ఆధునిక కాలంలో న్యూట్రిషన్లు బరువు తగ్గడానికి వివిధ రకాల డైట్‌లను పరిచయం చేశారు. వాటిలో ప్రతి డైట్ ప్రత్యేకమైనది, ఆరోగ్యకరమేనదే. అయితే ఆయా వ్యక్తులు ఆరోగ్య రీత్యా తమకు సరిపడేది ఎంపిక చేసుకుని మరీ పాటించి విజయవంతం అవుతున్నారు. అయితే ఎన్నో ఏళ్ల క్రితం మన ఆయుర్వే గ్రంథాల్లో బరువుని అదుపులో ఉంచుకోవడం ఎలాగో వివరించారు. అందుకోసం ఆహారం ఎలా తీసుకుంటే మంచిదో సవివరంగా చెప్పారు.
ఆ ఆహారాలు మనకు అందుబాటులో ఉండేవే, సులభంగా ఆచరించగలిగేవే. అయితే కాస్త ఓపికతో కూడిన నిబద్ధతతో క్రమం తప్పకుండా ఈ యోగా డైట్(Yogic diet) అనుసరిస్తే బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు యోగా నిపుణులు. అదెలాగో చూద్దామా..!.
ది యోగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ హన్సాజీ యోగేంద్ర(Dr Hansaji Yogendra)
ఒక ఇంటర్వ్యూలో బరువుని తగ్గించే(weight loss) ఆహారం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బుద్ధి పూర్వకమైన ఆహారపు(మైండ్‌ఫుల్‌నెస్) అలవాట్లతోనే బరువుని అదుపులో ఉంచుకోగలమని చెబుతున్నారు. ఇప్పుడు న్యూట్రీషన్లు చెబుతున్నారే ప్రోటీన్ల(Protein)ని వాటి గురించి అనాడే యోగా గురువులు చెప్పారని అన్నారు. కాకపోతే ఇలా ప్రోటీన్లని చెప్పకపోయినా..శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెప్పారు.
గుమ్మడి విత్తనాలు, నట్స్, పల్లీలు, శెనగలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని అన్నారు. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోమని సూచించేరు. ముఖ్యంగా అధికంగా నీళ్లు తీసుకోవాలని అన్నారు. ఒక కోడిగుడ్డు కంటే చియా గింజలు, అవిసె గింజలు మంచివని చెప్పారు.
భోజనం తినడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఎక్కువ తినకుండా ఉంటామని చెబుతున్నారు. ఇక అన్నంలో పప్పు, రోటీ, సబ్జీ తినవ్చ్చు అన్నారు. కొద్దిగా సలాడ్‌లు కూడా జోడించొచ్చు. స్నాక్స్ కోసం పల్లీలు, మఖానా, శెనగలు వంటివి తీసుకోండి. ఇక రాత్రి భోజనంలో ఒక పెద్ద గిన్నె సూప్ తాగడం, ఆకలిగా అనిపిస్తే ఆ సూప్‌లో కొద్దిగా బియ్యం, రోటీల ముక్కలు జోడిస్తే సరి అని చెబుతున్నారు. ఇలా తీసుకుంటే నెల రోజుల్లోనే స్లిమ్‌గా మారడమే గాక బరువు కూడా అదుపులో ఉంటుందట.
(చదవండి: స్కిన్ టోన్‌కి సరితూగే స్టన్నింగ్ మేకప్! ఏ వధువైనా అదిరిపోవాల్సిందే..)
Comments
Please login to add a commentAdd a comment