సాత్విక్ డబుల్ సెంచరీ
హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ-డివిజన్ వన్డే క్రికెట్‌లో ఆల్ సెయింట్స్ హైస్కూల్ కుర్రాడు సాత్విక్ రెడ్డి (118 బంతుల్లో 213; 18 ఫోర్లు, 11 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లు, చూడచక్కని బౌండరీలతో మెరుపు వేగంతో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఆల్‌సెయింట్స్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 306 పరుగుల తేడాతో ధ్రువ్ ఎలెవన్‌పై భారీ విజయం సాధించింది. మొదట ఆల్‌సెయింట్స్ జట్టు 49.1 ఓవర్లలో 373 పరుగులు చేసి ఆలౌటైంది. సాత్విక్, సయ్యద్ యూసుఫ్ తమీమ్ (70 బంతుల్లో 80; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి భారీస్కోరుకు బాటలు వేశాడు. డేన్ జాన్స్‌న్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత ధ్రువ్ ఎలెవన్ 67 పరుగులకే ఆలౌటైంది. ముస్తాక్ అహ్మద్ 3, నీల్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
గన్‌రాక్ సీసీ: 102 (ఆకాశ్ 32; రోహిత్ యాదవ్ 7/15), సెయింట్ ప్యాట్రిక్స్: 105/1 (సాయి వినయ్ 52 నాటౌట్, సాహిల్ కృష్ణ 35).
రోషనారా: 316 (శ్రీకాంత్ రెడ్డి 108 నాటౌట్, ఇర్ఫాన్ ఖాన్ 60; విజయ్ 2/35, వరప్రసాద్ 2/39), వాకర్‌టౌన్: 140 (చంటి 62; బెంజమిన్ 5/25, ఉదయ్ కుమార్ 3/20).
అమీర్‌పేట్: 305/9 (ఆశిష్ యాదవ్ 129, గురిందర్ సింగ్ 53; అభినవ్ 5/51, సమీర్ 2/36), విక్టోరియా: 68 (అభినవ్ 30; నైరుత్ రెడ్డి 5/20, చందన్ 4/16).
సౌతెండ్ రేమండ్స్: 122 (హాజి 38; దీపక్ 5/26, సాహిల్ 3/33), యాదవ్ డెయిరీ: 123/1 (ప్రణీత్ 53 నాటౌట్).
హైదరాబాద్ పేట్రియాట్స్: 283 (మహేశ్ 120, పవన్ 60; అనిరుధ్ 3/32, కార్తీశ్ 3/60), టీమ్ కున్: 190/9 (అనిరుధ్ 107; ప్రణయ్ 4/38).