Radio broadcasts
-
సిటీ కాప్స్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్!
సాక్షి, సిటీబ్యూరో: ‘గుడ్ మారి్నంగ్ హైదరాబాద్...’ త్వరలో నగర పోలీసుల నోటి వెంట ఇలాంటి మాట వినిపించనుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్సీఎస్సీ) కలిసి సిటీ పోలీసు విభాగం ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేయనుండటమే దానికి కారణం. ఇతర ఎఫ్ఎం రేడియోలకు దీటుగా, అన్ని హంగులతో త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రకటించారు.నగర పోలీసు విభాగానికి ఇప్పటి వరకూ సొంతంగా ఎలాంటి రేడియో లేదు. అయితే కొన్నేళ్లుగా వివిధ ఎఫ్ఎం రేడియోలతో పాటు ఇతర మీడియా సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. బోనాలు, గణేష్ ఉత్సవాలు వంటి కీలక ఘట్టాలతో పాటు సున్నితాంశాల పైనా ప్రజల్లో అవగాహన కలి్పంచడానికి ఈ వేదికల్ని వాడుకుంటున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్స్, రద్దీ రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలకు అందిస్తున్న ట్రాఫిక్ విభాగం అధికారులు ఆ వివరాలను వారి ద్వారా శ్రోతలకు చేరుస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం వారికే..కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు 2019 అక్టోబర్‌లో ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేశారు. అందులో వినోద భరిత కార్యక్రమాలతో పాటు ఖైదీలకు ఉన్న హక్కులు, పెరోల్ నిబంధనలు తదితరాలను ప్రచారం చేస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ సెంట్రల్ జైలు అధికారులు సైతం 2021 డిసెంబర్లో ఓ రేడియోను ప్రారంభించారు. ఈ రెండూ ఖైదీల ఆధ్వర్యంలో నడిచేవే కావడం గమనార్హం. ఇండియన్ ఆర్మీ సైతం ఉత్తర కాశ్మీర్లో తొలి రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బారాముల్లా, ఉరి సెక్టార్లలో రెండింటికి విస్తరించింది.వినోదంతో పాటు అవగాహన..నగర పోలీసు విభాగం ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ రేడియో అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హెచ్సీఎస్సీతో కలిసి రూపుదిద్దుతున్నారు. ఈ రేడియోలు పాటలు వంటి వినోదభరిత కార్యక్రమాలకు సమప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు నగరవాసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు, స్థితిగతులు, రోడ్డు భద్రత అంశాలకు పెద్దపీట వేసేలా తమ కమ్యూనిటీ రేడియో ఉండనుందని కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రేడియో నిర్వహణ బాధ్యతల్ని హెచ్సీఎస్సీ చేపట్టనుంది. -
టీవీ, రేడియోల్లోనూ వాతావరణ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తీవ్ర వాతావరణ హెచ్చరికలను ఇకపై టీవీలు, రేడియోల్లోనూ ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వర్షాలు, తుపాన్లు, వడగాలుల గురించి మొబైల్ ఫోన్లకు మెసేజీలు పంపే ప్రక్రియను ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రారంభించింది. రెండో దశలో టీవీ, రేడియో తదితర మాధ్యమాల ద్వారా కూడా హెచ్చరికల మెసేజీలను పంపే ప్రక్రియ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఎన్డీఎంఏ అధికారి ఒకరు చెప్పారు. -
ఏడైతే దడ! నిజాంకు వ్యతిరేకంగా మూడు భాషల్లో వార్తలు
స్వాతంత్య్ర సమరం గురించి గానీ, ప్రజల ఇక్కట్ల గురించి గానీ బ్రిటీషు ప్రభుత్వం నిర్వహించే రేడియో కేంద్రాలలో ప్రసారాలు ఉండేవి కావు. కనుకనే ఆజాద్ హింద్ రేడియో, ఆజాద్ రేడియో వంటివి అవసరమయ్యాయి. ఇలా చరిత్రలో తళుక్కుమన్న ప్రజా రేడియో కేంద్రాలు.. భాగ్యనగర్ రేడియో, ది వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ రేడియో ప్రసార పటిమ గురించి నిన్నటి సంచికలో తెలుసుకున్నాం. ఇక భాగ్యనగర్ రేడియో! నైజాం పాలనకు వ్యతిరేకంగా, హైదరాబాద్ సంస్థానం సరిహద్దులో ఉండే కర్నూలు నుంచి నడిచింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రసారాలు చేసిన ఘన చరిత్ర ‘భాగ్యనగర్ రేడియో’ కు దక్కుతుంది. ‘భాగ్యనగర్’ కీర్తి బావుటా వెల్దుర్తి మాణిక్యరావు తన పుస్తకం ‘హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం’లో ఇలా పేర్కొన్నారు : ‘‘భాగ్యనగర్ రేడియో ప్రసారాల వల్ల హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్య్ర సమరానికి అనేక ప్రయోజనాలు కలిగాయి. మొదటి స్టేట్ కాంగ్రెస్ నాయకత్వాన జరుగుతున్న విముక్తి ఉద్యమం గురించి ప్రజల్లో విరివిగా ప్రచారం చేయగలిగారు. రజాకార్లు, మజ్లీసువారు, ముస్లిం కాందిశీకులు, మతోన్మాదులైన నిజాం పోలీసులు, సైనికులు సంస్థానంలో ప్రజల పై జరిపే అత్యాచారాలను, దుండగాలను, దోపిడీలను, దురంతాలను బట్టబయలు చేసి వారి నిజస్వరూపాల్ని బహిర్గతం చేసే వీలు కలిగింది. సంస్థానంలో ఎటువంటి రాక్షసత్వం స్వైరవిహారం చేస్తూ ఉన్నదో అందరూ తెలుసుకోగలిగారు. స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలు నిజాం దుష్టశక్తులను ఎలా ఎదుర్కొంటున్నారో ప్రజలు తెలుసుకోవడానికీ, వారికి ధైర్యం, మనో నిబ్బరం కలిగించడానికి ఈ రేడియో కేంద్రం ఎంతగానో ఉపకరించింది.’’ అదీ భాగ్యనగర్ రేడియో కీర్తి బావుటా! ఈ రేడియో వెనుక భాసించే సాహసి పాగా పుల్లారెడ్డి (1919 మే 10– 2010 అక్టోబర్ 20). గద్వాల ప్రాంతం మనోపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో జన్మించిన పుల్లారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ సహాయంతో చదువుకున్నారు. 1947–48 కాలంలో హైదరాబాదు సంస్థానం విముక్తం కావడానికి చేపట్టిన ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. రెడ్డిగారు – రేడియో గద్వాల పురపాలక సంఘం ఛైర్మన్ (1968)గా, గద్వాల శాసన సభ్యులు (1972)గా సేవలందించిన పుల్లారెడ్డి తొలుత 1952లో గద్వాల – అలంపూర్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. హైదరాబాదు, ఆంధ్రరాష్ట్రాల విలీనం సమయంలో కొత్త రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరును పాగా పుల్లారెడ్డి సూచించగా బూర్గుల రామకృష్ణారావు బలపర్చారు. మరి భాగ్యనగర్ రేడియోకు, పాగా పుల్లారెడ్డికి అనుబంధం ఏమిటి? దీనికి సంబంధించిన కొంత సమాచారం.. గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ ‘శతపత్రము’లో ‘స్టేట్ కాంగ్రెస్ పునరుద్ధరణ – నిజాం విముక్తి పోరాటం’ అనే అధ్యాయంలో కనబడుతుంది. అన్ని సంస్థానాలు భారత దేశంలో చేరిపోగా ఒక నిజాం నవాబు మాత్రం తాను స్వతంత్రంగా ఉంటానని 1947 జూన్ నెలలో ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే స్టేట్ కాంగ్రెస్ ప్రథమ మహాసభ హైదరాబాదులో జరిగింది. దీని తర్వాత జూన్ నెల చివరలో షోలాపూరులో జరిగిన కార్యవర్గ సమావేశంలో.. హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో జరపాలని నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటక, మరాట్వాడా ప్రాంతీయ సమితులు సంస్థానం బయట సరిహద్దులలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. పాగా పుల్లారెడ్డిని కర్నూలుకు, టి. హయగ్రీవాచారిని బెజవాడకు సర్వాధికారులుగా నియమించి సర్దార్ జమలాపురం కేశవరావు జైలుకు పోయారు. ఆగస్టు 15న చెన్నిపాడు, మానవపాడు, ఇటికలపాడు, ఉండవెల్లి గ్రామాలలో ఎవరెవరు సత్యాగ్రహం చేస్తారో వివరాలను గడియారం రామకృష్ణ శర్మ ముందుగానే అలంపూరు పోలీసు స్టేషన్‌కు అందించారు. పాగా పుల్లారెడ్డి నేతృత్వంలో ఉద్యమ కార్యక్రమాలు పెద్ద స్థాయిలో కర్నూలులో విజయవంతంగా జరిగాయి. ఆ సమయంలోనే బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిన రేడియో ట్రాన్స్‌మీటర్ ను ‘లోకనాయక్’ జయప్రకాష్ నారాయణ్ ద్వారా వనపర్తి రాజారామేశ్వరరావు బొంబాయి నుంచి తెప్పించి పాగా పుల్లారెడ్డి కార్యాలయానికి ఇచ్చారు. రోజూ సాయంత్రం 7 గంటలకు ఈ ట్రాన్స్‌మీటర్ దక్కన్ రేడియో కంటే శక్తివంతమైనది. ఫలితంగా ‘భాగ్యనగర్ రేడియో’ ప్రసారాలు విజయవాడ, మద్రాసుకు కూడా వినబడేవి. కర్నూలులో స్టేట్ కాంగ్రెస్ కార్యాలయం పక్కన ఉండే పల్లెపాడు జాగీర్దారు చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ట్రాన్స్‌మీటర్ ను రహస్యంగా ఉంచారు. చంద్రశేఖర్ రెడ్డి కుమారులు జనార్దన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ట్రాన్స్‌మీటర్ ను ఇంట్లో ఉంచుకోవడమే కాక, దాన్ని చక్కగా నడిపించేవారు. ఈ రేడియో ప్రసారాలు ఏరోజు మొదలు అయ్యాయో సమాచారం ప్రస్తుతం లభ్యం లేదు గానీ ప్రసారాలు ప్రతిరోజూ సా. 7 గంటల నుంచి 8 గం. దాకా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో నడిచేవి. మొదట అరగంటలో మూడు భాషల్లో వార్తలు, తర్వాత మూడు భాషలలో ప్రసంగా లుండేవి. వార్తా బులెటిన్ల ప్రచురణ, రేడియో ప్రసార బాధ్యతలు గడియారం రామకృష్ణ శర్మకు అప్పగించారు. గొట్టుముక్కల కృష్ణమూర్తి సహాయకులు. ఉర్దూ ప్రసారాల బాధ్యతను వకీలు నాగప్ప చూసేవారు. దక్కన్ రేడియోలో కురుగంటి సీతారామయ్య కాంగ్రెస్‌నూ, స్వాతంత్య్రోద్యమాన్ని అవహేళన చేస్తూ ప్రసంగాలు చేస్తుండేవారు. వీటిని ఖండిస్తూ, నిజాం ప్రభుత్వ దురాగతాలను హాస్యధోరణిలో విమర్శిస్తూ ప్రసంగాలు, వార్తలు రూపొందించేవారని గడియారం రామకృష్ణ శర్మ ‘శతపత్రము’లో వివరించారు. వనపర్తి రాజా, పాగా పుల్లారెడ్డి మధ్య అభిప్రాయ విభేదాలు రావడంతో రేడియో ట్రాన్స్ మీటర్ తిరిగి ఇచ్చేయమని రాజారామేశ్వరరావు నిర్బంధం చేయడంతో వెనక్కి ఇచ్చేశారు. 1948 జనవరి 30 న గాంధీజీ కన్నుమూశారనే పెనువిషాద వార్తను చివరిసారిగా ప్రసారం చేసి భాగ్యనగర్ రేడియో చరిత్ర పుటల్లో కలిసిపోయింది! – డా. నాగసూరి వేణుగోపాల్ (చదవండి: అడవి నుంచి రేడియో బాణాలు) -
సంస్థానాల రేడియో... బ్రిటిష్ కనుసన్నల్లోనే!
తొలుత బ్రిటిష్ ప్రభుత్వం రేడియో ప్రసారాల పట్ల ఆసక్తి చూప లేదు. కానీ 1927 నుంచీ తన ధోరణిని మార్చు కున్నది. ఒకవైపు పరికరాల దిగుమతి, మరోవైపు రేడియో లైసెన్సుల జారీ తమ అధీనంలోనే పెట్టు కుని... ప్రసారాల నియంత్రణ, సెన్సార్షిప్, ప్రభుత్వ వ్యతిరేకులు రేడియో వినియోగించక పోవడం వంటి అంశాల పట్ల దృష్టి ఎక్కువగానే పెట్టింది. అదే సమయంలో వివిధ సంస్థానాలలో రేడియోపట్ల ఆసక్తి చూపినవారికి అడ్డు చెప్పలేదు. కేవలం హైదరాబాద్, మైసూరు, బరోడా, తిరువాన్కూరు సంస్థానాలలో మాత్రమే రేడియో ప్రసారాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థా నాల రేడియో ప్రసారాలకు సంబంధించి హైదరా బాద్ కొంచెం విభిన్నంగా కనబడుతోంది. నిజాం స్వాధీనం చేసుకున్న, ‘నిజాం రేడియో’ లేదా ‘దక్కన్ రేడియో’గా పేరుగాంచిన కేంద్రం 1935 ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 411 మీటర్లపై పని చేయడం మొదలు పెట్టింది. మరే సంస్థానానికీ లేని రీతిన నిజాం రేడియోకు రెండవ ట్రాన్స్ మీటరు ఔరంగాబాద్ నుంచి పనిచెయ్యడం అదే సంవత్సరంలో కొంతకాలం తర్వాత మొదలైంది. హైదరాబాద్ తర్వాత మొదలైంది మైసూరులో సైకాలజీ ప్రొఫెసర్ డా. ఎమ్వీ గోపాల స్వామి ప్రారంభించిన 30 వాట్ల రేడియో ట్రాన్స్ మీటర్. వీరి నిర్వహణలోనే అది 1935 సెప్టెంబర్ 10 నుంచీ 1942 దాకా నడిచి, పిమ్మట మైసూరు సంస్థానం చెప్పుచేతల్లోకి వచ్చింది. మైసూరు సంస్థానం రేడియోకు సంబంధించి ఒక ప్రత్యేకత వుంది. ఆ రేడియో కేంద్రాన్ని వారు ‘ఆకాశవాణి’ అని వ్యవహరించేవారు. బ్రిటిష్‌వాళ్ల నిర్వహణలో సాగే రేడియోకు ‘ఆలిండియా రేడియో’ అని 1936 జూన్ 8న నామ కరణం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958లో ఆలిండియా రేడియోకు ‘ఆకాశవాణి’ అనే పేరును కూడా స్వీకరించారు. హైదరాబాద్, ఔరం గాబాద్, మైసూరులలో రేడియో ప్రసారాలు ప్రారంభమైన పిదప 1943 మార్చి 12న తిరువా న్కూరు సంస్థానం (తిరువనంతపురం)లో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. బరోడా బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్ పేరున రేడియో కేంద్రానికి 1939 మే 1వ తేదీన బరోడా సంస్థా నంలో పునాదిరాయి వేసినట్టు తెలుస్తోంది. ప్రసా రాలు ఎప్పుడు మొదలయ్యాయో సమాచారం పూర్తిగా అందుబాటులో లేదు గానీ, బీబీసీలో పని చేసిన నారాయణ మీనన్ 1947లో ఈ రేడియో స్టేషన్లో పనిచేశారు. వీరే తరువాతి కాలంలో ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గా 1965–68 మధ్య కాలంలో పనిచేశారు. హైదరాబాద్, ఔరం గాబాద్, మైసూరు, తిరువాన్కూరు, బరోడా రేడియో కేంద్రాల ప్రసారాలు బ్రిటిష్ పాలకులకు అనువుగానే సాగాయి. ఇంతవరకూ చర్చించిన రేడియో ప్రసారాలు స్వాతంత్య్రోద్యమానికిగానీ, ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు గానీ తోడ్పడిన సందర్భాలు దాదాపు లేవు. 1932లో బొంబాయి స్టేషన్ డైరెక్టర్ ప్రకారం... ఏదో ఒక రేడియో కేంద్రం స్వాతంత్య్రో ద్యమానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు... విన బడిన ప్రసారాల వల్ల తెలుస్తోందని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారని పార్థసారథి గుప్తా... ‘రేడియో అండ్ ది రాజ్ 1921–47’(1995) పుస్తకంలో పేర్కొన్నారు. నాలుగు సంస్థానాలలో బరోడా రేడియో కేంద్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం 1948 డిసెంబరు 16న తన అజమా యిషీలోకి తీసుకున్నది. హైదరాబాద్, ఔరంగా బాద్, మైసూరు, తిరువాన్కూరు కేంద్రాలన్నీ 1950 ఏప్రిల్ 1వ తేదీన భారతదేశ ప్రభుత్వం అధీనంలోకి వచ్చి ఆలిండియా రేడియోగా కొనసా గాయి. ఔరంగాబాద్ కేంద్రం కొంతకాలం ఆలిం డియా రేడియోగా పనిచేసి 1953లో మూత పడింది. పాలకులకు పూర్తిగా దోహదపడిన చరిత్ర కలిగిన రేడియో ప్రసారాలుగా ఇవి మిగిలి పోయాయి. డా. నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి విశ్రాంత ఉన్నతోద్యోగి మొబైల్: 94407 32392 -
మహిళలపై తాలిబన్ల అరాచకం.. మరో హుకుం జారీ
కాందహార్: అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో మహిళలపై తాలిబన్ల అరాచకం మొదలైంది. టీవీ, రేడియోల్లో మహిళా గళాలపై నిషేధం విధిస్తూ కఠినమైన ఆంక్షలు జారీ అయ్యాయి. అలాగే, తాలిబన్లు సంగీతంపై కూడా తమ వ్యతిరేకతను చాటుకున్నారు. సంగీత ప్రసారాలను నిలిపివేయాలంటూ టీవీ, రేడియో మాధ్యమాలకు హుకుం జారీ చేశారు. 1996-2001 మధ్య కాలంలో కూడా తాలిబన్లు ఇదే తరహాలో సంగీతంపై ఆంక్షలు విధించారు. క్యాసెట్ టేపులు, మ్యూజిక్ సిస్టమ్స్‌ను అప్పట్లో వారు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే, అఫ్గాన్ రేడియో స్టేషన్లలో ఇస్లామిక్ సంగీతం మాత్రం నిరభ్యంతరంగా ప్రసారం చేసుకోవచ్చని తాలిబన్లు ప్రకటించడం గమనార్హం. కాగా, ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత.. మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని, వారు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఇస్లామిక్ చట్టం ప్రకారం చదువుకోవచ్చని చెప్పిన తాలిబన్లు.. రోజుల వ్యవధిలోనే మాట మార్చారు. వారి మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో మహిళలు తమ రోజువారీ కార్యకలాపాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు తాలిబన్లు ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల్లోని మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. చదవండి: Viral Video : సముద్ర తీరంలో అద్భుతం! -
భాగ్యనగర సిగలో ఆకాశవాణి
1932లో హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అదే భాగ్యనగర్ రేడియో కేంద్రం స్థాపన. అప్పట్లో ఈ కేంద్రం నుంచి ప్రసారాలు జరపడమే విశేషం. స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాగా పుల్లారెడ్డి నాయకత్వంలో దీన్ని స్థాపించారు. ప్రతిరోజూ సాయంత్రం అప్పటి నిజాం ప్రభుత్వ రేడియో అయిన ‘దక్కన్ రేడియో’ ప్రసారాలతో పాటే భాగ్యనగర్ రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యేవి. ఈ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి నిజాం ప్రభుత్వం చాలా తికమకపడడం గమనార్హం. ఈ యంత్ర సామగ్రిని వనపర్తికి చెందిన రఘనాథరెడ్డి, కోదండరామిరెడ్డిలు అమర్చారు. స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో జరుగుతున్న విముక్తి ఉద్యమాన్ని దీని ద్వారా ప్రజల్లో విరివిగా ప్రసారం చేయగలిగారు.