అమిత్‌ అజేయ డబుల్‌ సెంచరీ | amith gets double century | Sakshi
Sakshi News home page

అమిత్‌ అజేయ డబుల్‌ సెంచరీ

Published Thu, Aug 3 2017 11:13 AM | Last Updated on Mon, Sep 11 2017 11:11 PM

amith gets double century

సాక్షి, హైదరాబాద్‌: ఎ–1 డివిజన్‌ మూడు రోజుల క్రికెట్‌ లీగ్‌లో ఏఓసీ జట్టు బ్యాట్స్‌మన్‌ అమిత్‌ పచేరా (354 బంతుల్లో 221 నాటౌట్‌; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అజేయ డబుల్‌ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీస్కోరును అందించాడు. దీంతో కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఏఓసీ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 122 ఓవర్లలో 8 వికెట్లకు 481 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అమిత్‌తో పాటు విష్ణు తివారీ (253 బంతుల్లో 148; 21 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్మీత్‌ సింగ్‌ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ జట్టు తడబడింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి 54 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులతో నిలిచింది. అనురాగ్‌ హరిదాస్‌ (42) రాణించాడు. ఏఓసీ బౌలర్లలో అభిషేక్‌ 3 వికెట్లు పడగొట్టాడు.
 
ప్రణీత్, హిమాన్షు శతకాలు

స్పోర్టింగ్‌ ఎలెవన్‌ జట్టుతో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ జట్టు దీటుగా బదులిస్తోంది. బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆటముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లకు 298 పరుగులతో నిలిచింది. ప్రణీత్‌ కుమార్‌ (192 బంతుల్లో 141 బ్యాటింగ్‌; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), హిమాన్షు జోషి (183 బంతుల్లో 126; 17 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 358/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన స్పోర్టింగ్‌ ఎలెవన్‌ జట్టు 107.4 ఓవర్లలో 440 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్‌ ఫైజల్‌ అల్వి (47) రాణించాడు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బౌలర్లలో హిమాన్షు జోషి 3 వికెట్లు దక్కించుకున్నాడు.  

ఇతర మ్యాచ్‌ల స్కోర్లు

డెక్కన్‌ క్రానికల్‌ తొలి ఇన్నింగ్స్‌: 285/3 (బి. రేవంత్‌ 57, వరుణ్‌ గౌడ్‌ 56 బ్యాటింగ్, సాయి ప్రజ్ఞయ్‌ రెడ్డి 119 బ్యాటింగ్‌), ఆంధ్రాబ్యాంక్‌తో మ్యాచ్‌.
ఆర్‌. దయానంద్‌ తొలి ఇన్నింగ్స్‌: 260/9 (వై. చైతన్య కృష్ణ 46, కుషాల్‌ పర్వేజ్‌ జిల్లా 118; జి. అనికేత్‌ రెడ్డి 4/95, పి. సాకేత్‌ సాయిరామ్‌ 3/66), బీడీఎల్‌తో మ్యాచ్‌.

జెమిని ఫ్రెండ్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 283 (ఆకాశ్‌ సనా 5/53), కాంటినెంటల్‌ తొలి ఇన్నింగ్స్‌: 178 (సి. దుర్గేశ్‌ 65 నాటౌట్‌; సంకేత్‌ 3/75).
ఎవర్‌గ్రీన్‌ తొలి ఇన్నింగ్స్‌: 179, హైదరాబాద్‌ బాట్లింగ్‌ తొలి ఇన్నింగ్స్‌: 134 (ఆశ్రిత్‌ 34, మధు 36; ప్రణీత్‌ రెడ్డి 6/36).
ఇండియా సిమెంట్స్‌: 132 (హృషికేశ్‌ 37; బి. సుధాకర్‌ 5/53, షేక్‌ మహబూబ్‌ పాషా 3/ 21); ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్‌: 147/3 (ఎస్‌సీ మొహంతి 79, ఎం. సురేశ్‌ 61).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement