కదం తొక్కిన సాత్విక్ | satwik big century helps to all saint high school victory | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన సాత్విక్

Published Mon, Aug 22 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

satwik big century helps to all saint high school victory

సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో సాత్విక్‌రెడ్డి (134 బంతుల్లో 150; 18ఫోర్లు, 1 సిక్సర్), బౌలింగ్‌లో నీల్ చక్రవర్తి (4/23), ముజ్తాబా (4/18) చెలరేగడంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో ఆల్‌సెయింట్స్ హైస్కూల్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో ఇంపీరియల్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆల్‌సెయింట్స్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. సాత్విక్ సెంచరీతో కదంతొక్కాడు. తమీమ్ (48) రాణించాడు. ఇంపీరియల్ జట్టు బౌలర్లలో సాయి మణికంఠ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంపీరియల్ జట్టు 13.3 ఓవర్లలో 43 పరుగులకే ఆలౌటైంది.
 
 ఇతర మ్యాచ్‌ల వివరాలు


  లక్కీ ఎలెవన్: 266( మహేశ్ 120, ప్రమోద్ రెడ్డి 63; సుహాస్ రెడ్డి 6/25), రాజు సీఏ: 139 (పునీత్ 20; శ్రవణ్ యాదవ్ 4/35).
 
  ఎలెవన్ మాస్టర్స్: 229/8 (కమల్ సావరియా 51, సలీమ్ 69; చంద్రకాంత్ 3/30, వంశీ 4/19), యూత్ సీసీ: 150 (అనిల్ 48; జాఫర్ 5/30, కమల్ 3/10).
 
  హెచ్‌పీఎస్-రామంతాపూర్: 154 (వైష్ణవ్ 43; శశికుమార్ 3/25, ఆర్యన్ 3/28), సెయింట్ ప్యాట్రిక్స్: 158/5 (ఆర్యన్ 47, సాయివినయ్ 41; వైష్ణవ్ 4/44).
 
  మయూర్ సీసీ: 195 (గోవర్ధన్ 63, శ్రీకాంత్ 39; ప్రభాత్ 5/36, జకారియా 3/19), విక్టోరియా: 84 (జకారియా 50; గోవర్ధన్ 5/25),
 
  ఆడమ్స్ ఎలెవన్: 181 (జయంత్ 86; రాహుల్ రాజీవ్ 4/31, శైలేంద్ర 3/31), సెయింట్ మేరీస్: 135 (కల్యాణ్ 27, రోహిత్ సింగ్ 4/30, మాజిద్ 2/11)
  వాకర్‌టౌన్ 153 (శివ 35, ప్రశాంత్ 31; సాయి అభినయ్ 3/30, సురుక్షిత్ 3/24), ఏబీ కాలనీ: 25 (ప్రశాంత్ 5/9, అంజి 3/5).
  సన్‌షైన్ 103 (అశ్వద్ రాజీవ్ 5/27, ప్రతీక్ 4/17), సీకే బ్లూస్: 104/3 (బెనర్జీ నాటౌట్ 53; శ్రీరామ్ 33),

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement