FM channel
-
రేడియో వ్యాపారం మూసివేత
ఇష్క్ 104.8 ఎఫ్ఎం(Ishq FM) బ్రాండ్ పేరుతో నిర్వహిస్తున్న రేడియో(Radio) వ్యాపారాన్ని వచ్చే ఆరు నెలల్లో మూసివేయనున్నట్లు టీవీ టుడే నెట్వర్క్(TV Today) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే మూసివేత నిర్ణయానికి కారణమని పేర్కొంది. టీవీ టుడే నెట్వర్క్ ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో మూడు ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్వహిస్తోంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రేడియో వ్యాపారం టర్నోవరు రూ.16.18 కోట్లుగాను, నష్టం రూ.19.53 కోట్లుగాను నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ఆదాయంలో రేడియో విభాగం వాటా 1.7 శాతంగా ఉంది. ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరువిస్తరణ బాటలో కామధేనుబ్రాండెడ్ టీఎంటీ కడ్డీల తయారీ సంస్థ కామధేను లిమిటెడ్ తమ కార్యకలాపాలను మరింత విస్తరించడంపై దృష్టి పెడుతోంది. తమ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో వచ్చే ఏడాది వ్యవధిలో ప్రీమియం బ్రాండ్ ‘కామధేను నెక్ట్స్’ తయారీ సామర్థ్యాన్ని 20 శాతం మేర పెంచుకోనున్నట్లు సంస్థ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ తెలిపారు. అలాగే చానల్ పార్ట్నర్ల నెట్‌వర్క్‌ను కూడా పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
వచ్చే నెల 6 నుంచి రేడియో సిటీ ఎంబీఎల్ ఐపీఓ
⇒ కనీస రూ.400 కోట్ల సమీకరణ ⇒ ఇష్యూ ధర రూ.324–333 ! న్యూఢిల్లీ: మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే నెల 6న ప్రారంభం కానున్నది. జాగ్రణ్ ప్రకాశన్ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ రేడియో సిటీ ఎఫ్ఎం చానల్‌ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 37 నగరాల్లో రేడియో సిటీ బ్రాండ్ కింద ఎఫ్ఎం ప్రసారాలను ప్రసారం చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్లకు మించి నిధులను సమీకరించనున్నది. ఈ నెల 8న ముగిసే ఈ ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో 26.59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని మ్యూజిక్ బ్రాడ్కాస్ట్(ఎంబీఎల్) తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డెబెంచర్ల ఉపసంహరణకు వినియోగిస్తామని వివరించింది. ఎంబీఎల్ షేర్లు మార్చి 17న లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.324–333 రేంజ్లో, మార్కెట్ లాట్ 45 షేర్లుగా ఉండొచ్చని సమాచారం. కాగా గత ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన కాలానికి ఎంబీఎల్ రూ.138 కోట్ల ఆదాయాన్ని, రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.