక్టులో లగ్జరీ గృహాలను 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, మైసూరు, చెన్నై, కొచ్చిలో కంపెనీ పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment