
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు. సాత్విక్ సూసైట్ నోట్‌లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళకు దిగారు. దీంతో పోలీసులు కాలేజీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై హెచ్‌ఆర్‌డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సున్నితమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు.
చదవండి: సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్!
Comments
Please login to add a commentAdd a comment