భాగ్యనగర సిగలో ఆకాశవాణి | Bhagyanagara radio in siga | Sakshi
Sakshi News home page

భాగ్యనగర సిగలో ఆకాశవాణి

Published Wed, Jan 13 2016 3:22 AM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM

భాగ్యనగర సిగలో ఆకాశవాణి - Sakshi

భాగ్యనగర సిగలో ఆకాశవాణి

1932లో హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అదే భాగ్యనగర్ రేడియో కేంద్రం స్థాపన. అప్పట్లో ఈ కేంద్రం నుంచి ప్రసారాలు జరపడమే విశేషం. స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాగా పుల్లారెడ్డి నాయకత్వంలో దీన్ని స్థాపించారు. ప్రతిరోజూ సాయంత్రం అప్పటి నిజాం ప్రభుత్వ రేడియో అయిన ‘దక్కన్ రేడియో’ ప్రసారాలతో పాటే భాగ్యనగర్ రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యేవి. ఈ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి నిజాం ప్రభుత్వం చాలా తికమకపడడం గమనార్హం.

ఈ యంత్ర సామగ్రిని వనపర్తికి చెందిన రఘనాథరెడ్డి, కోదండరామిరెడ్డిలు అమర్చారు. స్టేట్ కాంగ్రెస్ నాయకత్వంలో జరుగుతున్న విముక్తి ఉద్యమాన్ని దీని ద్వారా ప్రజల్లో విరివిగా ప్రసారం చేయగలిగారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement