satwik
-
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–13తో నూర్ మొహమ్మద్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్ మైస్నం మిరాబా లువాంగ్ వరుస గేముల్లో ప్రణయ్‌ను ఓడించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జి, సతీశ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కిరణ్ 15–21, 21–13, 17–21తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో... సతీశ్ 13–21, 17–21తో జేసన్ గుణవన్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు.అష్మిత మినహా...మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్ టాన్ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సాత్విక్-చిరాగ్ జోడీని అభినందించిన సీఎం వైఎస్ జగన్
-
నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ కోమటిరెడ్డి దీక్ష
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు. సాత్విక్ సూసైట్ నోట్లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళకు దిగారు. దీంతో పోలీసులు కాలేజీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై హెచ్ఆర్డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సున్నితమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. చదవండి: సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్! -
టార్చర్ తట్టుకోలేను.. వెళ్లిపోతున్నా..
ఒక్కసారి రా.. నాన్నా.. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్.. కాలేజీలో వేధింపులు భరించలేక చనిపోదామనుకున్నాడు.. నాన్న చివరి చూపు.. అమ్మతో ఆఖరి మాటల కోసం తపించాడు. ‘జ్వరం వచ్చింది.. ఒక్కసారి రా నాన్నా..’ అని ఫోన్ చేసి తండ్రిని పిలిపించుకున్నాడు. ఆఖరి సారిగా అమ్మతో ఆప్యాయంగా మాట్లాడాడు. అంతకు ముందే ‘మిస్ యూ అన్నా.. నన్ను క్షమించు.. అమ్మానాన్నను బాగా చూసుకో’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. తరగతి గదిలోనే ఉరివేసుకున్నాడు. కాలేజీలో పెట్టే నరకం భరించలేక... సూసైడ్ నోట్లో సాత్విక్ ఆవేదన బుధవారం సాయంత్రం నార్సింగి శ్రీచైతన్య కాలేజీ హాస్టల్ నుంచి సాత్విక్ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి డ్రెస్‌ల మధ్య సూసైడ్ నోట్ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్ పేర్కొన్నాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరాడు. ‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పనిచేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నాను. మిస్ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేనిలోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉండటం చూస్తే.. కొన్ని రోజుల కిందే రాసిపెట్టుకున్నట్టు ఉందని సాత్విక్ స్నేహితులు చెప్తున్నారు. మణికొండ (హైదరాబాద్)/ షాద్‌నగర్: ‘సరిగా చదవడం లేదంటూ తిడుతున్నారు. మార్కులు రాకుంటే గేటు బయట వాచ్‌మన్‌గా కూడా పనికిరావని అవమానిస్తున్నారు. కాలేజీలో పెట్టే మెంటల్ టార్చర్‌ను, నరకాన్ని భరించలేక వెళ్లిపోతున్నాను..’’ అంటూ ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ అధ్యాపకులు, హాస్టల్ నిర్వాహకుల వేధింపులతో మనస్తాపం చెంది తరగతి గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అంతేకాదు హాస్టల్లో సాత్విక్ కనిపించడం లేదని చెప్పినా, ఉరివేసుకున్నట్టు తెలిసినా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని తోటి విద్యార్థులు చెప్పారు. తామే మోసుకుంటూ కాలేజీ బయటికి మోసుకొచ్చి, ఓ వాహనదారుడిని లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ అప్పటికే సాత్విక్ మరణించాడని తెలిపారు. బుధవారం విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగటంతో ఈ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి సాత్విక్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం చేశాక కుటుంబ సభ్యులు సాత్విక్ మృతదేహాన్ని షాద్‌నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. పరీక్షలు ఉన్నాయని ఆగి.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన నాగుల రాజు షాద్‌నగర్‌లో ఉంటూ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సాత్విక్ నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. శివరా>త్రి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన సాత్విక్.. కాలేజీలో వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే 15 రోజుల్లో పరీక్షలు ఉన్నాయని, ముగిసిన వెంటనే మరో కాలేజీలో చేర్పిస్తామని తండ్రి సర్దిచెప్పాడు. దీనితో సాత్విక్ నాలుగు రోజుల క్రితం హాస్టల్‌కు తిరిగొచ్చాడు. జ్వరం వచ్చిందంటూ సాత్విక్ ఫోన్ చేయడంతో.. తండ్రి రాజు మంగళవారం రాత్రి 8గంటల సమయంలో హాస్టల్‌కు వచ్చి మాట్లాడి, మందులు ఇచ్చి వెళ్లిపోయారు. హాస్టల్లో రాత్రి 10.30 గంటల వరకు స్టడీ అవర్ నిర్వహించారు. అందరి కంటే ముందుగా స్టడీ హాల్ నుంచి లేచిన సాత్విక్.. నేరుగా తరగతి గదికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నది ఈ గదిలోనే.. చెప్పినా పట్టించుకోని సిబ్బంది.. స్టడీ హాల్ నుంచి హాస్టల్ గదికి వచ్చాక సాత్విక్ రాలేదని గుర్తించి, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా.. ‘అతడే వస్తాడు, మీరు పడుకోండి..’ అంటూ నిర్లక్ష్యం చేశారని తోటి విద్యార్థులు చెప్పారు. గట్టిగా అరవడంతో అర గంట తర్వాత గేట్ తీశారని, కాలేజీ అంతా వెతకగా సాత్విక్ ఓ తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడని వివరించారు. వెంటనే అతడిని కిందికి దింపామని.. ప్రాణాలతో ఉన్నట్టు కనిపించడంతో కాలేజీ బయటికి తామే మోసుకుంటూ వచ్చామని తెలిపారు. ఇది చూసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని.. పైగా ఎలాంటి శబ్దం చేయకుండా తీసుకెళ్లా్లని చెప్పారని వాపోయారు. దీంతో తాము సాత్విక్‌ను మెయిన్ రోడ్డు వరకు మోసుకుంటూ వచ్చి, ఓ వాహనదారుడ్ని లిఫ్ట్ అడిగి సమీపంలోని నర్సింగ్ హోంకు తరలించామని.. కానీ అప్పటికే సాత్విక్ చనిపోయాడని డాక్టర్ చెప్పారన్నారు. ఇంటికి వచ్చిన అరగంటలోపే.. నాగుల రాజు తన కుమారుడికి మందులు ఇచ్చి సుమారు రాత్రి 10 గంటల సమయంలో షాద్‌నగర్‌లోని ఇంటికి చేరుకున్నాడు. తర్వాత అర గంట సేపటికి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచ్చింది. దీనితో కుటుంబమంతా హతాశులయ్యారు. సాత్విక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సాత్విక్ తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుడి తల్లి అలివేలు, అన్న మిథున్లు పోలీసుల కాళ్లు పట్టుకుని, నిందితులను శిక్షించాలంటూ వేడుకున్న తీరు కలచి వేసింది. సమగ్ర విచారణకు మంత్రి సబిత ఆదేశం సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవాలని, త్వరగా విచారణ నివేదిక ఇవ్వాలన్నారు. అవమానించడంతోనే.. ఎక్కువ మార్కులు రాకపోతే కాలేజీ గేటు ముందు వాచ్‌మన్‌గా కూడా పనికిరారని, ర్యాంకు వచ్చేలా చదవాలని కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్లు వేధించడంతోనే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నా కుమారుడి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. – అలివేలు, సాత్విక్ తల్లి రోదిస్తున్న సాత్విక్ తల్లి, సోదరుడు చదువు ఒత్తిడి ఇలా చేస్తుందనుకోలేదు సాత్విక్‌కు కాలేజీలో ఎదురవుతున్న ఇబ్బందులను నాకు చెప్పాడు. దీనిపై కాలేజీ వారితో మాట్లాడుతానని సర్దిచెప్పాను. ఇంతగా తట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఉంటే ఇంటికి తీసుకెళ్లే వాడిని. కాలేజీ నిర్వాహకులు ఫీజులు, ర్యాంకులు తప్ప విద్యార్థుల మనోభావాలతో పనిలేకుండా వ్యవహరిస్తున్నారు. కానీ చదువే ఇలా చావు వరకు తెస్తుందని ఊహించలేకపోయాం. – నాగుల రాజు, సాత్విక్ తండ్రి చదవడం లేదని రక్తం వచ్చేలా కొట్టారు గతంలో సరిగా చదవడం లేదం టూ నన్ను ముక్కుమీద గుద్దితే రక్తం వచ్చింది. కనికరం కూడా లేకుండా నాతోనే రక్తాన్ని కడిగించారు. షాద్‌నగర్ నుంచి వచ్చి చదువుకుంటున్న మా ఐదుగురు ఫ్రెండ్స్‌ను గాలి బ్యాచ్ అని హేళన చేసేవారు. కాలేజీ గేటు వద్ద వాచ్మన్లుగా కూడా పనికిరా రంటూ అవమానపర్చేవారు. – ప్రదీప్, తోటి విద్యార్థి వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు కాలేజీలో విద్యార్థులను ఉపాధ్యాయులు వేధిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. దీనికి కారణమైన ముగ్గురు సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తాం. విద్యాసంస్థల్లో వేధింపులు, అసౌకర్యాలపై విచారణ చేస్తాం. – స్వామి, చైతన్య కళాశాల ఏజీఎం నిందితులను అదుపులోకి తీసుకున్నాం విద్యార్థి మృతికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జగన్‌లను అదుపులోకి తీసుకున్నాం. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – జీవీ రమణగౌడ్, ఏసీపీ, నార్సింగి -
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–అశ్విని జంట
హాంకాంగ్: బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ హాంకాంగ్ ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని ద్వయం 16–21, 21–19, 21–17తో ప్రపంచ 17వ ర్యాంక్ జోడీ నిపిత్పోన్ ఫువాంగ్ఫుపెట్–సావిత్రి అమిత్రపాయ్ (థాయ్‌లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ రెండో గేమ్‌లో చివరి దశలో వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌లో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలోనే నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 10–21, 18–21తో మూడో సీడ్ దెచాపోల్–సప్సిరి (థాయ్‌లాండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారమే జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తొలుత సౌరభ్ వర్మ 21–15, 21–19తో తనోంగ్సక్ సేన్‌సోమ్‌బూన్‌సుక్ (థాయ్‌లాండ్)పై... అనంతరం 21–19, 21–19తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. శ్రీకాంత్ ముందంజ... మరోవైపు భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్‌తో తలపడాల్సిన టాప్ సీడ్, ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో తొలి రౌండ్లో శ్రీకాంత్‌కు వాకోవర్ లభించింది. ఈ ఏడాది 10 సింగిల్స్ టైటిల్స్ గెలిచి ఒకే ఏడాది అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన షట్లర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన మొమోటా... డిసెంబర్ 11 నుంచి 15 వరకు చైనాలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు ముందు తగిన విశ్రాంతి ఉండాలనే ఉద్దేశంతో హాంకాంగ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. -
విలన్ పాత్రల్లో కొంగరి జగ్గయ్య వారసుడు
కంచుకంఠాన్ని ప్రతినాయకుడి పాత్రకు ఎంత చక్కగా ఉపయోగించారో, కథానాయకుడి భూమికకు అంతే నేర్పుగా వినియోగించిన ఏకైక భారత నటుడు ‘పద్మభూషణ్’ కొంగర జగ్గయ్య. 1951లో ‘ప్రియురాలు’ సినిమాతో ఆరంభించి 125సినిమాల్లో నాయకుడిగా, 325 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల మదిలో ‘కళావాచస్పతి’గా ముద్ర వేసుకున్నారు. కొంగర జగ్గయ్య సినీవారసుడు లేడనుకుని నిరాశపడ్డారెందరో.. ఇందుకు జవాబుగానేమో? ఆయన వంశాంకురం కొంగర సాత్విక్ కృష్ణ కళల తెనాలి నుంచి నటనా రంగంలోకి దూసుకొచ్చారు. బుల్లితెర బిజీ స్టార్‌గా ఉంటూ, మరోవైపు వెండితెరపైనా సాత్విక్ అరంగేట్రం చేశాడు. సాక్షి, తెనాలి(విజయవాడ): లోక్‌సభకు ఎన్నికైన తొలి సినీనటుడిగా గుర్తింపును పొందిన కొంగర జగ్గయ్య స్వస్థలం తెనాలి దగ్గర్లోని దుగ్గిరాల మండల గ్రామం మోరంపూడి. సాత్విక్ కృష్ణ జగ్గయ్య సోదరుడు కృష్ణారావు మనుమడు. తలిదండ్రులు సుధారాణి, శ్రీనివాస్. తెనాలిలో స్థిరపడ్డారు. శ్రీనివాస్‌ది బిజినెస్ కాగా, సుధారాణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు. వీరి ఏకైక కుమారుడు సాత్విక్ కృష్ణ. తెనాలిలో డిగ్రీ తర్వాత చింతలపూడిలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజి నుంచి 2012లో బీటెక్ పట్టాతో బయటకొచ్చాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ రైలెక్కాడు. పెద్దగా కష్టపడకుండానే సాధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఏడాది పాటు పనిచేశాక, తన లక్ష్యమైన నటనారంగంకేసి చూశాడు. తొలి నుంచి నటనపై ఆసక్తి సాత్విక్ కృష్ణకు తొలినుంచి నటన అన్నా, సాంస్కృతిక కార్యక్రమాలన్నా ఆసక్తి. హైస్కూల్, కాలేజీ రోజుల్లో తనే ముందుండేవాడు. తండ్రి మాటల్లో తాత కొంగర జగ్గయ్య కళాప్రతిభను గురించి వింటూ పెరిగాడాయె. పాత సినిమాల్లో జగ్గయ్య కనిపిస్తే, ఆ సినిమా గురించి, అందులో జగ్గయ్య గారి ప్రత్యేకతల గురించి తండ్రి శ్రీనివాస్ కచ్చితంగా చెబుతూ వచ్చేవారు. కాలేజి రోజుల్లోనే సినీ ప్రయాణం చేయాలని ఉబలాటపడిన సాత్విక్ ఉత్సాహానికి తండ్రి బ్రేకులు వేశాడు. ‘విద్య లేకుండా జీవితం లేదు.. తగిన విద్యార్హత సాధించాక ఇష్టమైన రంగంలో పనిచెయ్యి’ అని తండ్రి చెప్పటంతో బుద్ధిగా చదువుకున్నాడు. ఏడాది ఉద్యోగం కూడా చేశాక, తన అభిరుచిని బహిర్గతం చేయడంతో తలిదండ్రులు, సంతోషంగా ‘బెస్టాఫ్ లక్’ చెప్పి పంపారు. ‘వాస్తవానికి యువకుడిగా ఉన్న రోజుల్లో మా నాన్న శ్రీనివాస్‌కు నటనా రంగంలోకి రావాలని అభిలషించారు. అయితే పెళ్లి, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతో తనకు వీలుపడలేదు’ అని సాత్విక్ వెల్లడించారు. తొలిసారిగా వెండితెర అవకాశమే ‘అర్ధనారి’ సినిమా రూపంలో పలకరించింది. అందులో పోలీసాఫీసర్ పాత్రలో నటించిన సాత్విక్‌కు, బుల్లితెర మంజులానాయుడు నుంచి కబురొచ్చింది. ‘శ్రావణ సమీరాలు’ టీవీ సీరియల్లో ‘షెట్టి’ అనే ప్రధాన విలన్‌గా అవకాశమొచ్చింది. ఏడాదిపాటు 150 పైగా ఎపిసోడ్లలో నటించారు. అవకాశాలు వరుసకట్టాయి. ‘కోయిలమ్మ’, ‘అభిషేకం’, ‘స్వాతిచినుకులు’, ‘అగ్నిసాక్షి’, ‘సావిత్రి’, ‘ఆడదే ఆధారం’ సీరియల్స్‌తో బుల్లితెరకు పర్మినెంట్ నటుడయ్యారు. దాదాపు అన్నీ విలన్ పాత్రలే. కోయిలమ్మ, స్వాతిచినుకులు, అగ్నిసాక్షి సీరియల్స్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సీరియల్స్ ‘మధుమాసం’లో సీబీఐ అధికారిగా, ‘గోరింటాకు’, ‘మట్టిగాజులు’లో విలన్ పాత్రలో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజతో కృష్ణవంశీ తీసిన ‘నక్షత్రం’ సినిమాలో నటించారు. ‘టీవీ సీరియల్స్‌తో బీజీగా ఉండటం సంతృప్తిగా ఉంది. సినిమాల్లోనూ ప్రూవ్ చేసుకోవాలని ఉంది’ అంటారు సాత్విక్. తాతయ్య కొంగర జగ్గయ్య గురించి అందరూ చెబుతుంటే హ్యాపీగా ఉంటుంది. ‘టాలెంటుతోనే పైకిరావాలని ముందుకెళుతున్నా, ఇంటిపేరుతో తెలిసిపోతున్నాను’ అని చెప్పారు. ఇటీవలే ఖమ్మంకు చెందిన భావనతో వివాహంతో సాత్విక్ ఓ ఇంటి వాడయ్యాడు కూడా. -
సాత్విక్ జోడీకి టైటిల్
క్యాంపినస్: బ్రెజిల్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి డబుల్స్ టైటిల్ సాధించాడు. చిరాగ్ షెట్టితో జోడీకట్టిన ఈ హైదరాబాదీ షట్లర్ పురుషుల డబుల్స్‌లో సత్తాచాటాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన తుది పోరులో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–14, 21–18తో నెదర్లాండ్స్‌కు చెందిన రెండో సీడ్ జెల్లీ మాస్–రాబిన్ టెబెలింగ్ జంటపై విజయం సాధించింది. 35 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత జోడీ వరుస గేముల్లో ప్రత్యర్థి జంటపై అలవోక విజయం సాధించింది. -
సునాయాసంగా...
నాన్జింగ్ (చైనా): మూడోసారి పతకం సాధించాలనే లక్ష్యంతో సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో కిడాంబి శ్రీకాంత్... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత స్టార్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్లో అలవోక విజయం సాధించగా... పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్‌కు కూడా ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. పదో సీడ్ సైనా రెండో రౌండ్లో 21–17, 21–8తో కేవలం 38 నిమిషాల్లో దెమిర్బాగ్ (టర్కీ)ను ఓడించింది. తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదుర్కొన్న సైనా రెండో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరంభంలోనే 8–3తో ముందంజ వేసిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత అదే జోరు కొనసాగించింది. స్కోరు 13–7 వద్ద సైనా వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 19–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే ఊపులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సైనా ఆడుతుంది. ప్రపంచ 87వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆరో ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 21–16తో గెలుపొందాడు. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండో గేమ్‌లో స్కోరు 11–10 వద్ద వరుసగా ఆరు పాయింట్లు గెలుపొంది 18–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఎన్గుయెన్ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 12–21, 21–19తో మార్కస్ ఇలిస్–క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్) జంటను ఓడించింది. ఈ గెలుపుతో గత ఏప్రిల్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ జంట చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప ద్వయం 10–21, 21–17, 21–18తో 15వ సీడ్ లామ్స్‌ఫస్–ఇసాబెల్ (జర్మనీ) జోడీపై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు తెలంగాణ క్రీడాకారిణి సిక్కి రెడ్డికి డబుల్స్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి–అశ్విని జంట 19–21, 21–10, 21–17తో చియాంగ్ కై సిన్–హంగ్ షిన్ హాన్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 16–21, 4–21తో ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రోహన్ కపూర్–కుహూ గార్గ్ 12–21, 12–21తో క్రిస్ అడ్కాక్–గాబ్రియేలా (ఇంగ్లండ్) చేతిలో... సౌరభ్ శర్మ–అనుష్క 18–21, 11–21తో చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మేఘన–పూర్వీషా 15–21, 21–19, 18–21తో దెబోరా–ఇమ్కె వాన్ డెర్ (నెదర్లాండ్స్) చేతిలో... కుహూ గార్గ్–నింగ్షి హజారికా 19–21, 11–21తో చాంగ్ చింగ్–యాంగ్ చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కోన తరుణ్–సౌరభ్ శర్మ 20–22, 21–18, 17–21తో ఆర్ చిన్ చుంగ్–టాంగ్ చున్ మాన్ (హాంకాంగ్) చేతిలో... అర్జున్–శ్లోక్ రామచంద్రన్ 14–21, 15–21తో ఓంగ్ యె సిన్–తెయో ఇ యి (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. భారత ఆటగాళ్ల నేటి షెడ్యూల్ మహిళల సింగిల్స్ సింధు (vs)ఫిత్రియాని (ఇండోనేసియా) పురుషుల సింగిల్స్ శ్రీకాంత్ (vs) పాబ్లో అబియాన్ (స్పెయిన్) సమీర్ వర్మ (vs) లిన్ డాన్ (చైనా) ప్రణయ్ (vs) యగోర్ కోఎల్హో (బ్రెజిల్) సాయిప్రణీత్ (vs) ఎన్రిక్ (స్పెయిన్) పురుషుల డబుల్స్ సాత్విక్, చిరాగ్ శెట్టి (vs) కిమ్ యాస్‌ట్రప్, ఆండెర్స్ స్కారప్ (డెన్మార్క్) సుమీత్ రెడ్డి, మనూ అత్రి (vs) టకుటో, కనెకో (జపాన్) మహిళల డబుల్స్ సిక్కి రెడ్డి, అశ్విని (vs) ఫుకుషిమా, సయాకా హిరోటా (జపాన్) ఉదయం గం. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
డబుల్స్‌లో సాత్విక్ అద్భుత ప్రదర్శన
-
‘కామన్వెల్త్’ పతకంపై సాత్విక్ జంట దష్టి
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మెరుపులు మెరిపిస్తున్న తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ కామన్వెల్త్ క్రీడల్లో పతకంపై కన్నేశాడు. ఏప్రిల్‌లో గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్లో తొలిసారి చిరాగ్ శెట్టితో కలిసి బరిలో దిగుతున్న 17 ఏళ్ల సాత్విక్ డబుల్స్‌లో పతకం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనాలనేది మా నాన్న కల. ఈ క్రీడలకు ఎంపికైన విషయం తెలియగానే చాలా సంతోషం కలిగింది. మెగా ఈవెంట్లో పతకం సాధిస్తామనే నమ్మకం ఉంది. గత ఆరు నెలలుగా మేం మంచి ప్రదర్శన చేస్తున్నాం. దీన్ని గోల్డ్‌కోస్ట్‌లోనూ కొనసాగిస్తాం’ అని తెలిపాడు. మరో ఆటగాడు చిరాగ్ శెట్టి మాట్లాడుతూ... ‘ఇప్పటివరకు భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ కామన్వెల్త్ క్రీడల్లో పతకం నెగ్గలేదు. ప్రస్తుతం మా పూల్‌లో ఇంగ్లండ్, మలేసియాకు చెందిన హేమాహేమీల్లాంటి ఆటగాళ్లున్నారు. ప్రత్యర్థులు మాకంటే మెరుగ్గా ఉన్నా వంద శాతం శ్రమించి అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం’ అని అన్నాడు. చిరాగ్‌తో జోడీ కట్టిన తొలినాళ్లలో చాలా కష్టంగా ఉండేదని... కానీ ఇప్పుడు తమ జంట అద్భుతంగా రాణిస్తోందని సాత్విక్ అన్నాడు. ‘చిరాగ్‌తో జత కట్టిన మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని సార్లు ఎవరు ముందు ఆడాలి, ఎవరు వెనుక అనే విషయంలో కూడా స్పష్టత లోపించేది. ఇద్దరి మధ్య సమన్వయం కుదిరేది కాదు. కానీ ఇప్పుడు మేం మంచి మిత్రులయ్యాం. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం ద్వారా ఆట కూడా మెరుగైంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు’ అని సాత్విక్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో ఈ జంట సెమీఫైనల్‌కు చేరింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ మంచి ప్రదర్శన చేసినా క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. ఈ ఏడాది చివరికల్లా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–15కు చేరడమే తమ లక్ష్యమని ఈ జోడీ స్పష్టం చేసింది. -
క్వార్టర్స్‌లో లోకేశ్, సాత్విక్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారులు కె. లోకేశ్ రెడ్డి, కె. సాత్విక్ రెడ్డి నిలకడగా రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ అండర్–13 సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ లోకేశ్ 21–11, 21–16తో చిరాగ్ ఖత్రి (ఢిల్లీ)పై గెలుపొందగా, 14వ సీడ్ సాత్విక్ రెడ్డి 22–20, 21–11తో దేవ్ (ఉత్తరప్రదేశ్)ను ఓడించాడు. మరోవైపు బాలుర డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ లోకేశ్– సాత్విక్ జంట 21–17, 23–21తో శివం శ్రీవాస్తవ్–అవిరల్ కుమార్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర సింగిల్స్ మ్యాచ్‌ల్లో అభినయ్ సాయిరాం (తెలంగాణ) 21–16, 21–19తో జోమి సింగం (మణిపూర్)పై, అక్షత్ రెడ్డి (తెలంగాణ) 15–21, 21–13, 21–13తో మన్రాజ్ సింగ్ (హరియాణా)పై గెలుపొందారు. అండర్–15 బాలుర మూడో రౌండ్ మ్యాచ్‌లో పుల్లెల సాయివిష్ణు 10–21, 8–21తో సిద్ధాంత్ గుప్తా చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ప్రణవ్ రావు గంధం (తెలంగాణ) 21–8, 21–10తో వెంకట చందన్ (తమిళనాడు)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ మేఘనా రెడ్డి (తెలంగాణ) 21–19, 21–14తో అనుపమ (ఉత్తరాఖండ్)పై, అభిలాష (తెలంగాణ) 21–16, 6–21, 21–16తో అదితి భట్ (ఉత్తరాఖండ్)పై, భార్గవి (తెలంగాణ) 17–21, 21–9, 21–14తో ప్రేరణ అల్వేకర్ (మహారాష్ట్ర)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. -
మిక్స్డ్ సెమీస్‌లో సాత్విక్ జంట
డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అశ్విని పొన్నప్పతో కలిసి హైదరాబాద్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని (భారత్) ద్వయం 21–18, 21–14తో స్కాట్ ఇవాన్స్ (ఐర్లాండ్)–అమందా (స్వీడన్) జోడీపై గెలిచింది. -
సాత్విక్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
-
సాత్విక్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
నిర్మల్ : నిర్మల్ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందిన సాత్విక్ కుటుంసభ్యుల్ని మంత్రి ఆదివారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా అతని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సాత్విక్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. కాగా శనివారం మధ్యాహ్నం స్థానిక శాంతినగర్ క్రాస్ రోడ్డు సమీపంలో అతివేగంగా వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌లోని కారు బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న తండ్రీ, కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది తరగతి చదువుతున్న సాత్విక్ చికిత్స పొందుతూ నిజామాబాద్ ఆసుపత్రిలో మృతిచెందాడు. మంత్రి డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని లక్ష్మణచాంద మండలం చింతల్ తండా వాసిగా గుర్తించారు. మృతుని బంధువులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. -
సాత్విక్‌కు రెండు టైటిల్స్
రన్నరప్ రుత్విక శివాని ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ డబుల్ ధమాకా సాధించాడు. అతను పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. తెలుగమ్మాయి, టాప్‌సీడ్ రుత్విక శివాని రన్నరప్‌తో తృప్తిపడింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్, భారత్‌కే చెందిన రీతుపర్ణ దాస్ 11-7, 8-11, 11-7, 14-12తో గద్దె రుత్విక శివానిని కంగుతినిపించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ షెట్టి జోడి 8-11, 11-5, 7-11, 11-8, 11-5తో టాప్‌సీడ్ సె ఫె గో-నూర్ ఇజుద్దీన్ (మలేసియా) ద్వయంపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ తుదిపోరులో టాప్‌సీడ్ సాత్విక్-మనీష జంట 5-11, 11-8, 12-10, 11-8తో హాంగ్ యి లొ-యి సి చి (మలేసియా) జోడిపై గెలిచింది. మహిళల డబుల్స్ టైటిల్ పోరులో రుు చింగ్ గో- చివ్ సియెన్ లిమ్ (మలేసియా) జోడి 11-6, 11-7, 6-11, 11-7తో జాయ్స్ చూంగ్- జీ లిన్ లిమ్ (మలేసియా) జంటపై నెగ్గింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 11-13, 11-3, 11-6, 11-6తో తొమ్మిదో సీడ్ జి జియా లీ (మలేసియా)ను కంగుతినిపించి టైటిల్ చేజిక్కించుకున్నాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సక కార్యక్రమానికి శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండీ ఎ.దినకర్‌బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి పతకాలు అందజేశారు. ఇందులో చాముండేశ్వరీనాథ్, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన సాత్విక్
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో సాత్విక్‌రెడ్డి (134 బంతుల్లో 150; 18ఫోర్లు, 1 సిక్సర్), బౌలింగ్‌లో నీల్ చక్రవర్తి (4/23), ముజ్తాబా (4/18) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో ఆల్‌సెయింట్స్ హైస్కూల్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో ఇంపీరియల్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆల్‌సెయింట్స్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. సాత్విక్ సెంచరీతో కదంతొక్కాడు. తమీమ్ (48) రాణించాడు. ఇంపీరియల్ జట్టు బౌలర్లలో సాయి మణికంఠ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంపీరియల్ జట్టు 13.3 ఓవర్లలో 43 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల వివరాలు లక్కీ ఎలెవన్: 266( మహేశ్ 120, ప్రమోద్ రెడ్డి 63; సుహాస్ రెడ్డి 6/25), రాజు సీఏ: 139 (పునీత్ 20; శ్రవణ్ యాదవ్ 4/35). ఎలెవన్ మాస్టర్స్: 229/8 (కమల్ సావరియా 51, సలీమ్ 69; చంద్రకాంత్ 3/30, వంశీ 4/19), యూత్ సీసీ: 150 (అనిల్ 48; జాఫర్ 5/30, కమల్ 3/10). హెచ్‌పీఎస్-రామంతాపూర్: 154 (వైష్ణవ్ 43; శశికుమార్ 3/25, ఆర్యన్ 3/28), సెయింట్ ప్యాట్రిక్స్: 158/5 (ఆర్యన్ 47, సాయివినయ్ 41; వైష్ణవ్ 4/44). మయూర్ సీసీ: 195 (గోవర్ధన్ 63, శ్రీకాంత్ 39; ప్రభాత్ 5/36, జకారియా 3/19), విక్టోరియా: 84 (జకారియా 50; గోవర్ధన్ 5/25), ఆడమ్స్ ఎలెవన్: 181 (జయంత్ 86; రాహుల్ రాజీవ్ 4/31, శైలేంద్ర 3/31), సెయింట్ మేరీస్: 135 (కల్యాణ్ 27, రోహిత్ సింగ్ 4/30, మాజిద్ 2/11) వాకర్‌టౌన్ 153 (శివ 35, ప్రశాంత్ 31; సాయి అభినయ్ 3/30, సురుక్షిత్ 3/24), ఏబీ కాలనీ: 25 (ప్రశాంత్ 5/9, అంజి 3/5). సన్‌షైన్ 103 (అశ్వద్ రాజీవ్ 5/27, ప్రతీక్ 4/17), సీకే బ్లూస్: 104/3 (బెనర్జీ నాటౌట్ 53; శ్రీరామ్ 33), -
సాత్విక్ డబుల్ సెంచరీ
హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ-డివిజన్ వన్డే క్రికెట్లో ఆల్ సెయింట్స్ హైస్కూల్ కుర్రాడు సాత్విక్ రెడ్డి (118 బంతుల్లో 213; 18 ఫోర్లు, 11 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లు, చూడచక్కని బౌండరీలతో మెరుపు వేగంతో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఆల్‌సెయింట్స్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 306 పరుగుల తేడాతో ధ్రువ్ ఎలెవన్‌పై భారీ విజయం సాధించింది. మొదట ఆల్‌సెయింట్స్ జట్టు 49.1 ఓవర్లలో 373 పరుగులు చేసి ఆలౌటైంది. సాత్విక్, సయ్యద్ యూసుఫ్ తమీమ్ (70 బంతుల్లో 80; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి భారీస్కోరుకు బాటలు వేశాడు. డేన్ జాన్స్‌న్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత ధ్రువ్ ఎలెవన్ 67 పరుగులకే ఆలౌటైంది. ముస్తాక్ అహ్మద్ 3, నీల్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గన్‌రాక్ సీసీ: 102 (ఆకాశ్ 32; రోహిత్ యాదవ్ 7/15), సెయింట్ ప్యాట్రిక్స్: 105/1 (సాయి వినయ్ 52 నాటౌట్, సాహిల్ కృష్ణ 35). రోషనారా: 316 (శ్రీకాంత్ రెడ్డి 108 నాటౌట్, ఇర్ఫాన్ ఖాన్ 60; విజయ్ 2/35, వరప్రసాద్ 2/39), వాకర్‌టౌన్: 140 (చంటి 62; బెంజమిన్ 5/25, ఉదయ్ కుమార్ 3/20). అమీర్‌పేట్: 305/9 (ఆశిష్ యాదవ్ 129, గురిందర్ సింగ్ 53; అభినవ్ 5/51, సమీర్ 2/36), విక్టోరియా: 68 (అభినవ్ 30; నైరుత్ రెడ్డి 5/20, చందన్ 4/16). సౌతెండ్ రేమండ్స్: 122 (హాజి 38; దీపక్ 5/26, సాహిల్ 3/33), యాదవ్ డెయిరీ: 123/1 (ప్రణీత్ 53 నాటౌట్). హైదరాబాద్ పేట్రియాట్స్: 283 (మహేశ్ 120, పవన్ 60; అనిరుధ్ 3/32, కార్తీశ్ 3/60), టీమ్ కున్: 190/9 (అనిరుధ్ 107; ప్రణయ్ 4/38).