
మనోజ్ 210 నాటౌట్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శాంతి ఎలెవన్ బ్యాట్స్‌మన్ మనోజ్ కుమార్ (114 బంతుల్లో 210 నాటౌట్; 28 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో యూనివర్సల్ సీసీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 299 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శాంతి ఎలెవన్ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోరు చేసింది.
మనోజ్ అజేయ డబుల్ సెంచరీతో యూనివర్సల్ సీసీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సుమంత్ (60), కిరణ్ (41) ఆకట్టుకున్నారు. అనంతరం 363 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన యూనివర్సల్ సీసీ జట్టు 40 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది. శాంతి ఎలెవన్ బౌలర్లలో బి. రాహుల్ రెడ్డి 5 వికెట్లతో చెలరేగాడు.