![TV Today Network announced the closure of its FM radio business Ishq 104.8 FM due to significant financial losses](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/10/radio01.jpg.webp?itok=rSqTuC4x)
ఇష్క్ 104.8 ఎఫ్‌ఎం(Ishq FM) బ్రాండ్ పేరుతో నిర్వహిస్తున్న రేడియో(Radio) వ్యాపారాన్ని వచ్చే ఆరు నెలల్లో మూసివేయనున్నట్లు టీవీ టుడే నెట్‌వర్క్(TV Today) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే మూసివేత నిర్ణయానికి కారణమని పేర్కొంది. టీవీ టుడే నెట్‌వర్క్ ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో మూడు ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను నిర్వహిస్తోంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రేడియో వ్యాపారం టర్నోవరు రూ.16.18 కోట్లుగాను, నష్టం రూ.19.53 కోట్లుగాను నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయంలో రేడియో విభాగం వాటా 1.7 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరు
విస్తరణ బాటలో కామధేను
బ్రాండెడ్ టీఎంటీ కడ్డీల తయారీ సంస్థ కామధేను లిమిటెడ్ తమ కార్యకలాపాలను మరింత విస్తరించడంపై దృష్టి పెడుతోంది. తమ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో వచ్చే ఏడాది వ్యవధిలో ప్రీమియం బ్రాండ్ ‘కామధేను నెక్ట్స్’ తయారీ సామర్థ్యాన్ని 20 శాతం మేర పెంచుకోనున్నట్లు సంస్థ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ తెలిపారు. అలాగే చానల్ పార్ట్‌నర్ల నెట్‌వర్క్‌ను కూడా పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment